Emmiganur
-
చేనేత పురిలో చైతన్య భేరి
కర్నూలు (రాజ్‌విహార్): చేనేత వస్త్రాలకు మారుపేరైన ఎమ్మిగనూరులో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం పట్టణంలో ఘనంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించింది. నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఈ యాత్రలో పాల్గొని, సాధికారతను ప్రదర్శించారు. మండల పరిషత్ కార్యాలయంనుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్సు యాత్ర సాగిన పురవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. అనంతరం బస్టాండు వద్ద వేలాది ప్రజలతో భారీ బహిరంగ సభ జరిగింది. యాత్ర మొదలుకొని సభ ముగిసేవరకు పట్టణం జై జగన్ నినాదాలతో మార్మోగింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం వైఎస్ జగన్ సాధికారత దిశగా నడిపించిన తీరును నేతలు వివరిస్తున్నప్పుడు సభా ప్రాంగణం నినాదాలు, ఈలలు, కేరింతలతో హోరెత్తింది. మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది జగనన్న పెంచిన ఆత్మగౌరవం : మంత్రి మేరుగు నాగార్జున ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం వైఎస్ జగన్ పెంచిన ఆత్మగౌరవమే కారణమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఎందరో మహానుభావులు కలలుగన్న సామాజిక న్యాయం, సామాజిక సాధికారతను సీఎం జగన్ నిజం చేసి చూపించారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా దళితులు, బలహీనవర్గాలను ఎన్ని అవమానాలకు గురిచేశారో ఎవరూ మరువలేరని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ వర్గాలనే అణిచివేశారని వివరించారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తెచ్చారని చెప్పారు. సీఎం జగన్ వల్లే నేడు మన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ చదువులు చదువుతున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుల మతాలు చూడని నాయకుడు : ఎంపీ గురుమూర్తి పేదలకు మేలు చయడంలో సీఎం జగన్‌ను మించిన నేత లేరని ఎంపీ గురుమూర్తి చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని తెలిపారు. నాలుగున్నరేళ్లలో రూ. 2.50 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశారన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, పథకాలను ఇంటివద్దకే అందిస్తున్నారని వివరించారు. ఒకప్పుడు నాయకులు చుట్టూ మనం తిరిగే వాళ్లమని, కానీ ప్రభుత్వ సిబ్బంది మన సేవ కోసం ఇంటి వద్దకే వస్తున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాలకు మేలు: ఎంపీ గోరంట్ల మాధవ్ రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతోందని, వారంతా అభివృద్ధి చెందుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను పావులా వాడుకుని, అధికారంలోకి వచ్చాక అణచివేశారని తెలిపారు. చంద్రబాబుకు ఈ సారి డిపాజిట్లు కూడా రావన్నారు. కనీసం బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పవన్ రాష్ట్రంలో ఏం చేయగలరని ప్రశ్నించారు. బడుగులకు గుర్తింపు తెచ్చిన సీఎం జగన్: ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగులకు గుర్తింపు తెచ్చారని ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి, ఆ వర్గాలను తలెత్తుకునేలా చేశారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఈ వర్గాలన్నీ అవహేళనకు, అణచివేతకు గురయ్యాయని చెప్పారు. టీడీపీ చేస్తున్న సామాజిక కుట్రకు ఓటుతో సమాధానమివ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల పక్షాన ఉన్న సీఎం జగన్‌ను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య తదితరులు ప్రసంగించారు. -
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సామాజిక సాధికార యాత్ర
-
మీ వల్లే ఇదంతా జగనన్నా.. లబ్ధిదారుడి భావోద్వేగం
సాక్షి, కర్నూలు జిల్లా: వరసగా నాలుగో ఏడాది ‘జగనన్న చేదోడు’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు స్వామి చంద్రుడు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే’’ అంటూ సీఎం జగన్‌ను కొనియాడారు. లబ్ధిదారుడి మాటల్లోనే.. అన్నా, నేను నాయీ బ్రాహ్మణ కులంలో పుట్టాను, మా కుమారుడు పుట్టుకతో చెవిటి, మూగవాడు, నేను ఈ పథకం ద్వారా మూడు సార్లు లబ్ధిపొందాను, మా కుమారుడితో కూడా షాప్ పెట్టించాను, మా అబ్బాయి కూడా ఈ పథకం పొందాడు. తనకు మాటలు రావు కాబట్టి తన ఆనందం కూడా మీతో పంచుకుంటున్నాను. గతంలో నాకు పాతకాలం కుర్చీలు, సామాన్లు ఉండేవి కానీ ఈ పథకం ద్వారా వచ్చిన లబ్ధితో మోడ్రన్ సెలూన్ ఏర్పాటు చేసుకున్నా. