ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడాది పాటు ఉద్యమించారు. కొంపా, గోడు వదిలి.. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా లక్ష్య సాధనకు మడమ తిప్పని పోరాటం చేశారు. పాలకులు బలవంతంగా తమ నెత్తిన రుద్దాలనుకున్న శాసనాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని కేంద్రంగా ఉద్యమ జెండా ఎత్తిన అన్నదాతలు అంతిమంగా విజయం సాధించారు. భూమిపుత్రుల పోరాటంతో దిగివచ్చిన కేంద్ర సర్కారు వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. అంతేకాదు రైతులను ఆదుకునేందుకు లిఖితపూర్వక హామీలు ఇచ్చింది. (చదవండి: రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా)
లక్ష్యం నెరవేరడంతో కర్షకులు హస్తిన నుంచి స్వస్థలాలకు పయనమయ్యారు. పోరాట యోధులకు ఊళ్లల్లో జనం నీరాజనాలు పట్టారు. ఏడాది పాటు ఇంటికి దూరమై ఉద్యమ నీడలో గడిపి తిరిగొచ్చిన అన్నదాతలను కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆలింగనాలతో స్వాగతించారు. అలాంటి భావోద్వేగభరిత వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఉద్యమంలో విజయం సాధించి వచ్చిన తండ్రిని అతడి కుమార్తెలు స్వాగతించిన తీరు చూపరులందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో కనిపించిన తండ్రీకూతుళ్లు ఎక్కడి వారు అనేది వెల్లడి కాకపోయినా ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు! (చదవండి: విత్తన హక్కులలో... రైతు విజయం)
Comments
Please login to add a commentAdd a comment