
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మధ్య పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం కుర్చీ నాదంటే.. నాదంటూ పోట్లాడుకున్నా.. ఇంటి గొడవ గడప దాటేవరకేనని రుజువు చేశారు. సచిన్ పైలెట్ కుటుంబంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయగా.. పైలెట్‌కు మద్దతుగా సీఎం గహ్లోత్ నిలిచారు.
సచిన్ పైలెట్ తండ్రి సొంత ప్రజలపైనే బాంబులు వేశారని బీజేపీ నేత అమిత్ మాలవ్య ఆరోపించారు. సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీలపై ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఏయిర్ ఫోర్స్‌లో పనిచేసే క్రమంలో వారిద్దరూ కలిసి 1966, మార్చి 5న మిజోరాం ఐజ్వాల్‌లో బాంబు దాడి జరిపారని అన్నారు. ప్రతిఫలంగా వారికి ఇందిరా గాంధీ మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. దీనిపై పైలెట్ కూడా బీజేపీపై మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇవ్వొద్దని దుయ్యబట్టారు.
ఈ పరిణామాల అనంతరం సచిన్ పైలెట్‌కు మద్దతుగా నిలిచారు సీఎం గహ్లోత్. భారత వైమానిక దళానికి సేవలు చేసినవారిపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఇది ఏయిర్ ఫోర్స్ సేవలను అవమానించడమేనని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలెట్ ధైర్యవంతుడైన పైలెట్ అని అన్నారు. దేశం మొత్తం ఖండించాల్సిన అంశమని చెప్పారు.
कांग्रेस नेता श्री राजेश पायलट भारतीय वायुसेना के वीर पायलट थे।
— Ashok Gehlot (@ashokgehlot51) August 16, 2023
उनका अपमान करके भाजपा भारतीय वायुसेना के बलिदान का अपमान कर रही है। इसकी पूरे देश को निंदा करनी चाहिए।
రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యాన్ని తాజా ఘటన సూచిస్తోంది. పార్టీలో అంతర్గతంగా గొడవలు ఉన్న ఇతర పార్టీలు విమర్శలు చేస్తే ఐక్యంగా పోరాడుతున్నారు.
ఇదీ చదవండి: బాంబులు వేసింది భారత్-పాక్ యుద్ధంలో.. బీజేపీ నేతకు సచిన్ పైలట్ చురకలు