రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు నిధులు మంజూరు చేయాలని ఏపీ విద్యార్థుల జేఏసీ డిమాండ్ చేసింది.
కర్నూలు: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు నిధులు మంజూరు చేయాలని ఏపీ విద్యార్థుల జేఏసీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర మంత్రులు కృషి చేయాలని, లేకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని చెప్పారు.
గురువారం రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థుల జేఏసీ నాయకులు ఏపీ ప్రత్యేక హోదాపై సమావేశమై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డిమాండ్లను తీర్చకుంటే కేంద్ర మంత్రులను రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.