Emotion
-
అందుకే అంతగా ఏడ్చాను!
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ చాంపియన్‌గా ఖాయమైన తర్వాత దొమ్మరాజు గుకేశ్ ఎంతో భావోద్వేగానికి లోనైన వీడియోను అభిమానులంతా చూశారు. విజయానంతరం అతను కన్నీళ్లపర్యంతమయ్యాడు. దీనిపై ‘ఫిడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుకేశ్ మాట్లాడాడు. అందుకు కారణాన్ని వివరించాడు. ‘నేను ఈ పోరులో మొదటినుంచి ఆధిక్యం కనబర్చలేదు. కొన్ని గేమ్‌లలో విజయానికి దగ్గరగా వచ్చి కూడా ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయాను. అంతా సాఫీగా, ఏకపక్షంగా పోరు జరిగి నా గెలుపు కాస్త ముందే ఖాయమై ఉంటే నేనూ మామూలుగానే కనిపించేవాడినేమో. కానీ చివర్లో గెలిచిన తీరుతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అప్పటి వరకు గేమ్ డ్రా అవుతుందని, టైబ్రేక్‌కు వెళితే ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. కానీ అద్భుతం జరిగి గెలిచేశాను. పైగా ఎనిమిదేళ్ల వయసులో చెస్ నేర్చుకున్న రోజులు కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అందుకే ఆ కన్నీళ్లు’ అంటూ గుకేశ్ వివరించాడు. తాను ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా...ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే ప్రతీ సవాల్‌కు తాను సిద్ధమేనని గుకేశ్ వ్యాఖ్యానించాడు. పైగా చదరంగంలాంటి ఆటలో ఎవరూ వంద శాతం పర్ఫెక్ట్గా ఉండరని అతను అన్నాడు. ‘ఇప్పటి వరకు చెస్‌ను శాసించిన గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా పరాజయాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఆటలో నేర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. నా వయసు కూడా అందుకు సహకరిస్తుంది. ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని గుకేశ్ చెప్పాడు. చాంపియన్‌షిప్ సమయంలో తనకు సరిగ్గా ఇంటి భోజనం తరహాలో దక్షిణాది వంటకాలు అందించిన చెఫ్‌కు అతను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
బిడ్డ ఘనత : అంతులేని ఆనందంలో అమ్మ, వైరల్ వీడియో
ప్రాణానికిప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డలు, తమ కలలకు ప్రతిరూపాలుగా ఎదిగితే అంతకంటే సంతోషం తల్లిదండ్రులకు ఇంకేముంటుంది. అందులోనూ కాయకష్టం చేసి మరీ చదివించుకునే బిడ్డలు తాము అనుకున్నదానికంటే మిన్నగా రాణిస్తే గుండెల్లోని ఆనందంతా తల్లి మనసు కన్నీటి ధారగా వర్షిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే మహారాష్ట్ర లోథానేలోని డోంబివిలి (తూర్పు)లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..థానేలోని డోంబివిలి (తూర్పు)లో కూరగాయల వ్యాపారంతో జీవించే థోంబ్రే మావ్షి కుమారుడు యోగేష్ ఇటీవల చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ శుభవార్తను తన తల్లితో పంచుకోగానే ఆమె కుమారుడిని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. బ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ ఎక్స్‌లో వీడియోను పంచుకున్నారు.योगेश, तुझा अभिमान आहे. डोंबिवली पूर्व येथील गांधीनगर मधील गिरनार मिठाई दुकानाजवळ भाजी विकणाऱ्या ठोंबरे मावशींचा मुलगा योगेश चार्टर्ड अकाऊंटंट (C.A.) झाला. निश्चय, मेहनत आणि परिश्रमांच्या बळावर योगेशने खडतर परिस्थितीशी तोंड देत हे दैदीप्यमान यश मिळवलं आहे. त्याच्या या… pic.twitter.com/Mf8nLV4E61— Ravindra Chavan (@RaviDadaChavan) July 14, 2024యోగేష్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. బలం, దృఢ సంకల్పం, కష్టపడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు అంటూ యోగేష్‌ను అభినందించారు. 45 సెకన్ల వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. -
'మామయ్య.. ఆగిపోలేదు మీ ప్రస్థానం'.. సుధీర్ బాబు ఎమోషనల్!
ఇటీవలే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎమోషనలయ్యారు. మామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా సూపర్ కృష్ణ ఫోటోను పంచుకున్నారు. సుధీర్ బాబు తన ట్వీట్లో రాస్తూ 'మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం హరోం హర అనే పాన్ ఇండియా చిత్రంలో సుధీర్ బాబు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 22న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మరిన్ని సేవ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఎం.బీ ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నారు. మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.#SSKLivesOn pic.twitter.com/lYdFgRIcaa — Sudheer Babu (@isudheerbabu) November 15, 2023 -
మీ వల్లే ఇదంతా జగనన్నా.. లబ్ధిదారుడి భావోద్వేగం
సాక్షి, కర్నూలు జిల్లా: వరసగా నాలుగో ఏడాది ‘జగనన్న చేదోడు’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు స్వామి చంద్రుడు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే’’ అంటూ సీఎం జగన్‌ను కొనియాడారు. లబ్ధిదారుడి మాటల్లోనే.. అన్నా, నేను నాయీ బ్రాహ్మణ కులంలో పుట్టాను, మా కుమారుడు పుట్టుకతో చెవిటి, మూగవాడు, నేను ఈ పథకం ద్వారా మూడు సార్లు లబ్ధిపొందాను, మా కుమారుడితో కూడా షాప్ పెట్టించాను, మా అబ్బాయి కూడా ఈ పథకం పొందాడు. తనకు మాటలు రావు కాబట్టి తన ఆనందం కూడా మీతో పంచుకుంటున్నాను. గతంలో నాకు పాతకాలం కుర్చీలు, సామాన్లు ఉండేవి కానీ ఈ పథకం ద్వారా వచ్చిన లబ్ధితో మోడ్రన్ సెలూన్ ఏర్పాటు చేసుకున్నా. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే.. మమ్మల్ని గుళ్ళలో పాలకమండలి సభ్యులుగా నియమిస్తున్నారు. గతంలో మమ్మల్ని కులంతో దూషించేవారు కానీ ఇప్పుడు నాయీ బ్రాహ్మణులని పిలుస్తున్నారు. గతంలో మా తోకలు కత్తిరించాలని చంద్రబాబు అన్నారు. కానీ మీరు ప్రేమతో ఆదరించారు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మాకు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. నా ఇద్దరు పిల్లల్లో ఒకరిని బాగా చదివించి డాక్టర్‌ను చేయగలిగాను. మీ వల్లే ఇదంతా నా చిన్నకుమారుడికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ రూ. 8 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా చేయించారు. నాకు టిడ్కో ఇల్లు వచ్చింది, మేమే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు గౌరవం కల్పించారు, మీరు మా వెన్నంటి ఉండి మా కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, మేమంతా మీ వెంటే ఉంటాం. ధన్యవాదాలు. మనమంతా జగనన్న కుటుంబం: మంత్రి వేణు అందరికీ నమస్కారం, అన్నా రక్తాన్ని స్వేదంగా మార్చి, శ్రమ తప్ప సేద తీరాలన్న ఆలోచన లేని, కష్టం తప్ప కల్మషం లేని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్ళని చెప్పుకున్న నాయకుడు గతంలో లేరు, వీరంతా జగనన్న బంధువులు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా జగనన్న బంధువులే, వీరంతా గతంలో మోసపోయారు, మన జీవితాలు మారాలంటే కులవృత్తులకే పరిమితం కాదని.. విద్య మాత్రమే మార్గమని నాడు వైఎస్ఆర్ గారు ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ కోతలు పెట్టారు. నేడు సీఎంగారు ప్రతి బీసీ గర్వపడేలా, మిగిలినవారంతా బాగుపడేలా కులగణన చేయబోతున్నారు. ఇది మన జీవితాలను మార్చబోతుంది, మనమంతా జగనన్న కుటుంబం, కులవివక్షకు గురైన రజకలు, నాయీ బ్రహ్మణులుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. జగనన్నా... చేదోడు పథకం బీసీ కుటుంబాలలో దివ్వెను వెలిగిస్తుంది, ఇది అందరికీ భరోసా, భాగ్యం, భద్రత కల్పిస్తుంది. ధ్యాంక్యూ. చదవండి: విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు -
ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..!
‘థంబ్స్ అప్’ ఎమోజీ సంతకం మాదిరిగా చెల్లుబాటవుతుందా? అది ఎదైనా ఒప్పందానికి మిమ్మల్ని బంధించగలదా? ఒక సీనియర్ ఉద్యోగి పని ప్రదేశంలో అతని జూనియర్‌కు హార్ట్ ఎమోజీని పంపితే అవి లైంగిక వేధింపుల కిందికి వస్తాయా? ఇదేవిధంగా తుపాకీ లేదా కత్తి ఎమోజీని ఎవరైనా పంపితే దానిని ప్రాణాలకు ముప్పుగా భావించాలా? యుఎస్ నుండి యూకే వరకూ.. న్యూజిలాండ్, ఫ్రాన్స్, భారతదేశంలోనూ భావోద్వేగాలు, కార్యకలాపాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే చిన్నపాటి ఇలస్ట్రేటెడ్ క్యారెక్టర్ల విభిన్న వివరణలు ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కొన్ని దేశాలు ఎమోజీలను సాక్ష్యంగా ఉపయోగించుకోవడంతో న్యాయ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా కెనడాలోని కోర్టు తీర్పు చేరింది. ఈ దేశానికిచెందిన న్యాయమూర్తి 'థంబ్స్ అప్' ఎమోజీ సంతకం మాదిరిగా చెల్లుబాటు అవుతుందని తేల్చిచెప్పారు. ఒక కేసులో ఎమోజీని ఆధారంగా చేసుకుని ఒకరైతు 61,000 యూఎస్ డాలర్ల మొత్తాన్ని ప్రత్యర్థికి చెల్లించాలని ఆదేశించారు! ఈ కొత్త వాస్తవికతకు న్యాయస్థానాలు అనుగుణంగా ఉండాలని ఆయన తన తీర్పులో వాదించారు. సహజమైన పురోగతి ఎమోజీల విషయంలో భారతదేశంలో చట్టమేదీ లేనందున వాణిజ్య చర్చల సమయంలో వ్యక్తులు,వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండటం కీలకంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయవాది కుశాంక్ సింధు అన్నారు. డిజిటల్ చర్చలలో మరింత ఆలోచనాత్మకంగా ఉండటం, ఒప్పందపు చర్చలలో ఎమోజీలను ఉపయోగిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం తెలివైన పని అని ఆయన హెచ్చరించారు. కమ్యూనికేషన్ విధానాలు అభివృద్ధి చెందుతున్న దశలో ఎమోజీలు కూడా న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడం సహజమైన పురోగతి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మిడిల్ ఫింగర్ ఎమోజీని తొలగించాలి’ థంబ్స్-అప్ ఎమోజీ కొన్ని దేశాల్లో అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉందనే చర్చను లేవనెత్తగా, చైనాలో స్మైలీ ఫేస్ ఎమోజీని వ్యంగ్యంగా తీసుకుంటున్నారు. భారతదేశంలోని మధ్య వేలు ఎమోజీ అసభ్యకరంగా పరిగణిస్తున్నారు. దీనిపై ఢిల్లీకి చెందిన లాయర్ గుర్మీత్ సింగ్.. మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు లీగల్ నోటీసు పంపి, 15 రోజుల్లోగా "మిడిల్ ఫింగర్" ఎమోజీని తొలగించాలని కోరారు. మధ్య వేలును చూపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, అశ్లీలమైన, అసభ్యకరమైన సూచిక. ఇది భారతదేశంలో నేరమని పేర్కొన్నారు. సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రాబల్యం అపరిమితంగా ఉన్నప్పటికీ వ్యాపారం, అధికారిక కమ్యూనికేషన్లో వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడం చాలా అవసరమని ఏఐసీఐ సీఐపీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇమేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకురాలు సోనియా దూబే దేవాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. కాంట్రాక్ట్ ఫార్మేషన్ విషయంలో.. భారత న్యాయశాస్త్రంలో చట్టపరమైన సంబంధాలను నెలకొల్పే ఉద్దేశ్యంతో కాంట్రాక్ట్ ఏర్పాటుకు స్పష్టమైన ఆఫర్, స్పష్టమైన అంగీకారం అవసరం. ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం, 1872 కాంట్రాక్ట్ ఫార్మేషన్లో ఎమోజీలు లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల వినియోగాన్ని ప్రస్తావించలేదు. అయితే మనదేశంలోని న్యాయస్థానాలు.. ఈ-మెయిల్లు, తక్షణ సందేశం వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఏర్పడిన ఒప్పందాల చెల్లుబాటును గుర్తించాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వాట్సాప్ సమన్లు చెల్లుబాటు అయ్యే మోడ్‌గా గుర్తించారు. ఈ నేపధ్యంలో వాణిజ్య చర్చల్లో పాల్గొనే వ్యక్తులు.. తాము ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? తమ వాట్సాప్ సంభాషణలు,ఈ-మెయిల్లతో సహా మౌఖిక, రాతపూర్వక కమ్యూనికేషన్లలో ఏమి పేర్కొనాలనే దానిపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయవాది కుశాంక్ సింధు తెలిపారు. ఎమోజీల వాడకంతో సంబంధం కలిగిన సంభావ్య చట్టపరమైన పరిణామాల గురించి పార్టీలు తప్పనిసరిగా తెలుసుకోవాలని, వివాదాలను నివారించడానికి, ఈ-ఎన్ఎఫ్ఓఆర్సి ఇ బిఐఎల్ఐటి వైని నిర్ధారించడానికి వారి ఉద్దేశాల స్పష్టతను గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. మద్రాస్ హైకోర్టులో ఎమోజీ కేసు వాట్సాప్ గ్రూప్‌లో 'కన్నీళ్లతో నవ్వుతున్న ముఖం' అనే ఎమోజీని పోస్ట్ చేసినందుకు కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు వచ్చిన కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. 2018లో హైకోర్టు ఈ కేసులో.. ఎమోజీకి సంబంధించిన వివరణను గమనించినప్పుడు అనేక భావాలను తెలియజేయడానికి ఎమోజీలు పోస్ట్ చేస్తారని పేర్కొంది. ఏదైనా ఫన్నీ లేదా నవ్వు తెప్పించినప్పుడు ఈ ఎమోజీ ఉపయోగిస్తారు. ఎమోజీని ఉపయోగించడం వల్ల వేధింపులకు అవకాశం ఉండకపోవచ్చు, అయితే అది ఫిర్యాదుదారుని కించపరిచేలా ఉన్నందున అలాంటి చర్యను ఖండిస్తున్నట్లు హైకోర్టు ఒక హెచ్చరికతో ఆ ఫిర్యాదును తోసిపుచ్చింది. ఏది ఏమైనప్పటికీ పౌర, వాణిజ్య న్యాయ న్యాయశాస్త్రంలో ఎమోజీల ఉపయోగం వివరణ, ప్రభావం మారవచ్చని శశాంక్ పేర్కొన్నారు. ప్రాథమిక సాక్ష్యంగా న్యాయస్థానంలో.. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ఈ అంశంపై స్పందిస్తూ కేవలం ఎమోజీలు మాత్రమే చట్టపరమైన చర్యలకు కారణం కాదని అన్నారు. ఎలక్ట్రానిక్ మెసేజ్‌లు, ఎమోజీల కంటెంట్లు ప్రాథమిక సాక్ష్యంగా న్యాయస్థానంలో అనుమతిపొందవు. అయితే అటువంటి ఎలక్ట్రానిక్ సందేశాలను సాక్ష్యంగా అంగీకరించనప్పటికీ.. విచారణ సమయంలో ప్రధాన సాక్ష్యం, క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా ఆ కంటెంట్లను నిరూపించాలన్నారు. ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగానికి నేతృత్వం వహిస్తున్న అదనపు డీజీపీ ర్యాంక్ అధికారి. ఆమె ఈ విషయమై ఒక తీర్పును ఉటంకిస్తూ (అంబాలాల్ సారాభాయ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వెర్సెస్ కేఎస్ ఇన్‌ఫ్రాస్పేస్ ఎల్ఎల్పీ లిమిటెడ్‌తోపాటు మరో కేసులో.. ఇది జనవరి 6, 2020 నాటిది), వర్చువల్ వెర్బల్ కమ్యూనికేషన్లయిన వాట్సాప్ మెసేజ్‌లు సాక్ష్యాధారాల ద్వారా విచారణ జరిగే సమయంలో రుజువు చేయగల అంశం అని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే ఈ-మెయిల్లు, వాట్సాప్ సందేశాల ప్రకారం ఒక ఒప్పందం కుదిరిందా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి స్పషంగా వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని శిఖా గోయల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే నిర్ణయించదగిన సాక్ష్యం రూపంలో.. భారత న్యాయస్థానాలు, దర్యాప్తు అధికారులు.. వినియోగదారు ఉద్దేశాన్ని అర్థంచేసుకోవడానికి చెల్లుబాటు అయ్యే నిర్ణయాత్మక సాక్ష్యంగా ఎమోజీల వినియోగాన్ని అంగీకరించారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ఇతర క్రిమినల్ కేసులలో ఇది ఉపయోగపడుతుందని అకార్డ్ జ్యూరిస్ న్యాయవాది, సహ వ్యవస్థాపకురాలు శ్రద్ధా గుప్తా అన్నారు. మన బహుళసాంస్కృతిక సమాజంలో ఎమోజీలపై ఏకరీతి వివరణ లేదని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యానం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది సంస్కృతి, ప్రాంతం, తరం, వృత్తి మొదలైనవాటిని అనుసరించి కూడా మారవచ్చని అన్నారు. ఉదాహరణకు ఒక డాక్యుమెంట్‌ను స్వీకరించినందుకు లేదా పత్రాన్ని పంపడంలో చేసిన ప్రయత్నాన్ని తెలియజేస్తూ 'థమ్స్ అప్'ని పంపవచ్చు. ఇది ఇండియా కాంట్రాక్ట్ చట్టం ప్రకారం అంగీకారంగా భావిస్తే కేసులు మరింతగా పెరుగుతాయన్నారు. ది లా ఛాంబర్స్‌లోని సీనియర్ అసోసియేట్ అయిన శ్రద్ధ అభిప్రాయపడ్డారు. ఎమోజీలపై వివరణాత్మక మార్గదర్శకత్వం క్రమబద్ధీకరించే వరకు, ఇటువంటి కమ్యూనికేషన్ మోడ్‌ను ద్వితీయ సాక్ష్యంగా మాత్రమే పరిగణించాలన్నారు. అపార్థాలకు ఆస్కారం లేకుండా.. ఎమోజీలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకోవడం వలన అపార్థాలకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకు ఎమోజీలను వినియోగించే విషయంలో స్పష్టతను నిర్ధారించడం, గందరగోళాన్ని తగ్గించడం చేయాలని న్యాయ నిపుణురాలు సోనియా తెలిపారు. పరస్పర మర్యాదలను అర్థం చేసుకుని వ్యాపార, అధికారిక వ్యవహారాలలో సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను ఈ విధమైన రీతిలో ప్రోత్సహించవచ్చన్నారు. వ్యాపారం లేదా అధికారిక సంభాషణలో ఇతర వ్యక్తులతో ఈవిధంగా కమ్యూనికేట్ చేయడం మంచి పద్ధతి అని ఆమె పేర్కొన్నారు. ఎమోజి గందరగోళాన్ని నావిగేట్ చేయడానికి ఉండవలసిన ప్రాథమిక నియమం ఏమిటంటే.. ఎమోజీ వినియోగించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అనవసరమైన ఎమోజీలను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరమని కూడా ఆమె సూచించారు. ఇది కూడా చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్ -
సీఎం జగన్ కు తల్లిదండ్రుల ధన్యవాదాలు
-
విక్టరీ హగ్; ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు!
