విజయాన్ని నిర్ణయించే కీలక విభాగం.. | Determine the success of a key section | Sakshi
Sakshi News home page

విజయాన్ని నిర్ణయించే కీలక విభాగం..

Published Thu, Nov 13 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

విజయాన్ని నిర్ణయించే కీలక విభాగం..

విజయాన్ని నిర్ణయించే కీలక విభాగం..

త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఉన్నాయి..ఈ రెండు రకాల పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలో జనరల్ స్టడీస్విభాగం చాలా కీలకమైంది.. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టేప్రతి నియామక ప్రక్రియలో తప్పనిసరిగా జనరల్ స్టడీస్ విభాగం ఉంటుంది..సబ్జెక్ట్ పేపర్లలో అందరూ అభ్యర్థులు మెరుగైన స్కోర్ సాధించవచ్చు..కానీ అన్ని సబ్జెక్ట్‌ల సమహారంగా ఉండే ఈ జనరల్ స్టడీస్‌లో పొందిన మార్కులేవిజయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషియస్తాయని చెప్పొచ్చు..ఈ నేపథ్యంలో జనరల్ స్టడీస్‌లో కీలకమైన మెంటల్ ఎబిలిటీ విభాగానికి  సంబంధించి ఏవిధంగా సన్నద్ధం కావాలి, సిలబస్, తదితర అంశాలపై విశ్లేషణ..
 
 మెంటల్ ఎబిలిటీ
 
జనరల్ స్టడీస్‌లో మిగతా సబ్జెక్ట్‌లో పోల్చితే మెంటల్ ఎబిలిటీ విభాగం భిన్నమైంది. ఎందుకంటే జ్ఞాపకశక్తి కంటే తార్కిక వివేచన ద్వారా మాత్రమే ఇందులోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం సాధ్యమవుతుంది. ప్రిపరేషన్ పరంగా సులువుగా ఉండడంతో మిగతా సబ్జెక్ట్‌లలో దాదాపు అభ్యర్థులందరూ అందులో మెరుగైన స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. అడిగే ప్రశ్నలు తక్కువగా ఉన్నప్పటికీ.. మెంటల్ ఎబిలిటీ విభాగం కీలకంగా మారుతోంది. కాబట్టి ఈ విభాగంలో సాధించిన మార్కులే విజయ ప్రస్థానాన్ని నిర్ణయించడంలో ముఖ్య భూమికను పోషిస్తాయని చెప్పొచ్చు.
 
దాదాపు 20

జనరల్ స్టడీస్‌లో భాగంగా మెంటల్ ఎబిలిటీ నుంచి దాదాపు 20 ప్రశ్నలు వస్తాయి. ఇందులో 17-18 ప్రశ్నలు వెర్బల్ రీజనింగ్ నుంచి ఇస్తే.. మిగతా 2-3 ప్రశ్నలు అర్థమెటిక్ నుంచి అడుగుతున్నారు. నాన్ వెర్బల్ రీజనింగ్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కొన్ని సందర్భాల్లో గ్రూప్-2, జేఎల్ వంటి పరీక్షల్లో ఒకటి, రెండు ప్రశ్నలను ఈ విభాగం నుంచి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ వెర్బల్ రీజనింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ ప్రిపరేషన్ సాగించడం ప్రయోజనకరం. అంతేకాకుండా వీలైనన్నీ అర్థమెటిక్ ప్రశ్నలను సాధన చేయడం ఉపయోగకరం.
 
