
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా & మహీంద్రా' (M&M) దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.
ఫిబ్రవరి 14న మహీంద్రా కంపెనీ బుకింగ్‌లను స్వీకరిస్తే డెలివరీలు 2025 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. సంస్థ అన్ని వేరియంట్లకు బుకింగ్స్ స్వీకరించనుంది.
మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
మహీంద్రా BE 6 ఎక్స్-షోరూమ్ ధరలు
ప్యాక్ వన్ (59 kWh): రూ. 18.90 లక్షలు
ప్యాక్ వన్ అబోవ్ (59 kWh): రూ. 20.50 లక్షలు
ప్యాక్ టూ (59 kWh): రూ. 21.90 లక్షలు
ప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 24.50 లక్షలు
ప్యాక్ త్రీ (79 kWh): రూ. 26.90 లక్షలు
మహీంద్రా XEV 9e ఎక్స్-షోరూమ్ ధరలు
ప్యాక్ వన్ (59 kWh): రూ. 21.90 లక్షలు
ప్యాక్ వన్ ఎబౌ (59 kWh): NA
ప్యాక్ టూ (59 kWh): రూ. 24.90 లక్షలు
ప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 27.90 లక్షలు
ప్యాక్ త్రీ (79 kWh): రూ. 30.50 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment