
జైపూర్: రాజస్తాన్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించిన ఆయనకు నోటీసులు పంపించారు. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలతో షకావత్ బేరసారాలు ఆడిన ఒక ఆడియో బయటకు వచ్చి సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా)
దీనిపై షకావత్ స్పందిస్తూ ‘నేను ఈ విషయంలో ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఆడియోలో ఉన్నది నా గొంతు కాదు. నన్ను ప్రశ్నించడానికి రమ్మంటే తప్పకుండా వెళతాను’ అని షెకావత్ తెలిపారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు సచిన్ పైలట్ క్యాంప్‌లోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కుట్ర చేస్తున్నారని గత వారం కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయగానే పోలీసులు ఇద్దరిపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేశారు. అందులో ఒకరు గజేంద్రసింగ్ షకావత్. దీనిపై స్పందించిన బీజేపీ తమ పార్టీలోని వివాదాలను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఫోన్ కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ ఆడియో టేపులకు సంబంధించి విచారణ జరిపాలని సీఎం ఆశోక్ గ్లెహాట్ పోలీసులను ఆదేశించారు. (రాజస్తాన్ రాజకీయ రచ్చ.. రంగంలోకి అమిత్ షా)
Comments
Please login to add a commentAdd a comment