
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరుకు చేరుకుంటారు.
వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని.. జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేయనున్నారు. సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.