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే.. మమ్మల్ని గుళ్ళలో పాలకమండలి సభ్యులుగా నియమిస్తున్నారు. గతంలో మమ్మల్ని కులంతో దూషించేవారు కానీ ఇప్పుడు నాయీ బ్రాహ్మణులని పిలుస్తున్నారు. గతంలో మా తోకలు కత్తిరించాలని చంద్రబాబు అన్నారు. కానీ మీరు ప్రేమతో ఆదరించారు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మాకు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. నా ఇద్దరు పిల్లల్లో ఒకరిని బాగా చదివించి డాక్టర్‌ను చేయగలిగాను. మీ వల్లే ఇదంతా నా చిన్నకుమారుడికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ రూ. 8 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా చేయించారు. నాకు టిడ్కో ఇల్లు వచ్చింది, మేమే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు గౌరవం కల్పించారు, మీరు మా వెన్నంటి ఉండి మా కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, మేమంతా మీ వెంటే ఉంటాం. ధన్యవాదాలు. మనమంతా జగనన్న కుటుంబం: మంత్రి వేణు అందరికీ నమస్కారం, అన్నా రక్తాన్ని స్వేదంగా మార్చి, శ్రమ తప్ప సేద తీరాలన్న ఆలోచన లేని, కష్టం తప్ప కల్మషం లేని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్ళని చెప్పుకున్న నాయకుడు గతంలో లేరు, వీరంతా జగనన్న బంధువులు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా జగనన్న బంధువులే, వీరంతా గతంలో మోసపోయారు, మన జీవితాలు మారాలంటే కులవృత్తులకే పరిమితం కాదని.. విద్య మాత్రమే మార్గమని నాడు వైఎస్ఆర్ గారు ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ కోతలు పెట్టారు. నేడు సీఎంగారు ప్రతి బీసీ గర్వపడేలా, మిగిలినవారంతా బాగుపడేలా కులగణన చేయబోతున్నారు. ఇది మన జీవితాలను మార్చబోతుంది, మనమంతా జగనన్న కుటుంబం, కులవివక్షకు గురైన రజకలు, నాయీ బ్రహ్మణులుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. జగనన్నా... చేదోడు పథకం బీసీ కుటుంబాలలో దివ్వెను వెలిగిస్తుంది, ఇది అందరికీ భరోసా, భాగ్యం, భద్రత కల్పిస్తుంది. ధ్యాంక్యూ. చదవండి: విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు -
రేపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరుకు చేరుకుంటారు. వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని.. జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేయనున్నారు. సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. -
దేశాయ్ చెరువులో మట్టి దొంగలు
ఎమ్మిగనూరు: మట్టి రుచి ఎరిగిన అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అధికారుల అండదండలతో మట్టి దొంగలు రూ. కోట్లకు పడిగలెత్తుతున్నారు. నందవరం మండలం హాలహర్వి రెవెన్యూ పరిధిలోని దేశాయ్ చెరువు ఉంది. దశాబ్దాల కాలంగా ఈ చెరువుకింద వందలమంది రైతులు తమ పంటలను పండించుకొంటున్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఈ చెరువు అధికారులకు, రాజకీయ దళారులకు ఆదాయవనరుగా మారింది. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఐదేళ్లపాటు యథేచ్ఛగా కొనసాగిన మట్టిదోపిడీ ఇప్పుడు కూడా కొనసాగుతోంది. చెరువులో మట్టిని తవ్వేందుకు ఎమ్మిగనూరు పరిసరప్రాంతంలోని ఇటుకల బట్టీల యజమానులు ఏకంగా ప్రొక్లెయినర్లను, జేసీబీలను వాడుతున్నారు. ప్రతి రోజు 60 నుంచి 90 ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించేందుకు వినియోగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కనీసం ఆరు ట్రిప్పుల మట్టిని రోజూ తరలిస్తోంది. ఒక్క ట్రాక్టర్ మట్టిని తరలించేందుకు ఇటుకల బట్టీల యజమానులు రూ.650 చెల్లిస్తారు. ఐదేళ్లూ దోపిడీ.. తెలుగుదేశంపార్టీ్ట అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు మట్టిని యథేచ్చగా దోచేశారు. చెరువులో సారవంతమైన జిగుట మట్టి కావటంతో ఇటుకల తయారికీ అనుకూలంగా ఉంది. దాదాపు 8 ఇటుకల బట్టీలకు ఈ ఒక్క చెరువుమట్టినే తరలిస్తున్నారంటే ఈ మట్టి ప్రాధాన్యతేమిటో తెలుస్తోంది. చెరువు మట్టితో ఇటుకల బట్టీ యజమానులు కోట్లకు పడగలెత్తారు. చెరువులో మట్టిని తరలించిన తరువాత నీరు–చెట్టు కింద అధికారులు బిల్లులు చేయటం, వాటిని దిగమింగటంలో అప్పటి టీడీపీ నేతలూ సిద్ధహస్తులే. అధికారం మారినా దేశాయి చెరువులో మట్టిదోపిడీ మాత్రం ఆగటం లేదు. ఇక్కడ దోపిడీ ‘అధికారిక’ పేటెంట్గా మారింది. సమన్వయంతో ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మాత్రం కళ్లకు గంతలు కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పొలాలకు ఉపయోగపడాల్సిన సారవంతమైన ఒండ్రుమట్టి నేడు వ్యాపారవస్తువుగా మారింది. ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి ఇటుక బట్టీల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు హాలహర్వి దేశాయ్ చెరువులో మట్టి తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని, ప్రస్తుతం తాము ఎవరికి అనుమతులివ్వలేదని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మట్టి అక్రమ తరలింపును అడ్డుకొనేందుకు రెవెన్యూ,పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. –వెంకటేశ్వర్లు, ఎల్లెల్సీ డీఈ -
