![CM Revanth Reddy, Minister Uttam Kumar Reddy Delhi Tour Updates - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/5/Rajnathsingh.jpg.webp?itok=Yhu3ur-b)
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం పర్యటన ముగిసింది. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్.. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ రోజు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ సమస్యలపై చర్చించారు.
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. కేంద్ర నుంచి బీఆర్జీఎఫ్ కింద రావలసిన రూ.1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని వినతించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ!
Comments
Please login to add a commentAdd a comment