మెదక్ కలెక్టర్ స్మితా సబర్వాల్ భావోద్వేగం! | medak collector smitha sabarwal gets emotion | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 2 2014 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ కంట తడి పెట్టారు. ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జరిగిన సంఘటనలను తలచుకుని పలుమార్లు కళ్లు తుడుచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలను సత్కరించే కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది. అమరవీరుల త్యాగాలను తలచుకుని భావోద్వేగానికి గురైన స్మితా సభర్వాల్.. పలుమార్లు కంటతడి పెట్టుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంతాచారి తండ్రి మాట్లాడుతూ, తన బిడ్డలాంటి చాలామంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఉందని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement