తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూయడంతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
కృష్ణ మృతి వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో రి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని తెలుగులో ట్వీట్ చేశారు.
కాగా, జీ20 సదస్సులో భాగంగా ఇండోనేషియా బాలి పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే.
కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో @urstrulyMahesh, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) November 15, 2022
ఇక్కడ కూడా క్లిక్ చేయండి: సాహసాల గని సూపర్‌స్టార్ కృష్ణ
హలో.. నా సినిమా ఎలా ఉందండి?.. కృష్ణ జ్ఞాపకాలతో బుర్రిపాలెంలో విషాద ఛాయలు
Comments
Please login to add a commentAdd a comment