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడాది పాటు ఉద్యమించారు. కొంపా, గోడు వదిలి.. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా లక్ష్య సాధనకు మడమ తిప్పని పోరాటం చేశారు. పాలకులు బలవంతంగా తమ నెత్తిన రుద్దాలనుకున్న శాసనాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని కేంద్రంగా ఉద్యమ జెండా ఎత్తిన అన్నదాతలు అంతిమంగా విజయం సాధించారు. భూమిపుత్రుల పోరాటంతో దిగివచ్చిన కేంద్ర సర్కారు వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. అంతేకాదు రైతులను ఆదుకునేందుకు లిఖితపూర్వక హామీలు ఇచ్చింది. (చదవండి: రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా) లక్ష్యం నెరవేరడంతో కర్షకులు హస్తిన నుంచి స్వస్థలాలకు పయనమయ్యారు. పోరాట యోధులకు ఊళ్లల్లో జనం నీరాజనాలు పట్టారు. ఏడాది పాటు ఇంటికి దూరమై ఉద్యమ నీడలో గడిపి తిరిగొచ్చిన అన్నదాతలను కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆలింగనాలతో స్వాగతించారు. అలాంటి భావోద్వేగభరిత వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఉద్యమంలో విజయం సాధించి వచ్చిన తండ్రిని అతడి కుమార్తెలు స్వాగతించిన తీరు చూపరులందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో కనిపించిన తండ్రీకూతుళ్లు ఎక్కడి వారు అనేది వెల్లడి కాకపోయినా ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు! (చదవండి: విత్తన హక్కులలో... రైతు విజయం) -
ఇంటికి రా బిడ్డా.. మావోయిస్టులో ఉన్న కొడుకును కోరిన తల్లి
సాక్షి, చిట్యాల(వరంగల్): మావోయిస్టుల్లో సైతం కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుండడం, తాము కూడా వృద్ధాప్యానికి చేరుకున్నామని ఇంటికొచ్చి పని చేస్తూ తమను చూసుకోవాలని మావోయిస్టు నాయకుడు సెరిపల్లి సుధాకర్ తల్లి రాయపోషమ్మ కంటతడి పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సుధాకర్ 2002లో అడవి బాట పట్టాడు. ప్రస్తుతం అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతున్నందున ఇంటికి రావాలని ఆమె కోరింది. ఈ మేరకు గురువారం భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, తదితరులు ఆమెను కలిసి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఇక ముందు ఎలాంటి సాయం కావాలన్న పోలీస్‌శాఖ తరఫున చేస్తామని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకునేందుకు సుధాకర్ జనంలోకి వస్తే ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పిస్తామని తెలిపారు. చదవండి: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు -
ప్రధాని మోదీ కంటతడి
వారణాసి/లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటతడి పెట్టుకున్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య యోధులతో సమావేశం సందర్భంగా.. వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తు చేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని వైద్యులు, వైద్య సిబ్బందితో శుక్రవారం ప్రధాని వర్చువల్ సమావేశం నిర్వహించారు. కోవిడ్ 19 పేషెంట్ల వద్దకే వైద్య సేవలను తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా వారికి ఆయన సూచించారు. ‘జహాః బీమార్.. వహీః ఉపచార్’అనే కొత్త మంత్రాన్ని ఉపదేశించారు. దానివల్ల ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందన్నారు. ‘అందరి ఉమ్మడి కృషితో ఈ మహమ్మారిని కొంతవరకు నియంత్రించగలిగాం. కానీ అప్పుడే సంతృప్తి చెందలేం. యుద్ధాన్ని ఇంకా చాలారోజులు కొనసాగించాల్సి ఉంది’అన్నారు. వారణాసి, పూర్వాంచల్‌లోని గ్రామీణ ప్రాంతాలపై వైద్యులు దృష్టి పెట్టాలన్నారు. టెలీ మెడిసిన్ సేవలను విస్తృతం చేయాలని, యువ వైద్యులు, రిటైరైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, వార్డ్‌బాయ్స్, అంబులెన్స్ డ్రైవర్లు.. తదితరుల సేవలను ప్రధాని కొనియాడారు. ‘కానీ ఈ మహమ్మారి ఎంత తీవ్రంగా ఉందంటే.. ఇంతగా కష్టపడుతున్నా.. చాలా మంది ప్రాణాలను ఇంకా కాపాడలేకపోతున్నాం. మనకు దగ్గరైన వారెందరినో ఈ వైరస్ తీసుకెళ్లిపోయింది’అంటూ కంటనీరు పెట్టుకుని, గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. ఆ తరువాత కాసేపటివరకు ఆవేదనతో ఆయన మాట్లాడలేకపోయారు. కాసేపటికి తేరుకుని.. కరోనాతో చనిపోయినవారందరికీ నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నానన్నారు. కరోనా నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధాని కోరారు. తాజాగా బ్లాక్ ఫంగస్ మరో సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండో వేవ్‌లో కరోనాతో బహుముఖ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ‘ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరమున్న రోగుల సంఖ్య పెరిగింది. దాంతో వైద్య వ్యవస్థపై భారీగా భారం పడింది’అని వివరించారు. కనిపించని, క్షణక్షణం రూపుమార్చే శత్రువుతో పోరాడుతున్నామన్నారు. టీకాలే ఈ వైరస్ నుంచి కాపాడే సురక్షా కవచాలని, టీకా వేసుకున్న కారణంగానే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులు ధైర్యంగా పోరాడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ సురక్షా కవచం అందరికీ చేరాల్సి ఉందన్నారు. ఏడేళ్లుగా వైద్య రంగంలో చేపట్టిన కార్యక్రమాల కారణంగా ఈ మహమ్మారిని ఎదుర్కోగలిగామన్నారు. అయితే, ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు సేవలందించిన వైద్య సిబ్బంది కృషి విస్మరించలేనిదని కొనియాడారు. మొదట్లో తాము యోగాకు ప్రచారం చేస్తున్నప్పుడు, దానికి కొందరు మతం రంగు పులిమారని, కానీ ఇప్పుడు ఆ యోగానే కరోనాపై పోరులో మనకు సహకరిస్తోందని వ్యాఖ్యానించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల వల్ల వారణాసి లబ్ధి పొందిందన్నారు. -
సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి
న్యూ కేజల్ : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి వాషింగ్టన్కు బయల్దేరి వెళ్లడానికి ముందు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంత రాష్ట్రమైన డెలవార్ లోని న్యూ కేజల్‌లో నేషనల్ గార్డ్ సెంటర్లో మంగళవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బైడెన్ తన సొంతూరు వీడి వెళ్లిపోతున్నందుకు పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. నేను చనిపోయినా కూడా నా గుండె డెలవార్ కోసం కొట్టుకుం టూనే ఉంటుందని బైడెన్ ఉద్విగ్నంగా చెప్పా రు. సెనేటర్‌గా దశాబ్దాల తరబడి రైల్లోనే వాషింగ్టన్కు ప్రయాణం చేసిన ఆయన ప్రమాణ స్వీకారానికీ అలాగే వెళ్లాలనుకున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా బైడెన్ విమానంలో వెళ్లాల్సి వచ్చింది. తన కోరిక తీరకపోయి నప్పటికీ ఆ రైలు ప్రయాణం అనుభూ తుల్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు. ‘‘సరిగ్గా పన్నెండేళ్ల క్రితం విల్మింగ్టన్ స్టేషన్లో ఒక నల్లజా తీయుడి కోసం వేచి ఉన్నాను. రైల్లో ఆయన వెళుతూ నన్నూ తీసుకొని వెళ్లారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షు లుగా ఒబామా, నేను ప్రమాణం చేశాము. ఇప్పుడు మళ్లీ ఒక నల్లజాతీయ మహిళను కలుసు కోవడానికి వాషింగ్టన్ వెళుతున్నాం. నేను, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపా«ధ్యక్షులుగా ప్రమాణం చేస్తాం. అదీ అమెరికా.. అదీ డెలవార్’’ అని బైడెన్ చెప్పారు. -
నాన్న ఊపిరి
జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి.ఊపిరి పీల్చివదలడం కూడా అంతే.ఒకటి నిలబెట్టేది, ఒకటి పడగొట్టేది కాదు. రెండూ ఉండాలి. ఈ రెండిటితో నడిచిన క్రైమ్ డ్రామా ‘బ్రీత్’. ఇందులో ఒక తండ్రి ఎమోషన్ ఉంటుంది. అతడు దుర్మార్గుడే అయినా.. హీరోగా చూపిస్తుంది ఆ ఎమోషన్. కొడుకు ఊపిరి కోసం నాన్న తీసిన ఊపిరే.. ఈ కథ. చదవండి. ‘‘నాన్నా.. ఎన్నో కలలతో ముంబై వచ్చాను. ఇక్కడ నా ఒంటరి ప్రయాణం గురించి మీరెంత భయపడ్డారో.. కలత చెందారో నాకు తెలుసు. అనుకున్నది సాధించడం అంత ఆషామాషీ కాదని అర్థమైంది నాన్నా! సారీ.. నాన్నా.. ఈ పని చేస్తున్నందుకు క్షమించండి’’ అంటూ కాళ్లను కట్టేసుకుని.. పాలిథిన్ కవర్‌ను ముఖానికి చుట్టేసుకుని.. తనంతట తానుగా చేతులనూ కుర్చీ వెనక్కి కట్టేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది పాతికేళ్ల ఓ అమ్మాయి. ఈ వ్యవహారాన్నంతా ఫోన్ వీడియోలో రికార్డ్ చేస్తుంది. నటి అవ్వాలనే ఆశయంతో ఆమె ముంబైకి వస్తుంది. ట్రెడ్మిల్ మీద వేగంగా పరిగెడుతుంటాడు ఓ వ్యక్తి. ఎంతలా అంటే ఆ ఆయాసం ఆయనకున్న ఆస్తమాను ఎఫెక్ట్ చేసేంతగా. నా వల్ల కాదు.. ప్లీజ్ నన్ను వదిలేయ్.. అని బతిమాలుకుంటూ బతిమాలుకుంటూ ట్రెడ్ మిల్ మీదే స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఈ విషయం అతని కొడుకుకి తెలిసి.. ఇంటికొచ్చి.. ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అప్పటికే అతను కోమాలోకి వెళ్లిపోయినట్టు డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. తర్వాత కొన్ని రోజులకు కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోతాడు. అతను.. రిటైర్డ్ ప్రొఫెసర్. ఆస్తమా తప్ప ఏ ఇబ్బంది, బాదరబందీ లేక సంతోషంగా లైఫ్‌ను లీడ్ చేస్తున్న వ్యక్తి. ఒక వర్షం రాత్రి.. బైక్ మీద వెళ్తున్న ఒకతనికి యాక్సిడెంట్ అవుతుంది. తలకు బలంగా దెబ్బతగలడంతో అక్కడికక్కడే మరణిస్తాడు. హెల్మెట్ ఉంటే బతికేవాడే అనుకుంటారంతా. హెల్మెట్ ఉంటుంది. తన బైక్ వెనకాలే లాక్ చేసి! ‘‘సేఫ్టీ విషయంలో అతను చాలా అబ్సెసివ్. హెల్మెట్ లేకుండా వెళ్లడు. అలాంటిది హెల్మెట్‌ను బైక్ వెనకాల లాక్ చేసుకొని.. బైక్ రైడ్ చేయడం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది..ఎంక్వయిరీ చేయించండి’’ అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్కి కంప్లయింట్ ఇవ్వడానికి వస్తుంది అతని గర్ల్ ఫ్రెండ్. ‘‘నీ బాధ అర్థమైంది.. ఈ మంచినీళ్లు తాగు.. అయినవాళ్లు పోతే.. ఇలాంటి మానసిక స్థితే ఉంటుంది. ధైర్యంగా ఉండాలి’’ అని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు కాప్. ‘‘విషయం అది కాదు.. ’’ అని ఆమె ఏదో చెప్పబోతున్నా.. వినకుండా పంపించేస్తాడు ఇన్స్పెక్టర్. చనిపోయి కుర్రాడికి 28 ఏళ్లు. ఐటీ ప్రొఫెషనల్. ఇతనూ రిటైర్డ్ పర్సనే. దినచర్యలో భాగంగా కంట్రీక్లబ్‌కు వెళ్లి.. స్విమ్మింగ్ చేయడం అలవాటు. ఆ ప్రకారం ఆ రోజూ ఎప్పటిలాగే స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లాడు. ఈత కొడ్తున్నప్పుడు కరెంట్ పోతుంది. నీళ్లల్లో ఉక్కిరిబిక్కిరై.. ఊపిరి ఆగిపోతుంది. ఆర్ట్ గ్యాలరీ స్టోర్ రూమ్‌లో.. ఒక లేడీ ఆర్టిస్ట్ పడి ఉంది. కింద అన్నీ నీళ్లు.. కరెంట్ తీగ వేలాడ్డానికి సిద్ధంగా ఉంది. పొరపాటున ఆ నీళ్లల్లో పడితే.. షాక్ తగిలి.. ఆ ఆర్టిస్ట్ చనిపోవడం ఖాయం. అది జరగబోతుండగా.. ఇన్స్పెక్టర్ వచ్చి.. కరెంట్ తీగను నీళ్లలో వేయబోతున్న వ్యక్తిని పట్టుకుంటాడు. తర్వాత ఇంటరాగేషన్‌లో అతనిని గుండె దగ్గర కాలుస్తాడు. కరెంట్ షాక్‌తో ఆ లేడీ ఆర్టిస్ట్‌ను చంపాలనుకున్న వ్యక్తి ఎవరు? డానీ. ఫుట్‌బాల్ కోచ్. ఒక్క మహిళా ఆర్టిస్ట్‌నే కాదు.. పైన చెప్పిన అన్ని చావులతోనూ డానీకి సంబంధం ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాటికి స్కెచ్ గీసింది అతడే. అవి హత్యలు.. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో రికార్డ్ చేసిన అమ్మాయి డెత్తో సహా! డానీ.. ది మర్డరర్. ఓహ్ గాడ్.. ఎందుకు? అతనేమన్నా సైకోనా? కాదు. మంచి తండ్రి. డానీకొక కొడుకు ఉంటాడు. జాషువా. ఆరేళ్లు. అందరూ జాష్ అని పిలుస్తుంటారు. సిస్టిక్ ఫైబ్రోసిస్‌తో బాధపడుతుంటాడు. ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగితే కాని బతకడు. పైగా ఆ అబ్బాయిది రేర్ బ్లడ్‌గ్రూప్. ఏబీ నెగటివ్. ఆ గ్రహీతల జాబితాలో జాషువా అయిదో నంబర్లో ఉంటాడు. వాడు తల్లిలేని పిల్లాడు. నానమ్మ మార్గరేట్, తండ్రి డానీయే జాషువాను కళ్లల్లో పెట్టి చూసుకుంటుంటారు. అరుణ అనే డాక్టర్.. పిల్లాడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. డానీ పట్ల ఇష్టాన్నీ పెంచుకుంటుంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే జాషువా బతకడని చెప్తుంది అరుణ. వాడి లైఫ్ లైన్ అయిదు నెలల వరకే సాగొచ్చు అనే భయాన్నీ వ్యక్తం చేస్తుంది. పరిస్థితి చూస్తుంటే అయిదునెలలోపు ఆపరేషన్ జరిగేలా కనిపించదు. ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఏదైనా చేసి కొడుకును బతికించుకోవాలి. ఆఖరకు మనుషులను చంపైనా సరే అన్నంత కసిగా మార్తాడు. అప్పుడు చేస్తాడు..! .. ఈ హత్యలను. డానీ చేతిలో శ్వాస వదిలిన వాళ్లంతా ఏబీ నెగటివ్ బ్లడ్ గ్రూప్‌తో ఉన్న ఆర్గాన్ డోనర్సే. వాళ్ల జాబితా దొరికించుకొని అందులోంచి పైన మనుషులను ఎంచుకొని.. వాళ్ల జీవన శైలిని గమనించి మరీ మర్డర్‌కి ప్లాన్ చేస్తాడు డానీ. చేతికి రక్తం అంటకుండానే నాలుగు హత్యలూ కానిచ్చేస్తాడు. వీటి మీద ఇన్స్పెక్టర్ కబీర్ సావంత్‌కి అనుమానం వస్తుంది.. అవి సహజ మరణాలు కావని. మోడస్ ఆపరాండీని పరిశీలిస్తే తెలుస్తుంది.. ప్రాణం పోయినవాళ్లంతా ఆర్గాన్ డోనర్స్ అని. ఎంక్వయిరీలో భాగంగా అవయవ గ్రహీతల జాబితా మొదటి వరుసలో ఉన్నవాళ్లందరినీ ప్రశ్నిస్తాడు కబీర్. ఆ క్రమంలో డానీనీ విచారిస్తాడు. అనుమానం వస్తుంది. అతని కదలికల మీద నిఘా పెడ్తాడు ఇన్స్పెక్టర్. తర్వాత లిస్ట్‌లో ఎవరుండబోతున్నారో తెలుసుకొని హతాశుడవుతాడు. అతని భార్యే ఉంటుంది. ఆమే ఆర్టిస్ట్! పోలీస్ హంట్ తన కదలికల మీద పోలీస్ కన్నుపడిందని డానీకి అర్థమవుతుంది. వాళ్లను తప్పుదోవ పట్టించడానికి అవయవ దాతల కోసం ఎదురు చూస్తున్న ఇంకో వ్యక్తి మీదకు డౌట్‌ను మళ్లిస్తాడు. ఆ వ్యక్తి భార్యకు ఆర్గాన్స్ కావాలి. ఆమె మంచంలో అచేతనంగా పడి ఉంటుంది. సేవ చేయలేక విసిగిపోయి ఉంటాడు అతను. పోలీసులకూ అతనే చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఆ వ్యక్తి వాలకం, తీరు చూస్తే. కాని విచారణలో కాదని తేలుతుంది. ఆ విషయాన్ని అలాగే గోప్యంగా ఉంచి డానీ మీద స్పయింగ్ని మరింత కట్టుదిట్టం చేస్తాడు ఇన్స్పెక్టర్ కబీర్. అలా పోలీసులవలలో ఇరుక్కుని దోషిగా తేలుతాడు డానీ. క్లైమాక్స్‌లో కబీర్ తూటాతో తలవాల్చేసిన డానీ ఊపిరితిత్తులనే జాషువాకు అమరుస్తారు. ఇంకో కీలక అంశం.. తన కొడుకును బతికించుకోవడం కోసం డానీ సీరియల్ కిల్లర్‌గా మారాడని డాక్టర్ అరుణ గ్రహిస్తుంది. హార్ట్ ఎటాక్ నాటకంతో డానీ ఆసుపత్రిలో చేరి.. కోమాలోకి వెళ్లిన ఆస్తమా పేషంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆక్సిజన్ పైప్‌ను లాగేసి అతనిని చంపిన తీరుతో. ఆ విషయంలో డానీని నిలదీస్తుంది. అరుణకు నిజం తెలిసిపోయిందని.. ఆమెను వేగంగా వస్తున్న కారు కిందకు తోసి చంపేస్తాడు. ఇది ‘బ్రిత్’ అనే వెబ్ సీరీస్ కథ. అమెజాన్ సెకండ్ ప్రొడక్షన్. ఫస్ట్ సీజన్లో ఎనిమిది ఎపిసోడ్స్‌తో సాగుతుంది. కొడుకు ఊపిరి నిలపడం కోసం ఇంకొకరి ఉసురు తీసేంత కఠినంగా మారిన తండ్రి కథ. నిజానికి ఇది ఒక్క తండ్రి కథే కాదు. ప్యారలల్‌గా ఇంకో తండ్రి వ్యథా కనిపిస్తుంటుంది ఇందులో. ఆ వ్యథాభరితుడే ఇన్స్పెక్టర్ కబీర్ సావంత్. కబీర్‌కు ఒక కూతురు. ఆరేడేళ్లుంటాయేమో. అతని నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి కబీర్ రివాల్వర్‌తో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పేలి చనిపోతుంది. ఆ అపరాధభావంతో తాగుడికి బానిసవుతాడు కబీర్. భార్యా విడాకులిస్తుంది. చేతులారా బిడ్డను పోగొట్టుకున్నాననే బాధతో ఉద్యోగం పట్లా నిర్లక్ష్యంగానే ఉంటాడు. డానీ కేస్తోనే ఆ మత్తు వదిలి మామూలు మనిషై ఇన్స్పెక్టర్గా బాధ్యతలను నిర్వర్తిస్తాడు. డానీగా మాధవన్.. కబీర్‌గా అమిత్ సా«ద్ నటించారు. శ్వాస బిగపట్టి చూసేంత ఉత్కంఠతేమీ ఉండదు. అన్ఫార్చునేట్లీ క్లైమాక్స్ కూడా ఊహకందేస్తుంది. అయినా ఆసక్తి చావదు. అదే ‘బ్రిత్’ను నిలిపింది. వ్యూస్‌ను పెంచింది. ఒక్కడున్నాడు ‘బాంబే బ్లడ్ గ్రూప్’.. ఎక్కడా వినలేదు కదూ. గోపీచంద్ యాక్ట్ చేసిన ‘ఒక్కడున్నాడు’ సినిమా చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో విలన్ మహేశ్ మంజ్రేకర్‌కు గుండెకి సంబంధించిన ఓ సమస్య ఉంటుంది. గుండె మార్పిడి చేయాలంటే అతని బ్లడ్ గ్రూప్ (బాంబే బ్లడ్) కలిగిన మనిషి గుండె కావాలి. ఒకే ఒక్కడికి ఆ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అతనే హీరో గోపీచంద్. ఇంకేముంది? తనకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి, బ్లడ్ డొనేట్ చేయమని కోరతాడు. ఆ వంకతో గోపీచంద్‌కి మత్తు ఇచ్చి, ఎంచక్కా గుండె మార్పిడి చేసేయొచ్చన్నది విలన్ ప్లాన్. బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన గోపీచంద్‌కి మత్తులోకి జారే ముందు అసలు విషయం తెలిసిపోతుంది. ఈలోపు విలన్‌కి బీపీ పెరగడంతో ఆపరేషన్ వాయిదా పడుతుంది. మత్తులోంచి బయటకు వచ్చిన గోపీచంద్ విలన్ గ్యాంగ్‌ని రఫ్ఫాడించి, బయటపడతాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ఇంచు మించు ‘బ్రీత్’లాంటి కథే ఇది. 2002లో వచ్చి బాలీవుడ్ మూవీ ‘జాన్ క్యూ’తో ‘బ్రీత్’కి, ‘ఒక్కడున్నాడు’కి పోలికలున్నాయి. – సరస్వతి రమ -
రెడ్ హ్యాండెడ్
ఎక్కడి నుంచో ఏడుపు. పిల్లాడి ఏడుపు. గుక్కపట్టి ఏడుస్తున్న ఏడుపు. గుండెల మీద బాదుతున్న ఏడుపు. జైలు గదిలో అతడు ఉలిక్కిపడి లేచాడు. చిన్న నేరమే అనుకున్నాడు. కానీ... జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నాడు. అనంతపురం జిల్లా సోమందేపల్లి. సాయంకాలం. పోలీస్‌స్టేషన్‌కు ఒకతను వచ్చాడు. ఆందోళనగా ఉద్వేగంగా ఉన్నాడు.‘సార్... మా అబ్బాయి కృష్ణ. ఐదేళ్ల పసివాడు. ఇంటిముందు సైకిల్ తొక్కుతున్నాడు. అంతసేపూ వాడి అమ్మ అక్కడే ఉండి లోపలేదో చిన్న పని ఉండి వెళ్లొచ్చింది. చూస్తే వీడు లేడు. అంతటా వెతికాం. ఎక్కడా లేడు. ఏం చేయాలో తెలియక మీ దగ్గరకొచ్చాం’ అన్నాడు. ‘మీ పేరు’ అడిగాడు ఎస్.ఐ. ‘లక్ష్మయ్య’వెంట అతడి భార్య కూడా వచ్చింది. కంటికి మింటికి ధారగా ఏడుస్తూ ఉంది. పోలీసులు వివరాలు రాసుకున్నారు. లక్ష్మయ్య వెంట వెళ్లిన పోలీసులు అతడి ఇంటి చుట్టుపక్కల ప్రశ్నించారు. అనుమానం ఉన్న చోటల్లా వెతికారు.అందరి సమాధానం ఒకటే ‘మాకు తెలియదు.’ చీకటి పడినా వెతుకుతూనే ఉన్నారు. కానీ, ఆ పసివాడి ఆచూకీ తెలియలేదు. లక్ష్మయ్యకు ఎవరైనా శత్రువులు ఉన్నారా! అనుమానంతో ఈ దిశగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు పోలీసులు.లక్ష్మయ్యకు కిరాణాకొట్టు ఉంది. చిరువ్యాపారి. అతడికి ఆ ప్రాంతంలో మంచివాడన్న పేరుంది. ఎవరితోనూ తగాదాలు లేవు. వ్యాపారంలో ఇబ్బందులూ లేవు. పెళ్లయిన పదేళ్లకు పుట్టాడు కృష్ణ. దాంతో వాడిని కళ్లలో వత్తులు వేసుకొని చూసుకుంటున్నారు తల్లిదండ్రి. సో... ఎవరైనా ఎత్తుకెళ్లే అవకాశం లేదు. మరి ఆ పిల్లాడే ఎటైనా వెళ్లి నూతిలోనో గొయ్యిలోనో పడ్డాడా? ఎందుకంటే వాడు తొక్కిన సైకిల్ అక్కడే ఉంది. ఇలా అనుకుంటూ ఇండ్లు, ఆటస్థలాలు, బావులూ పరిశీలించారు. ఏం తేలలేదు.తిండి తిప్పల్లేకుండా బిడ్డ కోసం పలవరిస్తున్న ఆ తల్లిదండ్రి బాధ చూడలేకపోయారు పోలీసులు. మరుసటి రోజు ఉదయం కిరాణాకొట్టులో ఉన్న ల్యాండ్‌లైన్‌కి ఫోన్ వచ్చింది. లక్ష్మయ్య ఎత్తాడు. మీ పిల్లవాడిని కిడ్నాప్ చేశాం. 5 లక్షలు ఇస్తే వదిలేస్తాం. ఈ విషయం పోలీసులకు చెబితే పిల్లవాడ్ని చంపేస్తాం’... ఆ మాటలు వింటూనే లక్ష్మయ్య హడలిపోయాడు.‘అయ్య, పిల్లవాడిని ఏమీ చేయద్దు. మీరడిగిన డబ్బు ఎలాగోలా ఇచ్చుకుంటా!’ మొరపెట్టుకున్నాడు. పిల్లవాడి ఆచూకీ గురించి వాకబు చేయడానికి అప్పుడే అక్కడకు వచ్చిన ఎస్సై లక్ష్మయ్య ద్వారా విషయం అంతా విన్నాడు. ‘భయపడకండి. వాళ్లు చెప్పిన టైమ్‌కి చెప్పిన చోటుకి మీరు డబ్బుతో వెళ్దురుగానీ’ ధైర్యం చెప్పాడు. పోలీసులు ఇచ్చిన ‘సూట్‌కేసు’ను తీసుకొని కిడ్నాపర్ చెప్పిన చోటుకి వెళ్లాడు లక్ష్మయ్య.పోలీసులు మఫ్టీలో లక్ష్మయ్యను అనుసరించారు.కొంత దూరంలో పనులు చేస్తున్నట్టు ఉండిపోయారు. కిడ్నాపర్ చెప్పిన చోట సూట్‌కేస్‌ను ఉంచాడు లక్ష్మయ్య. పనులు నటిస్తూ లక్ష్మయ్య వెళ్లినవైపే చూస్తున్న ఎస్సైకి కాసేపటికి ఓ వ్యక్తి తమ ముందు నుంచే నడిచి వెళ్లడం చూశాడు. మామూలు వ్యక్తిగానే అనిపించాడు. అతని చేతి నుంచి ఏదో జారి కింద పడింది. ఎర్రటి రంగులో ఉన్న రిబ్బన్. దాన్ని ఆ వ్యక్తి తిరిగి తీసుకుని చేతికి చుట్టుకున్నాడు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కట్టెలున్న ఒక బండి అటుగా వెళ్లింది. ఓ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. అంతకుమించి ఎవరూ రాలేదు. అంతగా సంచారం ఉండని చోటు కాబట్టే కిడ్నాపర్లు ఈ ప్లేస్ చెప్పినట్టున్నారు అనుకున్నారు పోలీసులు.చీకటి పడేవరకు అక్కడే ఉన్నారు కానీ ఎవరూ ఆ సూట్‌కేసును తీసుకువెళ్లడానికి రాలేదు. చూసి చూసి తిరుగు ముఖం పట్టారు లక్ష్మయ్య, పోలీసులు. కిరాణ కొట్టులో ఉన్న ఫోన్ మోగింది.లక్ష్మయ్య ఫోన్ ఎత్తాడు. ‘నువ్వు పోలీసులకు చెప్పలేదు. నిన్ను నమ్మాం. నిన్ను పరీక్షించడానికే మేం అక్కడికి రాలేదు. రేపు సాయంకాలం మొదటి ఆట సినిమా మొదలవగానే శ్రీనివాస థియేటర్ దగ్గరకు డబ్బులు తీసుకొని రా! అక్కడ మేం చెప్పిన చోట ఆ సూట్‌కేస్ ఉంచి వెళ్లిపో! సూట్‌కేస్ తీసుకున్నాక పిల్లవాడిని మీ ఇంటి వద్ద వదులుతాం’ అన్నార‘సరే!’ అన్నాడు లక్ష్మయ్యకిడ్నాపర్లు చెప్పిన టైమ్‌కి శ్రీనివాస థియేటర్‌కి చేరుకున్నాడు లక్ష్మయ్య.ఫోన్లో చెప్పిన సమాచారం మేరకు థియేటర్‌కి ఓ పక్కగా ఉన్న జనరేటర్ దగ్గర సూట్‌కేస్ ఉంచి బయటకు వచ్చేశాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు అటే చూస్తున్నారు. సూట్‌కేసును తీసుకెళ్లడానికి వచ్చినవారిని పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులు గొడవపడుతూ వచ్చారు. గట్టిగట్టిగా అరుచుకుంటున్నారు. ఉన్నట్టుండి కొట్టుకోవడం మొదలుపెట్టారు. వారిని విడదీయడానికి అక్కడున్న జనం గుమికూడడం వెంటవెంటనే జరిగిపోయాయి.జనరేటర్‌కి పోలీసులకు మధ్య జనం. జనం సర్దిచెప్పడంతో ఆ ఇద్దరూ కాసేపటికి దూరం జరిగారు. జనరేటర్ దగ్గరున్న సూట్‌కేస్ పోలీసులకు కనిపించలేదు. గొడవపడుతున్న వారిద్దరిని పరిశీలనగా చూశాడు ఎస్.ఐ. అనుమానంగా అనిపించలేదు. కాని ఒక్క క్షణం మళ్లీ గమనించాడు. అందులో ఒక మనిషి చేతికి మణికట్టు మీద ఎర్ర రిబ్బన్ ఉంది. ఎర్ర రిబ్బన్. క్షణం ఆలస్యం చేయలేదు. పులిలా లంఘించి అతన్ని పట్టుకున్నాడు. తోడుగా నాటకం ఆడిన మరో వ్యక్తిని కూడా. ‘మాకేం తెలియదు సార్! అసలు ఆ పిల్లవాడెవరు? మేమెందుకు కిడ్నాప్ చేస్తాం! మా ఇద్దరికి డబ్బులకు సంబంధించిన సమస్య ఉంది. అందుకే గొడవపడ్డాం’ అన్నారు ఇద్దరూ.‘నిన్న.. ఎర్రటి రిబ్బన్ సూట్‌కేసును వెతుక్కుంటూ అక్కడికొచ్చింది. ఈ రోజు ఈ ఎర్రటి రిబ్బన్ ఇక్కడ గొడవపడుతుంది. మా కంతా తెలిసిపోయింది. అనవసరంగా తాత్సారం చేయకుండా విషయం చెప్పేస్తే ఎక్కువ కష్టపడరు. మా సహనాన్ని పరీక్షించద్దు’ అన్నారు పోలీసులు. విచారణలో విషయం అంతా విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు.‘ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసింది నేనే సార్’ అన్నాడు ఎర్రటి రిబ్బన్ కట్టుకున్న వ్యక్తి. అతని పేరు కిశోర్.‘నాకు సాయపడింది నా స్నేహితులు’ అన్నాడు. తోడుగా గొడవ పడిన వ్యక్తి కాకుండా సూట్‌కేసుతో ఉడాయించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు క్షణాల్లో పట్టుకొచ్చారు. మొత్తం ముగ్గురు చేసిన పని. కిశోర్ వివరాలు చెప్పడంమొదలుపెట్టాడు...ఓ రోజు టౌన్ నుంచి మా అక్కవాళ్లింటికి వచ్చాను. సిగిరెట్ కొనుక్కోవడానికి లక్షయ్య షాప్ ముందు ఆగాను. మధ్యాహ్న సమయం. కొట్టు దగ్గర లక్ష్మయ్య ఒక్కడే ఉన్నాడు. సిగరెట్ తీసివ్వడానికి అతను వెనక్కి తిరిగాడు. గల్లాపెట్టెలో డబ్బులు బాగా కనిపించాయి. నా చేయికి అందినంత తీసుకున్నాను. అప్పుడే లక్ష్మయ్య నన్ను చూశాడు. నన్ను తిట్టడమే కాకుండా, చేయి చేసుకున్నాడు. ఊళ్లో వాళ్లను పిలిచి వారందరి ముందు నన్ను తిట్టాడు. దొంగ అన్నాడు. నాకు చాలా అవమానం వేసింది. సిగ్గుతో చచ్చిపోయాను. అప్పటికి వెళ్లిపోయాను. ఈ సంఘటన జరిగి ఆరునెలలకు పైగానే అయ్యింది. అందరూ మర్చిపోయుంటారు. కానీ, నేను మర్చిపోలేదు. మొన్న మళ్ళీ ఈ ఊరికి వచ్చాను. లక్ష్మయ్య కంటపడ్డాడు. తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాను. కొట్టుకు కొంత దూరంలో ఉన్న వీళ్ల ఇంటి ముందు పిల్లవాడు ఆడుకుంటూ కనిపించాడు. వాడిని దూరం చేస్తే వీడికి తగిన శాస్తి కలుగుతుందని అనుకున్నాను. ఎత్తుకెళ్లిపోయాను’ అన్నాడు. ‘మరి, ఆ పిల్లవాడిని ఎక్కడ ఉంచారు?’‘చంపేశాను’‘వ్వాట్...!’ ‘అవున్సార్! వాణ్ణి చంపేస్తే నా పగ తీరుతుందనుకున్నాను. నా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఆ పిల్లవాడి గొంతు పిసికి చంపేశా. ఓ ఇంకుడుగుంత ఖాళీగా కనిపించింది. దాంట్లో పిల్లవాడిని వేసి, మట్టితో కప్పేశాం..’‘పిల్లవాడిని చంపేసింది చాలక డబ్బులు ఎందుకు డిమాండ్ చేశావ్!’‘లక్ష్మయ్యకు కొడుకు బలహీనత ఉంది కాబట్టి, క్యాష్ చేసుకుందామనుకున్నాను’ అన్నాడు కిశోర్. కిశోర్ చెప్పిన ఇంకుడుగుంత దగ్గర తవ్వించారు. పిల్లవాడి బాడీని వెలికి తీసి, పోస్ట్‌మార్టం చేసి తల్లిదండ్రికి అప్పగించారు. ఆ తల్లిదండ్రి కడుపుకోత ఎవరూ తీర్చలేనిది. పసివాడిని కిడ్నాప్ చేసినందుకు, చంపినందుకు, డబ్బుల కోసం వేధించినందుకు... నిందితులను జైలుకు పంపించారు పోలీసులు. పసివాడిని మట్టుపెట్టునందుకు జీవితఖైదును అనుభవిస్తున్నారు వారిప్పుడు. తాము చేసిన నేరం ఎవరికీ తెలియదనుకున్నారు. కానీ, చేతికి చుట్టుకున్న ఓ ఎర్రరిబ్బన్ కూడా తమని పోలీసులకు పట్టిస్తుందని, కటకటాల వెనక్కి నెడుతుందని గుర్తించలేకపోయారు. – నిర్మలారెడ్డి -
తన కోపమే తన శత్రువు
రమేశ్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తనకు దక్కని ఆటవస్తువును సాధించుకునేందుకు కోపం అనే ఆయుధాన్ని వాడాడు. తనకా ఆటవస్తువు దక్కింది. అంతే... కోపం అనేదాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటే దక్కనివి చాలా దక్కుతాయని అతడిలో ఒక అభిప్రాయం ముద్రించుకుపోయింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ధోరణితోనే తాను సాధించుకుంటున్న ప్రయోజనాల జాబితా కూడా పెరుగుతూ పోయింది. రమేశ్‌లో కోపం అనేది తనకు ప్రయోజనకారి అనే ధోరణీ పెరిగిపోయింది. ఒకనాడు అదే కోపంతో ఒకరిని బలంగా వెనక్కు నెట్టేశాడు. ఎదుటివారిని గాయపరచడం రమేశ్ ఉద్దేశం కాదు. కేవలం కోపంతో ఎదుటివాడిపై ఆధిపత్యాన్ని సాధించడమే అప్పటికి అతడి లక్ష్యం. కానీ విధి వేరేగా తలచింది. ఎదుటివాడు తీవ్రంగా గాయపడ్డాడు. రమేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. అతడు ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇదీ తనపై తనకు అదుపులేనంత కోపం తేగల అనర్థం అని చెప్పే ఒక కేస్ స్టడీ. కోపం అనే భావోద్వేగం ఎప్పుడూ మన అదుపులోనే ఉండటం అవసరం. సమాజంలో మనం బతుకుతున్నప్పుడు అది మరింతగా అవసరం. మనల్ని మనం అదుపులో ఉంచుకోకపోతే... మనల్ని మనం సామాజికంగా వెలివేసుకున్నట్లే. లేదా కోపం మరింత మితిమీరితే మనల్ని మనమే బలితీసుకున్నట్లే. మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా క్షణికావేశంలో చేసే ఒకే ఒక తప్పు మొత్తం జీవితాన్నే మసకబార్చవచ్చు. ఆ కోపం తాలూకు క్షణికాగ్రహం వల్ల కొందరు కుటుంబాల్నీ, ఇంకొందరు జీవితాల్నీ, మరికొందరు సాక్షాత్తూ తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఇవాళ్ల మనకు తెలిసీ... జైల్లో ఉన్న చాలామంది కేవలం తమ కోపం వల్ల చేసిన భౌతిక దాడులతో శిక్షార్హులై... ఆ క్షణాన్ని వెనక్కుతేలేక పశ్చాత్తాపంలో మగ్గిపోతున్నారంటే అది అవాస్తవం కాదు. అలాంటి కోపం గురించి, దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం గురించి, అందుకు అందుబాటులో ఉన్న మార్గాల గురించి వివరిస్తున్న ప్రత్యేక కథనం ఇది. కోపం అంటే... అసలు కోపం అంటే ఏమిటి? ఒక సహజమైన ఉద్వేగం. ఒక సహజాతం. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ఇన్స్టింక్ట్. అందుకే నెలల పిల్లల్లోనూ అది ఉంటుంది. కావాల్సింది దొరకనప్పుడు, అసౌకర్యంగా ఉన్నప్పుడు పిల్లలు కోపాన్ని ఏడుపు ద్వారా వ్యక్త పరుస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కొత్త రూపాలను పొందుతుంటుంది. కొత్త మార్గాల్లో వ్యక్తమవుతుంటుంది. నిర్వచన రూపంలో చెప్పుకోవాలంటే... ‘కోపం అనేది మనకు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు లేదా సౌకర్యంగా లేనిది చోటుచేసుకుంటున్నప్పుడు రేగే ఒక ప్రతికూల భావోద్వేగం’. ఈ భావోద్వేగం కలిగినప్పుడు అదుపు కోల్పోతే మర్యాదాకరం కానివిధంగా రియాక్ట్ అవుతాం. అర్థం లేకుండా, నిర్లక్ష్యంగా, బెదిరింపు ధోరణితో ప్రవరిస్తాం. కట్టలు తెంచుకున్న కోపంలో అనర్థాలు చేసి కూర్చుంటాం. ఇలా కోపం వల్ల జీవితాలే నాశనం చేసుకున్నవారు ఉన్నారు. తీవ్రమైతే అనర్థమే... కోపం కొందరిలో చాలా తీవ్రంగా ఉంటుంది. ఇందుకు మన పూర్వ గ్రంథాల్లో ఉదాహరణలు కూడా ఉన్నాయి. దూర్వాసుడు మహామునే అయినా కోపం అనే గుణం కారణంగానే కోపిష్టి అనే మచ్చ పొందాడు. అంటే వ్యక్తిత్వాన్ని, శీలాన్ని దెబ్బతీసే దుర్గుణం కోపానికి ఉందని అర్థం. పొరుగువారిపై ద్వేషాలతో పుట్టిన కోపమే ప్రపంచ వ్యాప్తంగా చాలా యుద్ధాలకు కారణం. అయితే దేనికైనా మితం ఉంటుంది. మితిమీరిన కోపం తనకూ సమాజానికీ నష్టం చేసే స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా ఒక మానసిక సమస్యగానే మానసికవేత్తలు పరిగణిస్తారు. కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది... మనలో ఉత్పన్నమయ్యే భావోద్వేగాలకు మెదడులోని బాదం షేపులో ఉండే ‘అమిగ్దలా’ కారణం. మనకు ఏదైనా అప్రియమైన ఘటన జరుగుతుందని తెలిసిన వెంటనే ఈ అమిగ్దలా ప్రేరేపితమవుతుంది. అయితే మనకు జరగబోయే అసలు నష్టాన్ని తార్కికంగా ఆలోచించే భాగం ‘కార్టెక్స్’. ఈ కార్టెక్స్ కంటే ముందుగానే అమిగ్దలా రంగంలోకి దిగిపోవడంతో ఒంట్లో అడ్రినలీన్, కార్టిసోల్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు స్రవిస్తాయి. అడ్రినలిన్ రక్తంలోకి చాలా ఎక్కువ మోతాదులో పంప్ అవుతుంది. అడ్రినలిన్ ఎంత ఎక్కువగా ఉంటే కోపం తీవ్రత అంత ఎక్కువన్న మాట. అదే సందర్భంలో ఆ కోప సమయాన్ని ఎదుర్కునేందుకు అవసరమైన శక్తి కోసం రక్తంలోకి గ్లూకోజ్ కూడా ఎక్కువగా పంప్ అవుతుంది. అంతేకాదు అన్ని కణాలకూ ఆ శక్తి చేరడానికి వీలుగా రక్తనాళాలూ విప్పారతాయి. ఇలా విప్పారడం వల్ల రక్తం జివ్వున ఎగజిమ్మడం వల్లనే కొందరిలో కోపం వచ్చినప్పుడు ముఖం, శరీరం ఎర్రబారతాయి. అయితే సమన్వయ వ్యవస్థలో భాగంగా మెదడులోని విచక్షణాæ కేంద్రమైన కార్టెక్స్ రంగంలోకి దిగి క్రమంగా పరిస్థితిని అవగతం చేసి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా వ్యక్తిని క్రమంగా నార్మల్ స్థితికి తెస్తుంది. ఇదీ కోపంలో జరిగే మెకానిజమ్. ఆగ్రహ వ్యక్తీకరణల్లో అనేక రకాలు కోపం వ్యక్తమయ్యే తీరును బట్టి దానికి పేరు పెట్టారు మానసిక నిపుణులు. కోపం యొక్క లక్షణాలు, వాటి పేర్లు ఇలా ఉన్నాయి. షౌటింగ్ స్పెల్స్ : తీవ్రస్వరంతో గొంతు చించుకుని అరవడం. ఇలా అదుపు కోల్పోయి అరవడం వల్ల కొన్నిసార్లు కొందరిలో స్వరపేటిక దెబ్బతింటుంది. గొంతు బొంగురుబోతుంది. చాలా రోజులు మామూలుగా మాట్లాడలేరు కూడా. ఇలాంటి కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘షౌటింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. బ్యాంగింగ్ ఆఫ్ హెడ్ : తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతూ తలను గోడకేసి బాదుకోవడాన్ని ‘బ్యాంగింగ్ ఆఫ్ హెడ్’ అని అంటారు. డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ (డీఎస్‌హెచ్) : ఇది కోపంలో తమకు తాము హాని చేసుకునే స్థితి. ఉదాహరణకు బైక్‌పై వెళ్తున్నప్పుడు రాయి అడ్డం పడి బండి పక్కకు ఒరిగిపోయిందనుకోండి. కోపంతో వాహనదారుడు కాలు చిట్లి రక్తం వచ్చేంత తీవ్రతతో ఆ రాయిని తంతాడు. గాయపడతాడు. ఆత్మహత్యకంటే ఒక మెట్టు తక్కువ స్థాయి ఆగ్రహప్రకటన ఇది. డెలిబరేట్ ఇన్సామ్నియా : కొందరు తమ ఆగ్రహాన్ని నిద్ర మీద చూపిస్తారు. తమకు ఎంతగా నిద్రవస్తున్నా నిద్రపోకుండా తమను తాము హింసించుకుంటారు. దీన్ని వైద్యపరిభాషలో ‘డెలిబరేట్ ఇన్సామ్నియా’గా చెబుతారు. డెలిబరేట్ నాన్ కో–ఆపరేషన్: గాంధీమార్గంలో కోపం వ్యక్తం చేసే రూపమిది. బాగా కోపం వచ్చిన వారు దాన్ని తమ రోజువారీ కార్యకలాపాల మీద చూపిస్తారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లరు. పెద్దలైతే ఆఫీసుకు వెళ్లరు. బాస్ పిలిచినా ఆఫీసు సమావేశాలకు అటెండ్ కారు. చేతిలోని వస్తువు విసిరి కొట్టడం : టీవీలో మనం సపోర్ట్ చేస్తున్న టీమ్ ఓడిపోయిందనుకోండి. టీవీని బద్దలు కొట్టేస్తాం. అలాగే కొందరు కళ్లజోడునూ, చేతిలోని మొబైల్‌నూ విసిరివేయడం చాలా కుటుంబాల్లో చూసే దృష్టాంతమే. ఇది ఆర్థికంగా చేసుకునే హాని. జుట్టు పీకేసుకోవడం : ఆగ్రహంతో జుట్టుపీకేసుకోవడం చేస్తారు. కేవలం తలపైని జుట్టు కాకుండా కొందరు కనురెప్పల్లోని వెంట్రుకలు మీసంలోని వెంట్రుకలు పీకేసుకుంటుంటారు. ఇలా జుట్టు పీకేసుకునే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘ట్రైకోటిల్లోమేనియా’ అంటారు. – డా.కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ ఆగ్రహాన్ని అదుపు చేసుకొనే మార్గాలు (యాంగర్ మేనేజ్మెంట్) కోపం ఎప్పుడూ మన అదుపులోనే ఉండాలి. దాని అదుపులోకి మనం వెళ్లకూడదు. కోపాన్ని నివారించుకునేందుకు అనుసరించదగిన కొన్ని మార్గాలివి... ►కోపంతో ఏదైనా పనికి పూనుకునే ముందు దానిని వాయిదా వేయాలి. ఒకటికి రెండు సార్లు చేయబోయే పని మంచిదేనా అని ఆలోచించాలి. ఆ పని చేసే ముందర శ్రేయోభిలాషితో తప్పక సంప్రదించాలి. ►జీవితంలో అన్నీ తాత్కాలికమైన పరిణామాలే. కోపం ఒక ఉద్వేగం. అది క్షణికం మాత్రమే. ఆ స్థితి దాటిన తర్వాత పరిస్థితి మామూలైపోతుంది అని గ్రహించాలి. ►ప్రతిసారీ మనదే గెలుపు కాదు. కొన్నిసార్లు అవతలి వాళ్లూ గెలవవచ్చు. ఇది చాలా సహజం. క్రీడాస్ఫూర్తితో ఈ వాస్తవాన్ని ఆమోదించాలి. ►మీరు ఎంతగా మన శ్రేయోభిలాషుల మాటలు వింటుంటే, మీలోని ఆగ్రహం అంతగా తగ్గుతుంది. ► జీవితంలో ప్రతిదీ మీకు తెలిసి ఉండాలనే లేదు. మీకు తెలియని అంశాలూ ఉండవచ్చు. అందుకోసం చిన్నబుచ్చుకోవడం, కోపం తెచ్చుకోవడం తగదు. ►నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం, రిలాక్స్ కావడం... జీవితంలో ఇవీ చాలా ప్రధానమైనవే అని గుర్తుంచుకోండి. ►కోపాన్ని సమర్థంగా నియంత్రించగలవాడు అని మీరు నమ్మినవాళ్లను మీ రోల్‌మోడల్‌గా ఎంచుకోండి. వాళ్లను అనుసరించడానికి ప్రయత్నించండి. వారంలో కనీసం కొద్దిసేపు వాళ్లతో గడపండి. ►మీకు కోపం వచ్చినప్పుడు మీరు గెలవవచ్చు. కానీ మీ కుటుంబ సభ్యులు ఓడిపోతుంటారన్న విషయాన్ని గ్రహించండి. ► మీ మాట నెగ్గుతోందా, మీ పంతం నెరవేరుతోందా, లేక మీరు గెలుస్తున్నారా అన్న అంశంపై స్పష్టత తెచ్చుకోండి. ►ఏయే సమయాల్లో మీకు కోపం వస్తుందో గ్రహించి, మీ వృత్తి బాధ్యతలలో కోపం వల్ల మీరేమి కోల్పోతున్నారో, దానిని అధిగమించడం వల్ల మీరు గెలవగలిగేదేమిటో రాసుకొండి. దాన్ని మాటిమాటికీ చదువుకోండి. కోపంతో కొన్ని ప్రయోజనాలివి... కోపం అన్నది ఎప్పుడూ ప్రతికూలం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఉపయోగకరమైన మోతాదులో మంచి కూడా చేస్తుంది. అలా దాన్ని పాజిటివ్‌గానూ ఉపయోగించవచ్చు. కోపాన్ని సద్వినియోగం చేసుకోగల పరిస్థితులివే... ►మీరు ఒక మంచి వ్యాపకాన్ని ఎంచుకోండి. మీకు కోపం వచ్చినప్పుడల్లా ఆగ్రహాన్ని ఆ వ్యాపకంలో ప్రదర్శించండి. ►ఏదైనా ఒక ఆటను ప్రాక్టీస్ చేయండి. ఆగ్రహ సమయంలో మీకు ఇష్టమైన ఆట ఆడండి. ►వేర్వేరు రంగాలకు చెందిన అనేక రకాల వ్యక్తులతో మీకు సత్సంబంధాలు ఉండేలా చూసుకోండి. కోపం రాగానే, మీరున్న చోటి నుంచి పక్కకు వెళ్లి, మీ స్నేహితులను కలవండి. ► కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇతరులకు శిక్షణ ఇవ్వండి. ఇలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరే... కోపాన్ని నివారించుకోవాలన్న స్పృహను అభివృద్ధి చేసుకుంటారు. ► సేవా కార్యకలాపాల్లో ఉన్నప్పుడు కోపం కలగదు సరికదా... సంతోషం మరింత ఎక్కువవుతుంది. ► మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్లను ముందుగా వెళ్లనీయండి. వెళ్లనిచ్చేలా మనసుకు శిక్షణ ఇచ్చుకోండి. మన జీవననైపుణ్యాలకు ఈ గుణాన్ని అలవరిస్తే దీనితో జీవితంలోనూ చాలా మార్పులు వస్తాయి. ఫిలసాఫికల్‌గా మీరు చాలా ఉన్నత స్థానంలోకి చేరుతారు. మిమ్మల్ని అభిమానించేవారూ పెరుగుతారు. ► మంచి సంగీతం, పాటలూ మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. ► కోపం వచ్చినప్పుడల్లా మరిన్ని అదనపు బాధ్యతలు తీసుకోండి. కసితో వాటిని పూర్తి చేయండి. ► మనస్తత్వ శాస్త్రానికి చెందిన కొత్త పుస్తకాలను వెతకండి. చదవండి. ఆసక్తికరమైన ఇతర మంచి పుస్తకాలూ చదవచ్చు. ►హాస్యసంఘటనలు, హ్యూమర్ వీడియోలు, కార్టూన్లు, కామెడీ సినిమాలు చూడండి. -
ఔను! తప్పుచేశాను, క్షమించండి: గంభీర్
కోల్‌కతా: బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చివర్లో సూర్యకుమార్ బౌండరీ కొట్టగానే.. గౌతం గంభీర్ చాలా విచిత్రంగా వ్యవహరించాడు. కట్టలు తెగిన భావోద్వేగంతో అతడు కనిపించాడు. చేతిలో టవల్‌ను నేలకేసి కొట్టి.. పక్కన ఉన్న కూర్చీలను పిచ్చికోపంతో తన్నేశాడు. ఈ దృశ్యాలు లైవ్‌లో పదేపదే ప్రసారమయ్యాయి. తాను నాయకత్వం వహిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించినా గంభీర్ ఇలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కాక కామెంటెటర్లు కూడా తికమకపడ్డారు. ఇంత ఆగ్రహంగా ప్రవర్తించడంపై మ్యాచ్ రిఫరీ కొరడా ఝలిపించాడు. ఈ ప్రవర్తనకుగాను గంభీర్‌ను మందలించడమే కాదు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించాడు. ఇప్పటికే తన కెప్టెన్సీలో రెండుసార్లు కోల్‌కతా జట్టుకు ఐపీఎల్ కప్‌ను అందించిన గంభీర్‌కు వివాదాలు కొత్త కాదు. తాజాగా అతని తీరుపై పలువైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. 'ఔను! నేను తప్పచేశాను. అలా కుర్చీలను తన్ని ఉండాల్సింది కాదు' అంటూ వివరణ ఇచ్చాడు. ఓ మీడియాకు రాసిన వ్యాసంలో తన ప్రవర్తనకుగాను క్షమాపణలు చెప్పాడు. అదే సమయంలో క్రికెటర్లు కూడా మనుషులేనని, వారికి భావోద్వేగాలు ఉంటాయని తన ప్రవర్తనను సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేశాడు. తన ప్రవర్తనకు చింతిస్తున్నానని చెప్పాడు. తన ప్రవర్తనను ప్రధానంగా చూపి బెంగళూరుతో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన యూసుఫ్ పఠాన్, అండ్రూ రస్సెల్ బ్యాటింగ్ ప్రతిభను పట్టించుకోకపోవడం సబబు కాదని చెప్పాడు. పఠాన్, రస్సెల్ మెరుపులతో బెంగళూరుపై కోల్‌కతా అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. -
మెదక్ కలెక్టర్ స్మితా సబర్వాల్ భావోద్వేగం!
-
యువతిని రైలు కిందకు తోసి హత్య
చేగుంట, మాటా మాటా పెరిగి ఆవేశంతో ఓ యువతిని రైలు కింద తోసి హత్యకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మాసాయిపేటకు చెందిన మున్నీబీ, ఆమె కుమార్తె తస్లిం(23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు మున్నీబీ ముందుగానే వెళ్లిపోవడంతో తస్లిం శనివారం పరిశ్రమలో పని ముగించుకుని శ్రీనివాస్‌నగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. తస్లిం పనిచేసే పరిశ్రమలోనే విధులు నిర్వర్తించే మేడ్చల్‌కు చెందిన నరేందర్ అక్కడ తారసపడ్డాడు. మాట్లాడుతుండగానే వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన నరేందర్ అటువైపు వస్తున్న రైలు కిందికి తోసేశాడు. దాంతో తస్లిం అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసిన ప్రయాణికులు నరేందర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే వారి గొడవకు కారణమేంటో తెలియలేదు.