అలహాబాద్‌లో బిజీగా ఉండే ఖిలోనా మార్కెట్‌లోకి అడుగుపెడితే.. అక్కడ ఒక గోడపై ఎర్ర రంగుతో రాసిన ఎన్నికల ప్రచార నినాదం కనిపిస్తుంది.‘శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఓటెయ్యండి. ఎన్నికల గుర్తు జోడెద్దులు’ అనేది ఆ నినాద సారాంశం. ఎప్పటి లాల్ బహదూర్ శాస్త్రి?, ఎప్పటి జోడెద్దులు?, దాని గురించి ఇప్పుడు ప్రచారమేమిటని ఆశ్చర్యపోయారా?.. నిజమే ఆ ప్రకటన 60 ఏళ్ల కిందటిది. వెలిసిపోయినా ఇప్పటికీ అక్కడికి వెళ్లిన వాళ్లందరినీ ఆకట్టుకుంటోంది. ‘1957లో లాల్ బహదూర్ శాస్త్రి అలహాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు జోడెద్దులు. ఆ ఎన్నికల్లో శాస్త్రి గెలిచారు. ఎన్నికలైపోయినా ఈ గోడపై రాసిన నినాదాన్ని మాత్రం ఎవరూ చెరపలేదు. ఆరు దశాబ్దాలుగా అలాగే ఉంది. అయితే, ‘రంగు వెలిసిపోయింది’ అంటూ అసలు సంగతి చెప్పారు శాస్త్రి మనవడు ప్రభాకర శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి అలహాబాద్ నుంచి 1957, 1962లో వరుసగా గెలిచారు. ‘అప్పట్లో శాస్త్రి గారిలాంటి వాళ్ల కోసం పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇలా అక్కడక్కడ గోడలపై రాస్తే సరిపోయేది’ అన్నారు యూపీసీసీ ప్రతినిధి కిశోర్.
Comments
Please login to add a commentAdd a comment