దావణగెరె : మహాత్మాగాంధీ కన్న కలలు నేడు నేరవేరనున్నాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ శామనూరు శివశంకరప్ప అన్నారు. ఆయన గురువారం స్థానిక పాలికె ఆవరణంలో జిల్లా పాలకె, జిల్లా పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వచ్ఛ సమాజ, గ్రామ స్వరాజ్యం కోసం కన్న కలలు నెరవేరనున్నాయన్నారు. అయితే ఈ స్వచ్ఛతా కార్యక్రమం గాంధీ జయంతి రోజునే కాకుండా నిత్యం చేపట్టాలని సూచించారు. కార్యక్రమం లో విధాన పరిషత్ సభ్యుడు అబ్దుల్ జబ్బార్, మేయర్ రేణుకాబాయి, జిల్లా అధికారి అంజన్‌కుమార్, ఎస్‌పీ.బోరలింగయ్య పాల్గొన్నారు.
సాక్షి, బళ్లారి : ప్రధాని మోడీ పిలుపు మేరకు గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బళ్లారిలో వాడవాడలా నిర్వహించారు. బీజేపీ శ్రేణులు, పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్వచ్ఛంధ సంస్థల నేతలు, మఠాధిపతులు చీపుర్లు పట్టుకుని చెత్త ఊడ్చారు.
హొస్పేట : జాతిపిత మహాత్మాగాంధీ కన్న కలలు సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని స్థానిక కాంగ్రెస్ నేత హెచ్.అబ్దుల్ వహాబ్ అన్నారు. గురువారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసా సిద్ధాం తాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సాలిసిద్దయ్యస్వామి, గుజ్జల నాగరాజ్, తారిహళ్లి వెంకటేశ్, అయ్యాళిమూర్తి, డీ.వెం కటరమణ, మున్నీ, ఫహింపాషా, అబీద్, హుసేన్, కన్నీ శ్రీకంఠ పాల్గొన్నారు.
శ్రీరామనగర్ : కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం గాంధీ జంయతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లారన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు టి.జయరామిరెడ్డి, సుభాష్‌చంద్రబోస్, భాస్కర్‌రెడ్డి, సీహెచ్.సత్యనారాయణ(బుజ్జి), కొప్పళ కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టికూటి శ్రీనివాసు, నల్లచంద్రారావు పాల్గొన్నారు.
చెళ్లకెర రూరల్ : మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసమే కాకుండా సమస్త జీవరాసుల రక్షణ, సమానతను కాపాడారని ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి తెలిపారు. ఆయన గురువారం స్థానిక తాలూకా పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత భారత్ అభియాన్ సందర్భంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం, వీధి దీపాలు, డ్రెయినేజీ వ్యవస్థ కోసం అధిక సంఖ్యలో నిధులు విడుదల చేస్తున్నారని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి టీ.పాండ్యప్ప, అధ్యక్షుడు భాగ్యమ్మ, బాబురెడ్డి, తహశీల్దార్ శ్రీధర్ ఎస్.పాటిల్ పాల్గొన్నారు.
గంగావతి : గాంధీ సర్కిల్‌లోని మహాత్ముడికి బీజేపీ, కన్నడ సేన కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీనగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, మాజీ ఎంపీ సూగూరు శివరామగౌడ, మనోహర్‌స్వామి, సయ్యద్ అలీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గాంధీజీ కలలు నెరవేరుతున్నాయి
Published Fri, Oct 3 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement
Advertisement