సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ భారత్ అభియాన్ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు విధిగా హాజరుకావాలని విద్యాశాఖ డెరైక్టరేట్ ఆదేశించింది. గాంధీ జయంతి నాడు విద్యార్థులు, సిబ్బంది పాఠశాలలకు విధిగా హాజరుకావాలని, వారు స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేసి, పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఇంటికి వెళ్లిపోవచ్చని పేర్కొంది. సింగిల్ షిఫ్టులో పనిచేసే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతోపాటు సిబ్బంది ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు, రెండో షిఫ్టులో పనిచేసే పాఠశాలల విద్యార్థులు , సిబ్బంది మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని విద్యాశాఖ తన సర్య్కులర్ పేర్కొంది. అరగంటసేపు అసెంబ్లీ జరిపి విద్యార్థులకు పరిశుభ్రత ప్రాధాన్యాన్ని బోధించాలని ఆ తరవాత వారితో స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేయించాలని పేర్కొంది.
ఆతరువాత వారికి మధ్యాహ్న భోజనం వడ్డించి ఇంటికి పంపించాలని పేర్కొంది. ఆ తరువాత కూడా విద్యార్థులకు ప్రతిరోజూ అసెంబ్లీలో పరిశుభ్రతపై అవగాహరన కల్పించాలని, స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేయించాలని, విద్యార్థుల పుట్టిన రోజున వారితో మొక్కలు నాటించాలని కూడా విద్యాశాఖ డైరక్టరేట్ పాఠశాలలకు సూచించింది. స్వచ్ఛ్ భారత్ మిషన్ కోసం తాము జారీ చేసిన ఆదేశాల ఏవిధంగా అమలు చేస్తున్నారనే విషయం తెలుసుకోవడం కోసం విద్యాశాఖ అధికారులతో పాటు ఇతర అధికారులు ఆయా పాఠశాలలను సందర్శిస్తారు. ఇదిలాఉంచితే స్వచ్ ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇండియా గేట్ వద్ద నిర్వహించే నడక కార్యక్రమంలో 2,500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. వారితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రెండున స్వచ్ఛ్ భారత్ అభియాన్
Published Mon, Sep 29 2014 10:04 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement
Advertisement