త్వరలోనే ఎమ్మెల్యే బీవీ చిట్టా విప్పుతా
కర్నూలు(అర్బన్): రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తనను అరెస్ట్ చేయించి జైలుకు పంపించారని, త్వరలోనే ఆయన చిట్టా విప్పుతానని గోనెగండ్ల మాజీ సర్పంచ్ టి. నాగేష్‌నాయుడు అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గోనెగండ్ల సొసైటీలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఇప్పటికీ రూ.40 లక్షల అవినీతికి సంబంధించి ఆదోని న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న వాల్మీకులను అణగదొక్కేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 65 వేల మంది వాల్మీకుల ఓట్లు ఉన్నాయని.. ఎన్నికల్లో తమ సత్తా చూపించాల్సి వస్తుందన్నారు. సమావేశంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, నాయకులు బోయ గోపీ, వీవీ నాయుడు, శివ, గోనెగండ్ల నాయకులు రంగస్వామి, మురళీనాయుడు, గుడికల్లు రంగన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
20వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, ఎమ్మిగనూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఆయన మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్ కిరవడి, గాజులదిన్నె క్రాస్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభం అవుతుంది. గోనెగొండ్లలో పార్టీ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. 6.30 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ముగయనుంది. రాత్రికి ఆయన గోనెగండ్లలోనే బస చేస్తారు. -
ఎమ్మిగనూరు జడ్జి సస్పెన్షన్
ఎమ్మిగనూరు టౌన్:ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఎమ్మిగనూరు కోర్టుకు వచ్చి జడ్జి రవిశంకర్‌కు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశారు. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఆయన స్థానంలో ఆదోని అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు(ఏడీఎం) జడ్జి విజయ్‌కుమార్‌రెడ్డి ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించారు. -
పాము కాటుతో విద్యార్థిని మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పాముకాటుకు సౌందర్య(12)అనే విద్యార్థినీ మృతి చెందింది. గ్రామానికి చెందిన స్వామిరంగడు, లక్ష్మీల కుమార్తె సౌందర్య పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల ఉన్నతపాఠశాలలో 8 వ తరగతి ‘బి’ సెక్షన్లో చదువుతుంది. కుంటుంబ సభ్యులు అందరు మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. రాత్రి సౌందర్యకు వీపుపైన, చేతుల మీద పాము కాటు వేసింది. కాటు వేసిన విషయం తల్లిదండ్రులకు బాలిక చెప్పింది. రాత్రి కావటంతో ఏమైనా పురుగు కొరికుంటుందిలే అనుకున్నారు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నాటు వైద్యం కోసం కల్లుదేవకుంట గ్రామానికి వెల్లుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. బాలిక మృతదేహన్ని గ్రామానికి తీసుకువచ్చారు. బాలిక మృతి చెందడంతో సంతాప సూచకంగా పాఠశాలకు మధ్యాహ్నం సెలవు ప్రకటించారు. -
అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు
ఎమ్మిగనూరు: అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు, వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించే సంకల్పం ఉన్నదే వైఎస్ఆర్ సీపీ అని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్సిపి జనపథంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజాసంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. ఉచిత విద్యుత్, రుణమాఫీలు, బీమా సౌకర్యాలతో ఆయన రైతులకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో గ్రామంలో 15 మందికి మించి ఫించన్లు వచ్చేవి కాదని, అదికూడా 75 రూపాయలే వచ్చేవన్నారు. సత్యం రామలింగరాజుతో కలిసి తన కొడుకును చదివించుకునేందుకు ఫీజురీయింబర్స్‌మెంట్ కల్పించుకున్నారని విమర్శించారు. మెస్ ఛార్జీలు పెంచాలన్న విద్యార్థులను అరెస్ట్ చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బాబు హయాంలో బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. 200 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకుడు చంద్రబాబు అన్నారు. వైఎస్ ఐదేళ్ల పాలనలో చేనేత కార్మికులకు ఏంతో చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు తన 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టమన్న చంద్రబాబు ఇప్పుడు ఇంటింటా ఉద్యోగం ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి బుట్టా రేణుక, ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిని గెలిపించాలని విజయమ్మ కోరారు.