Lal Bahadur Shastri: కారు కోసం బ్యాంకు లోను తీసుకున్న ప్రధాని ! | Lal Bahadur Shastri Car Loan Story | Sakshi
Sakshi News home page

Lal Bahadur Shastri: కారు కోసం బ్యాంకు లోను తీసుకున్న ప్రధాని !

Published Sat, Oct 2 2021 9:27 PM | Last Updated on Sat, Oct 2 2021 9:30 PM

Lal Bahadur Shastri Car Loan Story - Sakshi

లాల్‌ బహదూర్‌ శాస్త్రీ భారత రెండో ప్రధాని. మంచితనానికి, సింప్లిసిటీకి, నిజాయితీకి మారు పేరుగా ఆయన నిలిచారు. ప్రపంచలోనే రెండో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉంటూ ఆయన కనీసం కారు కూడా కొనుక్కోలేకపోయారు. చివరకు బ్యాంకు నుంచి రూ. 5000 అప్పు తీసుకుని ఫియట్‌ కారుని కొనుగోలు చేశారు. 

పెన్షన్‌తో ఈఎంఐలు
భారత ప్రధానిగా ఉంటూనే లోను తీసుకుని కారు కొనుక్కున్న లాల్‌ బహదూర్‌శాస్త్రీ ఆ తర్వాత రష్యా పర్యటనకు వెళ్లారు. అనూహ్యంగా తాష్కెంట్‌లో ఉండగా ఆయన చనిపోయారు. దీంతో కారు కొనేందుకు ఆయన తీసుకున్న బ్యాంకు లోనుని ఆయన భార్య కట్టేశారు. ప్రధాని భార్యగా ఆమెకు నెలనెల వచ్చే ఫించను నుంచి లోనుని ఈఎంఐలుగా తీర్చేశారు.

అవినీతి మచ్చలేని నేత
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగినా లాల్‌బహదూర్‌ శాస్త్రికి ఎక్కడా అవినీతి మరకలు అంటుకోలేదు. ప్రధాని పదవిని చేపట్టే ముందు ఆయన కేంద్ర మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. జనగామ దగ్గర రైలు ప్రమాదం జరిగితే రైల్వేశాఖ మంత్రి హోదాలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన గొప్ప నైతికత ఆయన సొంతం. మహత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రీలు ఇద్దరు కూడా అక్టోబరు 2నే జన్మించారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి కారు కొనుగోలుకు సంబంధించిన వివరాలను రచయిత, స్పోర్ట్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో కీలక​ంగా వ్యవహరించే జాయ్‌ భట్టాచార్య ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 

చదవండి : బాపు చూపిన బాటలో జెఫ్‌బేజోస్‌, బిల్‌గేట్స్‌....

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement