
'మా నాన్నది సహజ మరణం కాదు'
భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రిది సహజ మరణం కాదని, మరణించేసరికి ఆయన ముఖం నీలంగా మారి ఉందని, ఆయన డైరీ కూడా కనిపించలేదని చెప్పారు. తాష్కెంట్లో శాస్త్రీజీ ఉన్న గదిలో బెల్ గానీ, టెలిఫోన్ గానీ లేవని.. ఆయనకు కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందలేదని అనిల్ శాస్త్రి ఆరోపించారు.
అప్పట్లో అక్కడి భారత రాయబార కార్యాలయ వర్గాలు నిర్లక్ష్యంగా వహించాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం శాస్త్రీజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని, ఆయన మృతిపై ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని అనిల్ శాస్త్రి డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుత ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్ నగరంలో 1966 జనరి 11వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు.