సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తొలుత పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి అరెస్ట్ చేసింది.
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (యూజీ)-2024 పరీక్షలో అవకతవకలపై దూమారం చెలరేగింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది.
సీబీఐ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..మనీష్ కుమార్ నీట్ ప్రశ్నా పత్రాన్ని క్వశ్చన్ పేపర్‌ను 12మంది విద్యార్ధులు అంతకంటే ఎక్కువ మంది ఇచ్చాడని, అనంతరం మనీష్ కుమార్ తన కారుతో స్వయంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలుస్తోంది.
మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్ పేపర్ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరుపయోగంగా ఉన్న ఓ స్కూల్‌ను ఉపయోగించినట్లు సీబీఐ గుర్తించింది.
#WATCH | NEET paper leak matter | CBI team arrives at CBI office in Patna, Bihar with accused Baldev Kumar alias Chintu and Mukesh Kumar.
A Special CBI Court in Patna sent both to CBI remand, yesterday. pic.twitter.com/mvQhG2aplH— ANI (@ANI) June 27, 2024
Comments
Please login to add a commentAdd a comment