
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ అసోసియేట్ సభ్యులుగా 15 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిరేన్ రిజిజు, జితేంద్ర సింగ్ సైతం ఉన్నారు. 26న వెలువడిన లోక్‌సభ బులెటిన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌కు కిరేన్ రిజిజు, తపిర్ గావో ప్రాతినిధ్యం వహిస్తారు. అస్సాంకు పల్లవ్ లోచన్ దాస్, అబ్దుల్ ఖలేక్, రాజ్‌దీప్ రాయ్, దిలీప్ సైకియా, నబ సరానియా, మణిపూర్‌కు లోర్హో ఫోజ్, రంజన్ రాజ్‌కుమార్, నాగాలాండ్‌కు టోఖెహో యెఫ్తోమి ప్రాతినిధ్యం వహిస్తారు.
జమ్మూకశ్మీర్‌కు ఫరూక్ అబ్దుల్లా, మొహమ్మద్ అబ్దుల్ లోనె, హస్నైన్ మసూదీ, జుగల్ కిశోర్ శర్మ, జితేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో కేంద్రం మార్చి 6న పునర్ విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఎక్స్–అఫీషియో సభ్యులుగా ఉంటారు. పునర్విభజన చట్టం2002, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జమ్మూకశ్మీర్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వీరు పాలుపంచుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment