సాక్షి, కర్నూలు జిల్లా: వరసగా నాలుగో ఏడాది ‘జగనన్న చేదోడు’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు స్వామి చంద్రుడు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే’’ అంటూ సీఎం జగన్‌ను కొనియాడారు.
లబ్ధిదారుడి మాటల్లోనే..
అన్నా, నేను నాయీ బ్రాహ్మణ కులంలో పుట్టాను, మా కుమారుడు పుట్టుకతో చెవిటి, మూగవాడు, నేను ఈ పథకం ద్వారా మూడు సార్లు లబ్ధిపొందాను, మా కుమారుడితో కూడా షాప్ పెట్టించాను, మా అబ్బాయి కూడా ఈ పథకం పొందాడు. తనకు మాటలు రావు కాబట్టి తన ఆనందం కూడా మీతో పంచుకుంటున్నాను. గతంలో నాకు పాతకాలం కుర్చీలు, సామాన్లు ఉండేవి కానీ ఈ పథకం ద్వారా వచ్చిన లబ్ధితో మోడ్రన్ సెలూన్ ఏర్పాటు చేసుకున్నా. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే.. మమ్మల్ని గుళ్ళలో పాలకమండలి సభ్యులుగా నియమిస్తున్నారు.
గతంలో మమ్మల్ని కులంతో దూషించేవారు కానీ ఇప్పుడు నాయీ బ్రాహ్మణులని పిలుస్తున్నారు. గతంలో మా తోకలు కత్తిరించాలని చంద్రబాబు అన్నారు. కానీ మీరు ప్రేమతో ఆదరించారు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మాకు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. నా ఇద్దరు పిల్లల్లో ఒకరిని బాగా చదివించి డాక్టర్‌ను చేయగలిగాను. మీ వల్లే ఇదంతా నా చిన్నకుమారుడికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ రూ. 8 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా చేయించారు. నాకు టిడ్కో ఇల్లు వచ్చింది, మేమే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు గౌరవం కల్పించారు, మీరు మా వెన్నంటి ఉండి మా కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, మేమంతా మీ వెంటే ఉంటాం. ధన్యవాదాలు.
మనమంతా జగనన్న కుటుంబం: మంత్రి వేణు
అందరికీ నమస్కారం, అన్నా రక్తాన్ని స్వేదంగా మార్చి, శ్రమ తప్ప సేద తీరాలన్న ఆలోచన లేని, కష్టం తప్ప కల్మషం లేని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్ళని చెప్పుకున్న నాయకుడు గతంలో లేరు, వీరంతా జగనన్న బంధువులు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా జగనన్న బంధువులే, వీరంతా గతంలో మోసపోయారు, మన జీవితాలు మారాలంటే కులవృత్తులకే పరిమితం కాదని.. విద్య మాత్రమే మార్గమని నాడు వైఎస్‌ఆర్ గారు ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ కోతలు పెట్టారు.
నేడు సీఎంగారు ప్రతి బీసీ గర్వపడేలా, మిగిలినవారంతా బాగుపడేలా కులగణన చేయబోతున్నారు. ఇది మన జీవితాలను మార్చబోతుంది, మనమంతా జగనన్న కుటుంబం, కులవివక్షకు గురైన రజకలు, నాయీ బ్రహ్మణులుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. జగనన్నా... చేదోడు పథకం బీసీ కుటుంబాలలో దివ్వెను వెలిగిస్తుంది, ఇది అందరికీ భరోసా, భాగ్యం, భద్రత కల్పిస్తుంది. ధ్యాంక్యూ.
చదవండి: విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు
Comments
Please login to add a commentAdd a comment