
అనిల్ శాస్త్రి
చండీగఢ్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కొడుకు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాస్త్రి మరణంపై ప్రజలకు ఎన్నో సందేహాలున్నాయనీ, వాటిని పోగొట్టాలంటే పత్రాలను బహిర్గతపరచాలని ఆయన కోరారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి: లెసన్స్ ఇన్ లీడర్‌షిప్’ అనే పుస్తకం పంజాబీ అనువాదం విడుదల సందర్భంగా శుక్రవారం అనిల్ శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవిలో ఉండగానే 1966 జనవరి 11న తాష్కెంట్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి మరణించారు. గుండెపోటుతోనే ఆయన చనిపోయారని ప్రకటించగా ఏదో కుట్ర జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు రహస్యమైనవంటూ గత ప్రభుత్వం వాటిని బహిర్గతపరచలేదని అనిల్ శాస్త్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment