
సాక్షి, పెద్దపల్లి : రామగుండం ఎరువుల కార్మాగారాన్ని సందర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రులకు షాక్ తగిలింది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఆర్ఎఫ్‌సిఎల్ ప్లాంటు ఎదుట ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేష్ నేత ధర్నాకు దిగారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే అధికారులతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు పునరావాసం కల్పిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.