గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను అడ్డం పెట్టుకుని దందాలు నడిపిన వారి పేర్లు ఒక్కొక్కటే బయటికొస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నయీమ్ పేరు చెప్పి తమను బెదిరించినట్లు పలువురు బాధితులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ఎమ్మెల్యే తెరవెనుకే కథంతా నడిపారని సమాచారం. నయీమ్ ప్రధాన అనుచరునిగా పోలీసులు భావిస్తున్న శేషన్న, నయీమ్ బంధువు ఖలీమ్లను అడ్డంపెట్టుకుని ఆయన ఈ వ్యవహారాలన్నీ నడిపినట్లు చెబుతున్నారు. పైగా తన నియోజకవర్గంలోనే గాక నల్లగొండ చుట్టుపక్కల భూ లావాదేవీల్లోనూ వేలు పెట్టినట్టు ఫిర్యాదులున్నాయి.
Published Sun, Oct 2 2016 6:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
Advertisement