కొత్తగా

వెర్బల్ రీజనింగ్ విషయానికొస్తే.. ఇది అకాడమీ పుస్తకాలలో ఎక్కడా కనిపించదు. కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొంత మంది అభ్యర్థులు దీన్ని కొత్త అంశంగా భావిస్తారు. ఇది గణితంలో ఒక భాగం కానప్పటికీ.. గణితంతో కొంత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇందులో పట్టు సాధించాల్సిన అంశాలు.. సిరీస్, అనాలజీ (పోలిక పరీక్ష), క్లాసిఫికేషన్ (వర్గీకరణ పరీక్ష), కోడింగ్-డీకోడింగ్, రక్త సంబంధాలు, దిక్కులు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, తార్కిక చిత్రాలు, పజిల్స్, మిస్సింగ్ నెంబర్స్, కేలండర్ లెక్కలు, మిస్సింగ్ లెటర్స్, గడియారం లెక్కలు.
 
తెలిసిన విభాగం

అర్థమెటిక్.. అభ్యర్థులందరికీ పరిచయం ఉండే విభాగం. ఇందులోని అంశాలన్నీ 5-10వ తరగతి వరకు గణిత పుస్తకాల్లో కనిపిస్తాయి. ఈ విభాగం ప్రిపరేషన్ కోసం పట్టు సాధించాల్సిన అంశాలు.. వివిధ రకాల సంఖ్యలు, కాలం- దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, శాతాలు, క.సా.గు.-గ.సా.భా., లాభం-నష్టం, భాగస్వామ్యం, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, క్షేత్రమితి (వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఘనపరిమాణాలు) తదితరాలు.
 
మూలాలు తెలుసుకోవాలి

‘మెంటల్ ఎబిలిటీ అంశాలు సైన్స్ వారికి అనుకూలం’ అనే అభిప్రాయం బలంగా ఉంటుంది. కానీ గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే.. ‘ఫలానా నేపథ్యం ఉన్న వారికే అనుకూలం’ అనే తరహా ప్రశ్నలు కనిపించట్లేదు. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో తమ నేపథ్యానికి సంబంధించని అంశాలు చదివేటప్పుడు.. మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక అంశానికి సంబంధించి నేపథ్యం నుంచి ప్రిపరేషన్ సాగిస్తూ సదరు అంశంపై విస్తృత అవగాహన పెంచుకోవాలి.
 
నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు

6 నుంచి 10వ తరగతుల మ్యాథ్స్ పుస్తకాల్లోని అంశాల్లో అవసరమైన కాన్సెప్ట్స్‌ను సాధన చేయూలి. ఆ తర్వాత గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రధానంగా... క.సా.గు., భిన్నాలు, సమీకరణాలు, సాధన, సంఖ్యలు, బీజీయ గణితం, వ్యాపార గణితం అంశాలపై దృష్టిసారించాలి. నిరంతం ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. మ్యాథ్స్ స్టెప్స్ కరెక్టుగా సాధన చేయూలి. అంతేకాకుండా వేగంగా, కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించాలి. ఇందుకు ఉపకరించే ఏకైక మార్గం ప్రాక్టీస్. తద్వారా సమస్యా సాధనలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది.
 
సూచనలు:

సిలబస్‌కు సంబంధించి సరైన మెటీరియల్ లేదా పుస్తకాలను గుర్తించడం.
సంబంధిత సబ్జెక్టులో ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? అని గత ప్రశ్నపత్రాల ద్వారా తెలుసుకోవడం.
దానికి అనుగుణంగా సంబంధిత అంశంపై సినాప్సిస్ రూపొందించుకోవడం.

ఇలా చేస్తే పరీక్షలో ప్రశ్న ఏ మూల నుంచి అడిగినా సమాధానం గుర్తించవచ్చు. చదివేటప్పుడు కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ సాగించడం అవసరం. దీనివల్ల సంబంధిత అంశంపై అవగాహన లభిస్తుంది. పరీక్ష హాల్లో సమాధానం స్ఫురణకు రాకున్నా.. ఎలిమినేషన్ టెక్నిక్ వినియోగించేందుకు మార్గం ఏర్పడుతుంది.
 
రిఫరెన్స్ బుక్స్:
     
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్. అగర్వాల్
క్వికర్ మ్యాథ్స్ - ఎం.థైరా
మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్-ఎడ్గర్ థోర్ప్
6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాలు
 

పట్టు సాధించాల్సినవి
 
వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్ ప్రశ్నలను త్వరగా, తప్పులు లేకుండా సాధించాలంటే నేర్చుకోవాల్సిన అంశాలు..
 {పాథమిక సంఖ్యా వాదం, వివిధ రకాల సంఖ్యలు, భాజనీయత సూత్రాలు 35 వరకు వర్గాలు  15 వరకు ఘనాలు 100లోపు ప్రధాన సంఖ్యలు  20 వరకు ఎక్కాలు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి ప్రక్రియలను వేగంగా చేసే నేర్పు సాధించాలి. ఇందుకోసం వేదగణిత చిట్కాలను సాధన చేయాలి.
     
అర్థమెటిక్‌లోని ప్రతి అంశం సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సూత్రాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.
ఆంగ్ల అక్షరాలను అ నుంచి ో వరకు, ో నుంచి అ వరకు వేగంగా చదవగలగాలి.అ నుంచి ో వరకు అక్షరాల స్థాన విలువలు అంటే అ-1, ఆ-2, ..-26 పక్కాగా తెలిసి ఉండాలి అ నుంచి ో వరకు అక్షరాల తిరోగమన స్థాన విలువలు అంటే అ-26, ఆ-25, ....ో-1 క్షుణ్నంగా నేర్చుకోవాలి. అ నుంచి ో వరకు అక్షరాల తిరోగమన స్థాన అక్షరాలు అంటే అ-ో; ఆ-్గ, ఇ-గీ... ో-అ పై పట్టు సాధించాలి. ఆంగ్లంలో అచ్చులు అ, ఉ, ఐ, ై, ్ఖ తెలిసి ఉండాలి వేద గణిత చిట్కాలను ప్రాక్టీస్ చేయాలి.
 
గతంలో వచ్చిన ప్రశ్నలు
 
1.    44, 484, 529, 566, 625.. వీటిలో ఒక సంఖ్య భిన్నమైంది. ఆ సంఖ్య?
     1) 484     2) 529     3) 625    4) 566
     సమాధానం: 4
     వివరణ: ఇక్కడ ఇచ్చిన సంఖ్యలలో 566 తప్ప మిగతావన్నీ కచ్చితమైన వర్గాలు.
 2.    ఒక వేళ ఈఖఐగఉఖ = 12, ్కఉఈఉఖీఖఐఊ = 20, అఇఇఐఈఉూఖీ = 16 అయితే ఇఅఖ =?
     1) 3     2) 8     3) 10     4) 6
     సమాధానం: 4
     
వివరణ: ఈఖఐగఉఖ లోని అక్షరాల సంఖ్య 6. దీన్ని రెట్టింపు చేసి 12 రాసారు.
అక్షరాల సంఖ్య 10. దీన్ని రెట్టింపు చేస్తే 20.
అక్షరాల సంఖ్య 8. దీన్ని రెట్టింపు చేసి 16 రాసారు.
అదేవిధంగా ఇఅఖ లోని అక్షరాల సంఖ్య 3. దీన్ని రెట్టింపు చేస్తే 6.
కాబట్టి సమాధానం: 6

 3.    కింది వాటిలో భిన్నమైంది?
     1) ఈఎఒక     2) ఖఖీగిో
     3) ఊఏఓూ     4) గీఅఈఎ
     సమాధానం: 3
వివరణ: ఇక్కడ ఇచ్చిన అక్షరాల సమూహంలో.. అక్షరాల మధ్య వ్యత్యాసం 3. కానీ ఊఏఓూలో మొదటి రెండు అక్షరాల మధ్య తేడా 3 లేదు.

4.    రాహుల్ ఉత్తరం వైపు 4 కి.మీ. ప్రయాణించి, కుడి వైపు మరో 8 కి.మీ. ప్రయాణించాడు. తర్వాత కుడి వైపు మరో 20 కి.మీ. ప్రయాణించి చివరగా కుడివైపు 20 కి.మీ. ప్రయాణించాడు. ఇప్పుడతను తన ప్రారంభ స్థానం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు?
     1) నైరుతి 20 కి.మీ.    2) ఈశాన్యం 20 కి.మీ.
     3) నైరుతి 16 కి.మీ.    4) ఆగ్నేయం 20 కి.మీ.
     సమాధానం: 1
 
 వివరణ: ప్రారంభం స్థానం అ, తుది స్థానం ఊ
 కావాల్సిన దూరం అఊ పటం ఆధారంగా అఉ = 20 - 4 = 16 కి.మీ.
 ఉఊ = 20 - 8 = 12 కి.మీ.
 
5.    సునీల్ ఎదురుగా వ స్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ ఆ అమ్మాయి తల్లి, మా నాన్న ఏకైక కుమారుడి భార్య అని చెప్పాడు. అయితే సునీల్‌కు ఆ అమ్మాయి ఏమవుతుంది?
     1) తల్లి     2) భార్య     3) కూతురు     4) సోదరి
     సమాధానం: 3
    
వివరణ: సునీల్ తండ్రి ఏకైక కుమారుడు అంటే అతనే. సునీల్ భార్య.. తాను పరిచయం చేస్తున్న అమ్మాయి తల్లి అంటే ఆ అమ్మాయి సునీల్‌కు కూతురు అవుతుంది.

 6.    2, 3, 8, 31, 154, 923.....
     1) 5224     2) 6460     3) 6461     4) 7236
     సమాధానం: 2

వివరణ: 2ణ2ృ1 = 3; 3ణ3ృ1 = 8; 8ణ4ృ1 = 31; 31ణ5ృ1 = 154; 154ణ6ృ1 = 923;
     అదేవిధంగా 923ణ7ృ1 = 6461
 
7.    కింది వాటిలో ఏ సంవత్సరం 2005ను పోలి ఉంటుంది?
     1) 2009     2) 2011     3) 2012     4) 2015
     సమాధానం: 2
     
వివరణ: లీప్ సంవత్సరం తర్వాత వచ్చే ప్రతి సంవత్సరం.. ఆ సంవత్సరం నుంచి 6 సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరాన్ని పోలి ఉంటుంది.
 \u3149?ట్చఛఙ 2005 సంవత్సరం 2005+6=2011 సంవత్సరాన్ని పోలి ఉంటుంది.
 
8.     ఒక నిర్దిష్ట సంకేత భాషలో కఐఖీఅఓఉను 4356127 గా రాస్తే ఖీఉఅకను అదే భాషలో ఏ విధంగా పేర్కొనవచ్చు?
     1) 13457     2) 75614     3) 65741     4) 56714
     సమాధానం: 4
     M   I   S   T   A   K   E
      4   3   5    6   1    2    7
     STEAMలోని ఐదు అక్షరాలు కఐఖీఅఓఉలో ఉన్నాయి. కాబట్టి ఆ అక్షరాల కోడ్‌లను రాస్తే సమాధానం వస్తుంది.
          T     E     A     M
     5      6     7     1       4
     \ STEAM  కోడ్ 56714

 9.    {పస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు. నాలుగు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతం తండ్రి, కొడుకుల వయసులు ఎంత?
     1) 24 సంవత్సరాలు, 6 సంవత్సరాలు
     2) 28 సంవత్సరాలు, 7 సంవత్సరాలు
     3) 32 సంవత్సరాలు, 8 సంవత్సరాలు
     4) 36 సంవత్సరాలు, 10 సంవత్సరాలు
     సమాధానం: 3
     వివరణ:మొదటి మూడు ఆప్షన్‌లలో తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు ఉంది. నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసులు పరిశీలిస్తే..ఆప్షన్3లో ఉన్న వయసులు మాత్రమే తండ్రి వయసు, కొడుకు వయసుకు 3 రెట్లు. సమాధానం: 3
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement