Jagananna Chedodu
-
కౌరవులతో పోరాడుతున్నాం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ప్రతీ అడుగులోనూ వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రేమ, బాధ్యత చూపిస్తున్న ప్రభుత్వం మనది. రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడు ఓవైపు, పెత్తందారీ మరోవైపు ఉన్నాడు. యుద్ధం జరగబోయేది కులాల మధ్య కాదు.. జరగబోయే యుద్ధం క్లాస్ వార్! కౌరవులంతా ఓవైపు ఉన్నారు. తోడేళ్లంతా ఏకం అవుతాయి. ఆ గజదొంగల ముఠాల్లా మీ బిడ్డకు అర డజను టీవీ ఛానెళ్లు లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి తోడూ ఉండదు. నేను నమ్ముకుంది దేవుడి దయ.. చల్లని దీవెనలను మాత్రమే. మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. వారు చెప్పే మోసాలు, అబద్ధాలను నమ్మకండి. ఓటు వేసే ముందు ఒక్కటే ఆలోచించండి. మీ బిడ్డ వల్ల మీ ఇంటికి మంచి జరిగిందా? లేదా? అని ఆలోచించండి. మంచి జరిగిందంటే మీరే మీ బిడ్డకు సైనికుల్లా అండగా ఉండండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ‘జగనన్న చేదోడు’ నాలుగో విడత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.25 లక్షల మంది టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.325.02 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీవన యానంలో తోడుగా నిలబడ్డాం.. వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నెముక కులాలుగా మారుస్తామని నా పాదయాత్ర సందర్భంగా మాటిచ్చా. ఈ 52 నెలల పాలనలో నవరత్నాలులోని ప్రతి కార్యక్రమం ద్వారా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగానని మీ బిడ్డగా సగర్వంగా తలెత్తుకుని చెబుతున్నా. వారి జీవన ప్రయాణంలో తోడుగా నిలబడ్డాం. సొంత దుకాణాలున్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు జగనన్న చేదోడు ద్వారా ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. క్రమం తప్పకుండా వరుసగా నాలుగో ఏడాదీ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనిద్వారా 1.80 లక్షల మంది టైలర్లు, 1.04 లక్షల మంది రజకులు, దాదాపు 40 వేల మందికిపైగా నాయీ బ్రాహ్మణులకు ఈరోజు మేలు జరుగుతోందని సంతోషంగా చెబుతున్నా. చేదోడు ద్వారా ఇవాళ జమ చేస్తున్న నగదుతో కలిపితే ఇప్పటివరకు దాదాపు రూ.1,252 కోట్లు కేవలం ఈ ఒక్క పథకం కోసమే ఖర్చు చేశాం. ఒక్కో పేద కుటుంబానికి రూ.40 వేల చొప్పున మేలు చేయగలిగాం. ఈ 52 నెలల్లో ప్రతీ అడుగు మంచి కోసమే వేశాం. మొత్తంగా రూ.2.38 లక్షల కోట్లను మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష చూపలేదు. గతంలో ఎవరైనా ఆలోచించారా? చిన్న షాపులు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్న వారంతా బతకలేని పరిస్థితుల్లో ఉంటే ఈ వ్యవస్థలు కుప్పకూలిపోవా? అని అడుగుతున్నా. ఇలాంటి వారి గురించి గతంలో ఎవరైనా ఆలోచించారా? ప్రతీ అడుగులోనూ పేదలకు తోడుగా నిలిచాం. చేదోడు, వాహనమిత్రతో పాటు స్వయం ఉపాధిని ప్రోత్సహించే కార్యక్రమాలతో పేదలకు అండగా ఉన్నాం. ఏటా క్రమం తప్పకుండా సాయం చేస్తున్నాం. ప్రతీ పేద ఇంట్లో నా అక్కచెల్లెమ్మలకు తోడుగా, వారి పిల్లలకు మేనమామలా తోడుగా ఉన్నా. అప్పుడూ ఇదే బడ్జెట్.. ఈ పథకాలన్నీ ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా? అమలు జరిగాయా? అని అంతా ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తోడుగా నిలిచి వారి అభ్యున్నతికి అడుగులు పడింది మీ బిడ్డ నాలున్నరేళ్ల పాలనలోనే. ఈ ప్రభుత్వం వస్తుంది.. ఇలా పథకాలను ఇవ్వగలుగుతుంది... ఎక్కడా లంచాలు, వివక్ష ఉండదు... ఏ పార్టీకి ఓటేశారని అడగరు.. అర్హత ఉంటే చాలు ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎవరైనా అనుకున్నారా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేస్తున్నాం. అప్పుడూ ఇప్పుడూ అదే బడ్జెట్.. అదే రాష్ట్రం! మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల పెరుగుదల కూడా అప్పటి కంటే తక్కువే. మరి అప్పుడు ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఎందుకు జరుగుతున్నాయి? అని అంతా ఆలోచించాలి. గతానికీ, ఇప్పటికీ తేడా ఒక్కటే. మీ బిడ్డ మంచి మనసుతో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళుతున్నాయి. అప్పట్లో గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరికి తోడుగా దత్తప్రుత్రుడు... వీరంతా కలసి దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే! అప్పటికీ, ఇప్పటికీ తేడా ఇదీ. అప్పట్లో గజదొంగల ముఠా దోచేసే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే నేరుగా ఖాతాల్లోకి వెళుతున్నాయి. మనందరి పాలనలో.. ఏ పేద కుటుంబమైనా, సంప్రదాయ వృత్తుల కుటుంబాలైనా, రైతులు, కూలీలు.. పేదరికంలో ఉన్న వారెవరైనా కోరుకునేది వారికి ఎప్పుడైనా వైద్యం అవసరమైతే మంచి మనసుతో అండగా నిలిచి ఎన్ని లక్షలైనా ఖర్చు చేసే ప్రభుత్వం కావాలనే! ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, లంచాలు లేకుండా వారి కుటుంబానికి ఇంటి ముందుకొచ్చి చేతికిచ్చిపోయే ప్రభుత్వం రావాలని, కావాలని కోరుకుంటారు. ఇంటి స్థలం, ఇల్లు అవసరాన్ని గుర్తించి వాటిని అందించి, నిర్మించి ఇచ్చే ప్రభుత్వం రావాలని, కావాలని కోరుకుంటారు. నిరుపేద కుటుంబాన్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయట పడేసేందుకు తమ పిల్లలను మంచిగా చదివించే మేనమామ స్థానంలో ఉండే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అవ్వాతాతలను ఆదుకునే పాలకుడు కావాలని కోరుకుంటారు. అక్కచెల్లెమ్మల సాధికారతకు అండగా నిలబడే మంచి అన్నయ్య, తమ్ముడు సీఎంగా కూర్చోవాలని ప్రతీ పేద కుటుంబం కోరుకుంటుంది. ఇలాంటి మార్పులన్నీ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో కళ్లెదుట కనిపించే విధంగా పాలన అందుబాటులోకి వస్తే అలాంటి పాలనను ‘మా పాలన.. మనందరి పాలన.. మా బిడ్డ పాలన.. మా జగనన్న పాలన ’అని అంటారు. కుప్పంలోనూ ఇళ్లు ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే చంద్రబాబు సాగించిన పాలనను చూస్తే కుప్పం ప్రజలు కూడా ఆయన్ను తమవాడు అని చెప్పుకునే పరిస్థితి లేదు. మూడు విడతలుగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అక్కడ పేదవాళ్లకు ఇంటి స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. మీ బిడ్డ ప్రభుత్వం అక్కడ 20 వేల ఇంటి పట్టాలను పేదలకు ఇచ్చింది. ఆ అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలివ్వడమే కాకుండా 8 వేల ఇళ్లను కూడా నిర్మిస్తోంది మన ప్రభుత్వమే. మాఫీ పేరుతో ముంచేశాడు.. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు, దత్తపుత్రుడి సంతకాలతో లెటర్లు తీసుకొచ్చారు. టీవీ ఆన్ చేస్తే చంద్రబాబు ముఖం కనిపించేది. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఊదరగొట్టారు. తీరా చంద్రబాబు సీఎం అయ్యాక రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ, బంగారం సంగతి దేవుడెరుగు అప్పటి వరకూ వస్తున్న సున్నా వడ్డీని కూడా ఎత్తేశాడు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. సున్నా వడ్డీ పథకం రద్దయింది. బ్యాంకుల్లోని బంగారాన్ని వేలం వేసే పరిస్థితులు రావడంతో రెతన్న అష్టకష్టాలు పడ్డాడు. అందుకే ఆలోచించాలని అంతా అడుగుతున్నా. 2019 మేనిఫెస్టోలో రైతుకు ఏం చెప్పామో అంతకంటే మిన్నగా చేస్తోంది మీ బిడ్డ ప్రభుత్వం. మేనిఫెస్టోను ప్రకటించి ఎన్నికల తర్వాత చంద్రబాబు చెత్త బుట్టలో వేసిన పరిస్థితిని గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. అక్కా.. మీరే చూడండి అంటూ ఎన్నికల వేళ మీ బిడ్డ ఓ మాట చెప్పాడు. అందులో 99 శాతం హామీలను పూర్తి చేసి మేనిఫెస్టోని ప్రతి గడప వద్దకూ తీసుకెళ్లి ‘అక్కా.. జగనన్న మీకు ఈ మాట చెప్పాడు! ఆ మాటను నెరవేర్చాడు చూడండి..’ అంటూ మీ బిడ్డ ప్రభుత్వం పాలన చేస్తోంది. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకూ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి ఫైబర్ గ్రిడ్ దాకా.. చివరకు మద్యంలోనూ దోచేయడం, పంచుకోవడం, తినుకోవడమే. ఇది మినహా నాడు ఏదీ కనిపించలేదు. ఆ మోసాలు.. గుర్తున్నాయా? పొదుపు సంఘాలను మోసం చేస్తూ చంద్రబాబు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా? నాడు టీవీల్లో ప్రకటనలు వచ్చేవి! ఓ అక్క, ఓ చెల్లెమ్మను చూపించేవారు. అందులో మంగళసూత్రం లాక్కుని వెళ్లే ఓ చేతిని మరో చెయ్యి పట్టుకుంటుంది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అనేవారు. ఆయన సీఎం అయ్యారు కానీ అప్పటివరకూ ఏ, బీ, గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి. పొదుపు సంఘాలకు అప్పటివరకూ ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు. అక్కచెల్లెమ్మలకు ఎన్నో ఇబ్బందులు కల్పించారు. ఆ దుస్థితి నుంచి కాపాడేందుకు మీకు మంచి అన్నయ్య, తమ్ముడు.. మీ బిడ్డ రూపంలో సీఎం స్థానంలోకి వచ్చాడు. వారందరికీ తోడుగా ఉన్నాడు. వైఎస్సార్ ఆసరాÆ, సున్నా వడ్డీ, చేయూతను తోడుగా ఇచ్చాడు. అమ్మ ఒడి ద్వారా ఆదుకున్నాడు. దీంతో ఆ సంఘాలు తిరిగి ఏ, బీ గ్రేడ్‌గా చలామణీ అవుతున్నాయి. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు వస్తుంటే బ్యాంకర్లు సెల్యూట్ కొట్టి రుణాలు ఇస్తున్నారు. నాడు 18 శాతం ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ రుణాలు నేడు 0.3 శాతానికి తగ్గాయి. రాష్ట్రమే కాదు దేశం మొత్తం మన పొదుపు సంఘాల వైపు చూస్తోంది. ఏకంగా 2.07 లక్షల కొత్త ఉద్యోగాలు.. చంద్రబాబు హయాంలో పేదవాడు ఎలా బతుకున్నారో కనీసం ఆలోచించలేదు. ఇల్లు, ఇంటి స్థలం ఉందా? అని ఆలోచించి కనీసం ఒక్క సెంటు ఇచ్చిన పాపాన పోలేదు. మీ బిడ్డ సీఎం అయ్యాక 10, 20 లక్షలు కాదు.. ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలిచ్చాడు. ఒక్కో ఇంట్లో సగటున ముగ్గురు ఉన్నారనుకున్నా ఏకంగా కోటి మందికి మేలు చేసే కార్యక్రమం చేశాం. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వేగంగా పేదల గృహాలను నిర్మిస్తున్నాం. ఈ తేడాను గమనించాలి. చంద్రబాబు హయాంలో ఎంతమంది పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలి.. అంటూ ప్రకటనలిచ్చారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగభృతి ఇస్తానని ఊదరగొట్టారు. బాబు సీఎం అయినా భృతి ఇవ్వకుండా పిల్లలను కూడా మోసం చేశాడు. ఆపై మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా 2.07 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చాడు. అందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే 80 శాతం ఉద్యోగాలిచ్చాం. మనుషులు చనిపోయినా పట్టని బాబు పాలన గతంలో పింఛన్, రేషన్‌కార్డు లాంటి ఏ పౌర సేవ కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తూ చెప్పులు అరిగేలా తిరిగిన రోజులే గుర్తుకొస్తాయి. చంద్రబాబు హయాంలో రైతులకు ఎరువులు, పురుగు మందులు కావాలంటే మండల కేంద్రానికి వెళ్లి క్యూలో నిల్చునేవారు. మనుషులు చనిపోయినా పట్టించుకోని పాలన ఆయనదైతే ఇప్పుడు మీ బిడ్డ పాలనలో అవన్నీ మన గ్రామంలో, మన గడప వద్దకే వలంటీర్లు చిరునవ్వుతో తెచ్చి సంక్షేమ ఫలాలను అందిస్తూ తోడుగా ఉంటున్నారు. అప్పట్లో ఆరోగ్యశ్రీని ఎలా వదిలించుకోవాలనే పాలన సాగింది. రాష్ట్రంలో 108,104 వాహనాలకు కనీసం డీజిల్ ఖర్చులు కూడా ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు పాలన పోయింది. మీ బిడ్డ పాలన వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఆదోనిలో కూడా మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నాం. ఏకంగా 1,600 కొత్త 108, 104 వాహనాలను కొనుగోలు చేసి పేదవాడికి తోడుగా ఉన్నాం. గతంలో ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం వెయ్యి ప్రొసీజర్లు మాత్రమే ఉంటే ఈ రోజు 3,300 ప్రొసీజర్లకు విస్తరించాం. రోగులు ఆపరేషన్ అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో డాక్టర్ల సిఫారసు మేరకు నెలకు రూ.5 వేల చొప్పున వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందిస్తున్నాం. ఇవాళ ప్రతీ గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. వీటికి తోడు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి వచ్చి జల్లెడ పట్టి వైద్య పరీక్షలు చేసి మందుల నుంచి చికిత్స వరకూ అందిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. పేద పిల్లలకు నాణ్యమైన చదువులు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియానికే పరిమితం చేసి నారాయణ, చైతన్యలను పెంచి పోషించిన పరిస్థితి చంద్రబాబు హయాంలో ఉంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా రూపురేఖలు మార్చి 6 నుంచి పైతరగతులను డిజిటలైజ్ చేశాం. ప్రతి పేద పిల్లాడి చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తూ గోరుముద్ద ద్వారా రోజుకో మెనూ అమలు చేస్తున్నాం. పిల్లలు చిక్కటి చిరునవ్వుతో ఉండాలని విద్యాకానుక కిట్లను ఇస్తున్నాం. బైజూస్ కంటెట్ తీసుకొచ్చాం. సీబీఎస్ఈ సిలబస్, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, టోఫెల్ శిక్షణను సర్కారు స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చాం. గతంలో పేదవాడి గురించి ఏమాత్రం ఆలోచించిన పరిస్థితి లేదు. అహంకార ధోరణి, పెత్తందారీతనంతో అవమానించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా..! ఖబడ్దార్ అని చంద్రబాబు హెచ్చరించలేదా? చివరకు అక్కచెల్లెమ్మలను సైతం అవహేళన చేసేలా కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజధాని నగరం అని పేరు పెట్టుకున్న చోట పేదవాడికి ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందంటూ నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి ఆయన నైజాన్ని చాటుకున్నారు. జనవరిలో వైఎస్సార్ ఆసరా.. చేయూత ► నా అక్కచెల్లెమ్మల ముఖంలో సంతోషం చూడాలని నాలుగేళ్లలో వైఎస్సార్ ఆసరా ద్వారా 78,94,194 మందికి రూ.19,178 కోట్లు అందించాం. వచ్చే జనవరిలో మరో రూ.6,500 కోట్లు ఆసరా ద్వారా ఇవ్వనున్నాం. ► పొదుపు సంఘాలు తమ కాళ్లపై నిలబడాలని సున్నా వడ్డీ కింద రూ.4,960 కోట్లు ఇచ్చాం. ► వైఎస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్లు ఉన్న 26,39,703 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్థాన్ లీవర్ లాంటి సంస్థలతో వ్యాపార అవకాశాలను కల్పిస్తూ నేరుగా రూ.14,189 కోట్లు అందించాం. చేయూతకు జనవరిలో మరో రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నాం. ► వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,57,844 మందికి రూ.2,028 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లోని 4.40 లక్షల మంది పేదలకు రూ.1,257 కోట్లు సాయం అందచేశాం. ► మత్స్యకార భరోసా ద్వారా 2,43,394 మందికి రూ.538 కోట్లు ఇవ్వగలిగాం. ► వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 82 వేల చేనేత కుటుంబాలకు రూ.982 కోట్లు అందించాం. ► వాహన మిత్ర ద్వారా 275,931 మంది డ్రైవరన్నలకు రూ.1,302 కోట్లు ఇచ్చాం. ► జగనన్న తోడు ద్వారా ఫుట్‌పాత్‌లు, తోపుడుబండ్లపై ఆధారపడే చిరువ్యాపారులకు పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున వడ్డీ లేని రుణాలతో 15,87,492 మందికి రూ.2,956 కోట్లు అందచేశాం. హంద్రీపై వంతెనకు రూ.47 కోట్లు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా పత్తికొండ–గోనెగండ్లను కలిపేలా హంద్రీ–నదిపై వంతెన నిర్మాణం కోసం రూ.47 కోట్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న చేదోడు నిధుల విడుదల సందర్భంగా ఎమ్మిగనూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నకేశవరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీలు మధుసూదన్, రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, పోతుల సునీత, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
మీ వల్లే ఇదంతా జగనన్నా.. లబ్ధిదారుడి భావోద్వేగం
సాక్షి, కర్నూలు జిల్లా: వరసగా నాలుగో ఏడాది ‘జగనన్న చేదోడు’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు స్వామి చంద్రుడు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే’’ అంటూ సీఎం జగన్‌ను కొనియాడారు. లబ్ధిదారుడి మాటల్లోనే.. అన్నా, నేను నాయీ బ్రాహ్మణ కులంలో పుట్టాను, మా కుమారుడు పుట్టుకతో చెవిటి, మూగవాడు, నేను ఈ పథకం ద్వారా మూడు సార్లు లబ్ధిపొందాను, మా కుమారుడితో కూడా షాప్ పెట్టించాను, మా అబ్బాయి కూడా ఈ పథకం పొందాడు. తనకు మాటలు రావు కాబట్టి తన ఆనందం కూడా మీతో పంచుకుంటున్నాను. గతంలో నాకు పాతకాలం కుర్చీలు, సామాన్లు ఉండేవి కానీ ఈ పథకం ద్వారా వచ్చిన లబ్ధితో మోడ్రన్ సెలూన్ ఏర్పాటు చేసుకున్నా. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే.. మమ్మల్ని గుళ్ళలో పాలకమండలి సభ్యులుగా నియమిస్తున్నారు. గతంలో మమ్మల్ని కులంతో దూషించేవారు కానీ ఇప్పుడు నాయీ బ్రాహ్మణులని పిలుస్తున్నారు. గతంలో మా తోకలు కత్తిరించాలని చంద్రబాబు అన్నారు. కానీ మీరు ప్రేమతో ఆదరించారు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మాకు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. నా ఇద్దరు పిల్లల్లో ఒకరిని బాగా చదివించి డాక్టర్‌ను చేయగలిగాను. మీ వల్లే ఇదంతా నా చిన్నకుమారుడికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ రూ. 8 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా చేయించారు. నాకు టిడ్కో ఇల్లు వచ్చింది, మేమే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు గౌరవం కల్పించారు, మీరు మా వెన్నంటి ఉండి మా కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, మేమంతా మీ వెంటే ఉంటాం. ధన్యవాదాలు. మనమంతా జగనన్న కుటుంబం: మంత్రి వేణు అందరికీ నమస్కారం, అన్నా రక్తాన్ని స్వేదంగా మార్చి, శ్రమ తప్ప సేద తీరాలన్న ఆలోచన లేని, కష్టం తప్ప కల్మషం లేని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్ళని చెప్పుకున్న నాయకుడు గతంలో లేరు, వీరంతా జగనన్న బంధువులు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా జగనన్న బంధువులే, వీరంతా గతంలో మోసపోయారు, మన జీవితాలు మారాలంటే కులవృత్తులకే పరిమితం కాదని.. విద్య మాత్రమే మార్గమని నాడు వైఎస్ఆర్ గారు ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ కోతలు పెట్టారు. నేడు సీఎంగారు ప్రతి బీసీ గర్వపడేలా, మిగిలినవారంతా బాగుపడేలా కులగణన చేయబోతున్నారు. ఇది మన జీవితాలను మార్చబోతుంది, మనమంతా జగనన్న కుటుంబం, కులవివక్షకు గురైన రజకలు, నాయీ బ్రహ్మణులుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. జగనన్నా... చేదోడు పథకం బీసీ కుటుంబాలలో దివ్వెను వెలిగిస్తుంది, ఇది అందరికీ భరోసా, భాగ్యం, భద్రత కల్పిస్తుంది. ధ్యాంక్యూ. చదవండి: విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు -
AP CM YS Jagan Photos: జగనన్న చేదోడు సాయం విడుదల చేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఇచ్చిన మాటను 52నెలల పాలనలో నిలబెట్టుకున్నాం: వైఎస్ జగన్
-
బటన్ నొక్కి జగనన్న చేదోడు సాయం విడుదల చేసిన సీఎం జగన్ !
-
52 నెలల పాలనలో ఆ మాట నిలబెట్టుకున్నాం: సీఎం జగన్
సాక్షి, కర్నూల్: వెనుకబడిన కులాలను, వెనుకబడిన వర్గాలను.. వెన్నెముక మాదిరిగా దృఢంగా మారుస్తామూ అని ఏదైతే మాట ఇచ్చామో పాదయాత్ర సందర్భంగా.. ఈ రోజు నేను మీ బిడ్డగా మీ అన్నగా.. మీ తమ్ముడిగా.. సగర్వంగా తలెత్తుకుని చెబుతా ఉన్నాను. ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతీ ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాను. వారి జీవిత ప్రయాణంలో తోడుగా ఉండగలిగామని సగర్వంగా, మీ బిడ్డగా చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాను.. జగనన్న చేదోడు నిధుల జమ కార్యక్రమం కోసం గురువారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన సభకు సీఎం జగన్ హాజరై ప్రసంగించారు. ‘‘వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నాం.. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నాం. ఈరోజు సొంత షాపులు ఉన్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. జగనన్న చేదోడు అనే కార్యక్రమం బటన్ నొక్కి నేరుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపడం జరుగుతుంది. వరుసగా నాలుగో ఏడాది అమలు చేస్తూ 3.25 లక్షల మందికి రూ.325 కోట్లు నేరుగా పంపించడం జరుగుతుంది. ఒక్క చేదోడు పథకం ద్వారా మాత్రమే రూ.1250 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో చేదోడు పథకం ద్వారా మాత్రమే లక్షల మందికి రూ.40 వేల దాకా వాళ్ల కుటుంబాలకు ఇవ్వగలిగాం. గతానికి ఇప్పటికి పోలికలు చూడమని చెబుతున్నా. 52 నెలల కాలంలో ప్రతి అడుగూ ఇదే విధంగా పడింది. అక్షరాలా రూ.2.38 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. మీ బిడ్డ హయాంలో, మనందరి ప్రభుత్వంలో మంచి చేయగలిగాం అంటే గతానికి ఇప్పటికి పోలిక చూడమని చెబుతున్నా. చేతి వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఇటువంటి వారు బతకలేని పరిస్థితిలోకి వస్తే ఈ వ్యవస్థ కుప్పకూలిపోదా?. ఇటువంటి వారి గురించి ఎవరైనా ఆలోచన చేశారా?. చేదోడు, వాహన మిత్ర, ఇలా స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా ఉంటున్నాం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడకుండా వారందరికీ సహాయం అందించే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి అడుగులోనూ నానానా అంటూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద వర్గాలు అంటూ ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి పేద ఇంట్లో నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటున్నాం. అక్కచెల్లెమ్మల పిల్లలకు సొంత మేనమామగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, తోడుగా నిలబడుతూ ఈ నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మల కోసం వైయస్సార్ ఆసరా ద్వారా చేయి పట్టుకొని నడిపిస్తూ తోడుగా ఉన్నాం. 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అందించిన సాయం రూ.19,178 కోట్లు. ఈ జనవరిలో మరో రూ.6,500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా కింద ఇవ్వనున్నాం. సున్నా వడ్డీ కింద ఆ ఒక్క పథకానికే ఇచ్చినది రూ.4,969 కోట్లు. 45-60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీకి చెందిన అక్కచెల్లెమ్మలు 26,39,703 మందిని ప్రోత్సహిస్తూ అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్ యూనిలీవర్ లాంటి సంస్థలను తీసుకురావడమే కాకుండా బ్యాంకులతో అనుసంధానం చేసి తోడుగా ఉన్నాం. చేయూత ద్వారా బటన్ నొక్కి మీ బిడ్డ పంపించిన సొమ్ము రూ.14129 కోట్లు. వచ్చే జనవరిలో వైయస్సార్ చేయూత కింద మరో రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నాం. కాపు నేస్తం కింద 3,57,844 మందికి తోడుగా నిలబడ్డాం. రూ.2,028 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం ద్వారా పేద అక్కచెల్లెమ్మలకు 4.40 లక్షల మందికి 1257 కోట్లు ఇవ్వగలిగాం. మత్స్యకార భరోసా ద్వారా 2,43,394 మందికి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ 538 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 82 వేల చేనేత కుటుంబాలకు ఇప్పటికే ఇచ్చిన సాయం రూ.982 కోట్లు. వాహన మిత్ర ద్వారా 2,75,931 మందికి 1302 కోట్లు బటన్ నొక్కి జమ చేశాం. జగనన్న తోడు ద్వారా 15,87,492 మంది చిరు వ్యాపారులకు రూ.2956 కోట్లు ఇవ్వగలిగాం. ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ ఇంతకు ముందు జరిగాయా? ఇవ్వగలిగారా? అని ఆలోచన చేయాలి. ఇలా నిజంగానే ఒక ప్రభుత్వం వస్తుంది, ఎక్కడా లంచాలు లేవు, అర్హత ఉంటే చాలు నా ఖాతాలోకి డబ్బు వస్తుందని ఎవరైనా అనుకున్నారా?. ఇవన్నీ 52 నెలల పరిపాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. -
Jagananna Chedodu Public Meeting: ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు సభలో జన ప్రవాహం (ఫొటోలు)
-
Live: ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
జగనన్న చేదోడు సాయం విడుదల చేసిన సీఎం జగన్
Updates.. ►ఎమ్మిగనూరులో బటన్ నొక్కి జగనన్న చేదోడు సాయం అందజేసిన సీఎం జగన్ ►సీఎం జగన్ మాట్లాడుతూ.. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా చూడండి. ఇచ్చిన మాటను 52 నెలల పాలనలో నిలబెట్టుకున్నాం. వెనుకబడిన వర్గాల జీవన ప్రయాణంలో తోడుగా ఉన్నాం. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నాం. ►ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు వచ్చి చేరుతున్నాయి. ప్రతీ అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19178 కోట్లు అందజేస్తున్నాం. నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం. ►అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసింది. అప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలి. అప్పుడు ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు స్థలం ఇవ్వలేదు. కానీ, మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం కొన్ని వేల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. ►చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకొచ్చి ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో పడేశారు. కానీ, మన ప్రభుత్వం మేనిఫెస్టో 99 శాతం హామీలను అమలు చేశాం. చంద్రబాబు రుణమాఫీ కూడా చేయలేదు. బాబు హయాంలో పొదుపు సంఘాలు విలవిల్లాడాయి. ►అమరావతి రాజధాని భూములతో మొదలుపెడితే.. స్కిల్ స్కాం వరకు అన్నీ కుంభకోణాలే, అవినీతే. చంద్రబాబు ద్వారా నష్టపోయిన పొదుపు సంఘాలకు మీ బిడ్డ అనేక పథకాలతో తోడుగా ఉన్నాడు. పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే 31లక్షల ఇంటి స్థలాలు అందించాం. ►గతంలో ఏ పౌర సేవ కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటి వద్దకే పౌరసేవలు అందుతున్నాయి. అప్పుట్లో ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశారు. మీ బిడ్డ పాలనలో 18 మెడికల్ కాలేజీలు నిర్మాణం అవుతున్నాయి. మీ బిడ్డ పాలనలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. చికిత్స తర్వాత రోగికి సాయం అందిస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. ►మీ బిడ్డకు అర డజన్ టీవీ ఛానెళ్ల సపోర్టు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి టీవీలు లేవు. మీ బిడ్డ నమ్ముకుంది కేవలం పైనే దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు.. రేపు జరగబోయే యుద్ధంలో తేడేళందరూ ఏకమవుతారు. వీళ్లు చెప్పిన అబద్దాలు నమ్మకండి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా ఆలోచించండి. ►మంత్రి చెల్లబోయిన గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అన్ని వర్గాలను నా వాళ్లు అని చెప్పుకున్న వ్యక్తి సీఎం జగన్. మన జీవితాలను మార్చిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. మనందరి ఆకాంక్షలు తీర్చిన వ్యక్తి జగనన్న. గత పాలకులు బీసీలకు మోసం చేశారు. బలహీన వర్గాలను వెనక్కి నెట్టిన వారికి జగన్ అంటే భయం. ►ఎమ్మిగనూరు చేరుకున్న సీఎం జగన్ ►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►గన్నవరం నుంచి కర్నూలు జిల్లా బయల్దేరిన సీఎం జగన్ ►ఎమ్మిగనూరు బయలుదేరిన సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు సీఎం జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. ►కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదీ పథకం ♦ షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం ♦ గురువారం అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం. ♦ నాలుగేళ్లలో ఈ పథకం లబ్దిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు ♦ 1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి ♦ 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి ♦ 1,04,551 మంది రజకులకు ఈ విడతలో రూ. 104.55 కోట్ల లబ్ధి ♦ లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక. ♦ అర్హతలున్న ప్రతి ఒక్కరికీ సాయం అందించేందుకు జగనన్న ప్రభుత్వం తపన... ♦ అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందకపోతే... వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్ నెలల్లో సాయం అందజేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. -
నేడు ‘జగనన్న చేదోడు’ సాయం
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. దానిని మనసా, వాచా, కర్మణా ఆచరిస్తున్నారు కూడా. రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలన్న సంకల్పంతో జగనన్న చేదోడు పథకాన్ని చేపట్టారు. ఈ పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదీ పథకం ♦ షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం ♦ బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం. ♦ గురువారం అందిస్తున్న సాయంతో కలిపి ఈ 4 ఏళ్ళలో కేవలం ఈ పథకం లబ్దిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు ♦ 1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి ♦ 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి ♦ 1,04,551 మంది రజకులకు ఈ విడతలో రూ. 104.55 కోట్ల లబ్ధి ♦ లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక. ♦ ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందాలని తపన పడుతున్న జగనన్న ప్రభుత్వం... ♦ అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్ నెలల్లో సాయం అందజేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. -
దేశానికే ఆదర్శంగా ఏపీ
ఈరోజు మన రాష్ట్రం దేశంలోనే అత్యధిక జీడీపీ 11.43 శాతంతో మొదటి స్థానంలో ఉంది. గ్రోత్ రేటులో దేశానికే ఆదర్శంగా పరుగులు తీస్తోంది. జగన్ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ మీ బిడ్డ అంటే గిట్టని కొందరు అబద్ధాలు చెబుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ల హయాంలో ఎన్నడూ జరగని విధంగా మీ బిడ్డ హయాంలో రాష్ట్రం పరుగెడుతోందంటే కారణం?.. ప్రతి రంగాన్ని చేయి పట్టుకుని నడిపించగలిగితే పరుగులు పెడతాయి. మంచి గ్రోత్ రేట్ నమోదు అవుతుంది. ప్రతి కుటుంబం బాగుపడుతుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ 11.43 శాతం జీడీపీ గ్రోత్‌రేట్ నమోదు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, వృద్ధి రేటు విషయంలో ఆదర్శంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకువెళ్తుండటంతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం ద్వారా 3,30,145 మంది లబ్ధిదారులకు రూ.330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ.. వెన్నెముక వర్గాలు.. వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నెముక కులాలుగా మారుస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ మూడున్నరేళ్లుగా నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబానికి మేలు చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సొంత షాపులున్న రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేలా జగనన్న చేదోడు పథకాన్ని తెచ్చాం. జగనన్న చేదోడు ద్వారా ఈరోజు ప్రయోజనం పొందుతున్న వారిలో నాయీ బ్రాహ్మణులు 47,533, రజకులు 1,14,661, దర్జీలు 1,67,951 మంది కలిపి మొత్తం 3.30 లక్షల కుటుంబాల్లో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇవాళ ఇస్తున్న డబ్బులతో కలిపి ఇప్పటివరకు మూడున్నరేళ్లలో రూ.927 కోట్లకుపైగా పారదర్శకంగా అకౌంట్లలో జమ చేశాం. 43 నెలల వ్యవధిలో వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.1,92,938 కోట్లను అక్కచెల్లెమ్మలకు అందచేశాం. ఇక గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, విద్యాకానుక లాంటి నాన్ డీబీటీ పథకాలను కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపు రూ.3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. జగనన్న చేదోడు లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారంతా.. నావాళ్లు మీ జగన్ మొట్టమొదట చెప్పేమాట.. నా బీసీలు, నా ఎస్సీలు, ఎస్టీలు, నా మైనార్టీలు నావాళ్లు అని. ప్రతి రోజూ ప్రభుత్వం వీళ్ల మంచి కోసమే ఉంది. రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చదువుకుంటున్న పిల్లలు.. ఇలా ఎవరిని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా ప్రతి గడపకూ ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం మేలు చేస్తోంది. నమ్మకం ఉంది కాబట్టే.. రాష్ట్రంలో 62 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే 50 శాతం మంది రైతులకు కేవలం 1.25 ఎకరాలు మాత్రమే ఉంది. ఒక హెక్టార్ లోపున్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. దాదాపు కోటిమందికి పైగా ఉన్న వీరంతా క్రమం తప్పకుండా ఏటా జగనన్న దగ్గర నుంచి పెట్టుబడి సాయం కింద వైఎస్సార్ రైతు భరోసా వస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టే ముందుకు అడుగులు వేయగలుగుతున్నారు. ప్రతి గ్రామంలో ఆర్బీకేలను తీసుకొచ్చి ప్రతి పంటనూ, ప్రతి ఎకరాన్ని ఈ–క్రాపింగ్ చేసి రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. వరదలు లాంటి ఏ కష్టం వచ్చినా ఆ సీజన్న్ ముగియక ముందే ఇన్పుట్ సబ్సిడీ వస్తోంది. ఉచితంగా బీమా చేయించి ప్రతి రైతన్నకు మంచి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం మోసాలు గత సర్కారు కోటిమందికి పైగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రుణమాఫీ పేరుతో మోసగించడంతో బకాయిలు కట్టలేక డిఫాల్టర్లుగా మారి ‘డి’ గ్రేడ్‌కు పడిపోయాయి. ఆ కోటి మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ మీ అన్న ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ అందిస్తూ అడుగులు ముందుకు వేసింది. గతంలో 18 శాతం ఎన్పీఏ, అవుట్ స్టాండింగ్‌గా ఉన్న గ్రూపులు ఇవాళ 0.5 శాతం లోపే ఉన్నాయంటే ఏ స్థాయిలో నిలదొక్కుకున్నాయో ఆలోచన చేయండి. గతంలో సి, డి గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ ఇవాళ ఏ, బీ గ్రేడ్‌లోకి వచ్చాయి. లబ్ధిదారులకు జగనన్న చేదోడు చెక్కును అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ స్వయం ఉపాధికి చేయూత.. రాష్ట్రంలో ఎవరిపైనా ఆధారపడకుండా తమ కష్టంతో బతుకున్న కుటుంబాలు దాదాపు 55 లక్షల పైచిలుకు ఉన్నాయి. వీరికి ఉద్యోగాలు ఉండవు. కిరాణా షాపులు, రోడ్డు పక్కన వ్యాపారాలు, తోపుడు బండ్ల మీద దోశెలు వేస్తూ, కూరగాయలు విక్రయిస్తూ కనిపించే వీరంతా స్వయం శక్తితో బతుకు పోరాటంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలాంటి 27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు చేయూతనిచ్చి ప్రభుత్వం నడిపిస్తోంది కాబట్టే రాష్ట్రం ఇవాళ పరుగులు పెడుతోంది. అమూల్, ఐటీసీ, రిలయన్స్, పీ అండ్ జీ, హిందుస్తాన్ లీవర్ లాంటి సంస్థలతో ఒప్పందాల ద్వారా అక్కచెల్లెమ్మలు వ్యాపారాల్లో రాణించేలా అడుగులు ముందుకు వేయించాం. బ్యాంకుల ద్వారా తోడ్పాటు అందించగలిగాం కాబట్టే ఇవాళ రాష్ట్రం పరుగెడుతోంది. గజదొంగల ముఠా... గత ప్రభుత్వం.. ఆ ముసలాయన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోండి. ఆ ప్రభుత్వంలో ఒక గజదొంగల ముఠా ఉండేది. దానికి దుష్టచతుష్టయం అని పేరు. ఆ ముఠాలో ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. ఇదీ గజదొంగల ముఠా. వీళ్ల స్కీం అప్పట్లో ఒకటే.. డీపీటీ! దోచుకో, పంచుకో, తినుకో అదే వీళ్ల స్కీం. గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసింది. వీటిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయవు. టీవీ 5 మాట్లాడదు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఇలాంటి వారి పరిపాలన కావాలా? లేక లంచాలు, వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కే మీ బిడ్డ పరిపాలన కావాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు ముసలాయన మాదిరిగా ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చు. దత్తపుత్రుడు నాకోసం మైక్ పట్టుకోకపోవచ్చు. నేను వీళ్లను నమ్ముకోలేదు. వినుకొండకు వరాలు.. ‘ఈ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో 20 గ్రామాలకు తాగునీటి కోసం సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా రూ.12 కోట్లు మంజూరు చేయాలని, 50 పడకల సీహెచ్‌సీని రూ.15 కోట్లతో వంద పడకలుగా మార్చాలని వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కోరారు. వాటిని మంజూరు చేస్తున్నాం వెంటనే పనులు ప్రారంభిస్తాం. వినుకొండలో రూ.10 కోట్లతో ముస్లిం మైనార్టీ కాలేజీ మంజూరు చేస్తున్నాం’ అని సీఎం జగన్ ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. పాలనలో ఇదీ తేడా గతంలో కూడా పాలకులను చూశాం. ముఖ్యమంత్రి స్థానంలో ఒక ముసలాయన్ను చూశాం. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. గతం కన్నా మీ బిడ్డ చేస్తున్న అప్పులు కూడా తక్కువే. అయితే గతంలో ఎందుకు బటన్లు లేవు? రూ.1.92 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎందుకు రాలేదు? ఆలోచన చేయండి.. గతంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు ? మీ బిడ్డ పాలనలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయండి? మీ బిడ్డ పరిపాలనలో బటన్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్ నేను నా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద, పేద వర్గాలనే నమ్ముకున్నా. ఈరోజు రాష్ట్రంలో జరిగేది క్యాస్ట్ వార్ కాదు (కులాల మధ్య యుద్ధం కాదు).. క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందార్లు మరోవైపున ఈ యుద్ధం జరుగుతోంది. మాటపై నిలబడే మీబిడ్డ ఒకవైపు ఉంటే.. వెన్నుపోట్లు, మోసాలు మరోవైపున యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నమ్మకం అంతా కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలపైనే. సింహంలా మీ బిడ్డ ఒక్కడే.. మీ బిడ్డకు పొత్తుల్లేవు.. వాళ్లమీదా వీళ్లమీదా ఆధారపడడు. మీ బిడ్డ ఒక్కడే సింహంలా నడుస్తాడు. తోడేళ్లంతా గుంపుగా ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. మిమ్మల్ని, ఆ దేవుడ్ని నమ్ముకున్నాడు కాబట్టి భయం లేదు. మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, మన స్కూళ్లు బాగుపడాలని, మన పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో గొప్ప చదువులు చదవాలని, ఆసుపత్రుల రూపురేఖలు మారాలని, వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆ దేవుడ్ని కోరుతున్నా. ఆదుకున్నాం కాబట్టే పరుగులు.. రోడ్డు పక్కన తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే 15 లక్షల మందిని జగగన్న తోడు ద్వారా రూ.10 వేలు వడ్డీలేని బ్యాంకు రుణాలను అందించి ఆదుకున్నాం కాబట్టే రాష్ట్రం ఇవాళ వేగంగా పరుగెడుతోంది. మత్స్యకార భరోసా ద్వారా 1.20 లక్షల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. నేతన్న నేస్తం ద్వారా దాదాపు 82 వేల కుటుంబాలకు తోడుగా నిలిచాం. వాహనమిత్ర ద్వారా సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుకునే 2.75 లక్షల కుటుంబాలను భుజం తట్టి నిలబెట్టాం. కాపునేస్తం ద్వారా 3.56 లక్షల కుటుంబాలు, చేదోడు ద్వారా 3.30 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. ఈబీసీ నేస్తం ద్వారా మరో 4 లక్షల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. ప్రభుత్వ తోడ్పాటుతో కోవిడ్‌లాంటి మహమ్మారిని సైతం ఎదిరించి నిలదొక్కుకోగలిగారు కాబట్టే ఈరోజు రాష్ట్రం 11.43 శాతం వృద్ధి రేటుతో అడుగులు ముందుకు వేస్తోంది. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. ఏకంగా 30 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా వారి పేరుతోనే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి 20 లక్షల ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నాం. సిమెంట్, స్టీల్ వినియోగం, కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధితో ఆర్థిక ప్రగతికి ఊతమిస్తూ రాష్ట్రం 11.43 శాతం గ్రోత్ రేట్‌తో వేగంగా దూసుకెళ్తుంటే గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. గర్భంలో ఉన్న శిశువుకూ సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కుటుంబం 11 లక్షల ఆర్ధిక సాయాన్ని పొందింది. మొదటి విడత జగనన్న చేదోడు సాయంతో మిషన్, మెటీరియల్ కొనుక్కున్నా. రెండో విడత డబ్బులతో జిగ్‌జాగ్ మిషన్ కొనుక్కుని ఆర్థిక పరిస్ధితి మెరుగు పరుచుకున్నా. నా కుమారుడికి అమ్మ ఒడి వస్తోంది. నేను గర్భవతిని కావడంతో పౌష్టికాహారం అందచేస్తున్నారు. గర్భంలో ఉన్న శిశువుకు కూడా మీ పథకాలను అందిస్తున్నారు. ఇంటి స్థలం కూడా వచ్చింది. మా అత్తయ్యకు చేయూత పథకం డబ్బులు రావడంతో కిరాణాషాప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల నుంచి మా మామయ్యకు రూ.2,750 పింఛన్ వస్తోంది. మామయ్యకు గుండెనొప్పి రావడంతో గుంటూరులోని కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2.50 లక్షలకు పైగా విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు. అంతేకాకుండా కోలుకునేవరకు రెండు నెలల పాటు రూ.ఐదు వేల చొప్పున మొత్తం రూ.పది వేలు ఆయన ఖాతాలో జమ చేశారు. మీకు రుణపడి ఉంటాం. – సాయికుమారి, వినుకొండ నలుగురికి జీవనోపాధి కల్పిస్తున్నా.. పన్నెండు ఏళ్లుగా కులవృత్తి (నాయీ బ్రాహ్మణ) చేసుకుంటున్నా. జగనన్న చేదోడు ద్వారా సాయం అందడంతో షాప్ డెవలప్ చేసుకున్నా. మరో నలుగురికి జీవనోపాధి కల్పిస్తున్నా. మా అమ్మకు పింఛన్ వస్తోంది. మేం కన్న బిడ్డలమే అయినా మా తల్లిదండ్రులను మీరే బాగా చూసుకుంటున్నారు. పెద్ద కుమారుడిలా, సొంత అన్నలా నిలిచారు. చేయూత పథకం ద్వారా కూడా లబ్ధి పొందాం. – సైదులు, కొచ్చర్ల, ఈపూరు మండలం నాయకుడంటే నమ్మకం.. గతంలో ప్రభుత్వం ఏదైనా లోన్ ఇస్తే లబ్ధిదారుడి కాంట్రిబ్యూషన్ పేరుతోరూ.3 వేలు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా ఖాతాల్లో జమ అవుతోంది. నాయీ బ్రాహ్మణులు వివక్షకు గురి కాకుండా ప్రత్యేక చట్టం తెచ్చారు. నాయకుడంటే గతంలో మోసం.. ఇప్పుడు నాయకుడంటే నమ్మకం. జగనన్న ఇచ్చిన భరోసా ఇదీ! – చెల్లుబోయిన శ్రీనివాసగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి -
వరుసగా మూడో ఏడాది.. ‘జగనన్న చేదోడు’ (ఫొటోలు)
-
చేదోడు ద్వారానే రాష్ట్రం పరిగెడుతోంది: సీఎం జగన్
సాక్షి, పల్నాడు: నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని ఇవాళ(సోమవారం) జిల్లాలోని వినుకొండలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ.. ‘‘వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో నవరత్నాలులోని ప్రతీ పథకాన్ని, సంక్షేమ పథకాల్లోని ప్రతీ పథకాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతీ వర్గాల కుటుంబాలకు మేలు చేసేలా మన అందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో భాగంగా.. సొంత షాప్ ఉన్న రజక సోదరుడికి, నాయీబ్రాహ్మణుడికి, దర్జీ అక్కాచెల్లెలకు ఏటా పది వేల రూపాయల ఆర్థిక సాయం చేసేలా జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చాం. లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. వివక్ష లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నాం. వరుసగా ఈ మూడేళ్లలో అక్షరాల మూడు లక్షల ముప్పై వేల మందికి మంచి చేస్తూ.. నేడు రూ. 330 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మొత్తంగా.. జగనన్న చేదోడు కార్యక్రమంతో రూ. 927 కోట్లు జమ చేసినట్లు అవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోంది. మొత్తం 43 నెలల కాలంలోనే నేరుగా 1.92 లక్షల కోట్లు అందించామని, టీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్లు అందించామని సీఎం జగన్ వినుకొండ వేదిక నుంచి ప్రకటించారు. ఇవాళ మన రాష్ట్రం దేశంలోనే జీడీపీ జీఎస్డీపీ(గ్రాస్ స్టేట్ డెమోస్టిక్ ప్రొడక్ట్) ప్రకారం.. మన గ్రోత్ రేట్ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గర్వం చెప్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా పరిగెడుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితిని పట్టించుకోకుండా.. గిట్టనివాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదంతా గమనించాలని ఏపీ ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. ప్రతీ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నప్పుడే ఇలాంటి ఘనత సాధ్యమవుతుందన్నారు. రైతులు, అక్కాచెల్లెమ్మలు.. ఇలా అందరికీ సంక్షేమ పథకాల ద్వారా సాయం, చేయూత ఇస్తున్నామని.. తద్వారా వాళ్లు వాళ్ల కాళ్ల మీద నిలబడుతూ రాష్ట్రాన్ని ముందుకు పరిగెట్టిస్తున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
వినుకొండ: జగనన్న చేదోడు.. సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్
Jagananna Chedodu.. అప్డేట్స్ ► జగనన్న చేదోడు పథకం.. మూడో విడత నిధుల జమ కార్యక్రమం ముగియడంతో వినుకొండ నుంచి తిరిగి తాడేపల్లికి బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. ► బహిరంగ సభలో ప్రసంగం అనంతరం.. జగనన్న చేదోడు మూడో విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్. సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్ నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోంది. వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో చేసి చూపించాం. లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. వివక్ష లేకుండా పారదర్శకంగా భరోసా అందిస్తున్నాం. దేశంలోనే జీడీపీ జీఎస్డీపీ(గ్రాస్ స్టేట్ డెమోస్టిక్ ప్రొడక్ట్) ప్రకారం.. ఏపీ గ్రోత్ రేట్ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించినప్పుడే.. ఇలాంటి ఫలితం సాధ్యమవుతుంది. ఏపీ శ్రీలంక అయిపోతోందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, ఏపీ దేశానికే ఓ దిక్సూచిలా నిలుస్తోంది. సీఎంగా ఓ ముసలాయాన(చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఏనాడూ సంక్షేమం గురించి ఆలోచించలేదు. దోచుకోవడం గురించే ఆలోచించింది. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు. దోపిడీ పాలన కావాలా? లంచం, అవినీతి లేని పాలన కావాలా? జాగ్రత్తగా ఆలోచించుకుని ఎంచుకోండి. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయని.. ► జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ► అన్నా.. మా నాయీ బ్రాహ్మణుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను గత పది, పన్నెండు ఏళ్ళుగా నా కులవృత్తి చేసుకుంటున్నాను, నా షాప్ డెవలప్ చేయడం ఎలాగా అనుకునేవాడిని, నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ మా ఇంటికి వచ్చి చెబితే నేను నమ్మలేదు, కానీ మాకు అకౌంట్లో నేరుగా జమ అయ్యాయి. ఏ లంచం లేకుండా నా అకౌంట్లో డబ్బు పడింది. షాప్ డెవలప్ చేసుకున్నాను, ఇప్పటికి రెండు సార్లు సాయం అందింది, ఇది మూడోసారి నాకు అందుతుంది, మా అమ్మకు ఫించన్ వస్తుంది, తెల్లవారగానే వాలంటీర్ మా ఇంటికి వచ్చి రూ. 2,750 ఇస్తుంటే మా అమ్మ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో చాలా అవస్ధలు పడ్డారు, ఇప్పుడు మా ఇంటికే ఫించన్ వస్తుంటే మా అమ్మ సంతోషంగా ఉంది, మా అమ్మ ఒక మాట చెప్పింది, ఇక నుంచి మీరు నన్ను చూసుకోకపోయినా నా పెద్ద కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, మేం కన్న బిడ్డలమే కానీ మాకంటే మీరే మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. మీరు మా ఇంటిలో పెద్దకొడుకులాగా, మా సొంత అన్నలా ఉంటున్నారు. చేయూత పథకం ద్వారా కూడా లబ్ధిపొందాం, మేం లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందులు పడితే చేయూత పథకం ద్వారా ఆదుకున్నారు. మాకు చాలా సాయం చేశారు, ధ్యాంక్యూ అన్నా. :::సైదులు, లబ్ధిదారుడు, కొచ్చర్ల, ఈపూరు మండలం ► సాయి కుమారి వినుకొండలో టైలరింగ్ వృత్తిలో ఉంది. జగనన్న చేదోడు లబ్ధిదారు ఈమె. గత రెండు దఫాలు అందిన ప్రభుత్వ సాయంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు అయినట్లు వేదికపై మాట్లాడిందామె. ఇప్పుడు మూడో విడత సాయంపై సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తనతో పాటు తమ కుటుంబ సభ్యులు జగనన్న ప్రభుత్వంలోలని సంక్షేమ పథకాలతో ఎలా ముందకు వెళ్తోందన్నది వివరించారామె. తనలాంటి వాళ్లెందరికో ఆర్థికంగా ఎదగడానికి సాయం అందిస్తున్న సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ► జై జగన్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం. జగనన్న చేదోడు సాయం.. లబ్ధిదారుల పరిస్థితి ఆర్థికంగా మెరుగుపడడంపై మంత్రి వేణుగోపాల్ ప్రసంగించారు. జగనన్న చేదోడు పథకం దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఓ వరం. వాళ్లకు సీఎం జగన్ ఇచ్చిన భరోసా. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వేణుగోపాల్ తెలియజేశారు. 11.42AM ► వినుకొండలో జగనన్న చేదోడు కార్యక్రమం ప్రారంభం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు. 11.35AM ► వేదికపై ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం.. జ్యోతి ప్రజ్వలనతో జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం నిధుల జమ కార్యక్రమం ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. 11.25AM ► వినుకొండలో జగనన్న చేదోడు పథకం మూడో విడుత నిధుల కార్యక్రమం సందర్భంగా.. వినుకొండ సభా స్థలికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి నేతలు, అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు. 11:20AM ► జగనన్న చేదోడు కార్యక్రమ సభాస్థలికి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. 11.10AM బస్సులో జగనన్న చేదోడు కార్యక్రమ సభాస్థలికి బయల్దేరిన సీఎం జగన్. రోడ్లకిరువైపులా స్వాగతం పలుకుతున్న ప్రజలు. ప్రతిగా అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్. 11:00AM ► వినుకొండ చేరుకున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీలు స్వాగతం పలికారు. స్వాగతలం పలికిన వాళ్లలో.. ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, కిలారు రోశయ్య, నంబూరి శంకర్ రావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, కలెక్టర్ శివ శంకర్, పలు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాసేపట్లో జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. 10:22 AM ► వినుకొండ బయలుదేరిన సీఎం జగన్ ► జగనన్న చేదోడు పథకంలో భాగంగా.. మూడో విడత సాయం నిధుల విడుదల కార్యక్రమం కోసం వినుకొండలో నేడు(సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ► జగనన్న చేదోడు పథకం కింద.. దర్జీలు, రజకులు, నాయీబ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330. 15 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే.. ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేసింది జగన్ ప్రభుత్వం. ► సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పర్యటనకు భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు.. బారికేడింగ్స్ లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారాయన. అలాగే.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నామని, వినుకొండ పట్టణంలో వ్యాపార కలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ► లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందించాలని తపన పడుతూ.. అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిని అందజేస్తోంది. -
Jagananna Chedodu: వరుసగా మూడో ఏడాది.. జగనన్న చేదోడు
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కానుక అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో నేడు బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వినుకొండ చేరుకుంటారు. వెల్లటూరు రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరం వారితో, స్థానిక నేతలతో కొద్ది సేపు మాట్లాడి, తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగనన్న చేదోడు పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.30,000 అందించినట్లవుతుంది. ఈ లెక్కన ఈ మూడేళ్లలో ఈ పథకం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.927.39 కోట్లు. లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మిస్ కాకుండా అందించాలని తపన పడుతూ.. అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిని అందజేస్తోంది. -
నాడు అసాధ్యమన్నారు.. నేడు సాధ్యమైందిగా!
అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్. తేడా.. ముఖ్యమంత్రి మార్పు మాత్రమే. గతంలో చేసిన అప్పులతో పోల్చితే.. సీఏజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) ఇప్పుడు తక్కువ. గతంలో 19 శాతం సీఏజీఆర్ ఉంటే ఇప్పుడు 15% మాత్రమే ఉంది. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఈ ప్రభుత్వం ఎలా చేయగలుగుతోంది? ఇప్పుడు పథకాలు ఎందుకు అందుతున్నాయంటే.. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు, అవినీతి లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. – సీఎం జగన్ 80% అక్క చెల్లెమ్మలే జగనన్న తోడు లబ్ధిదారుల్లో 80 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది ఒక విప్లవం కాగా ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలే 80 శాతం మంది ఉండటం మహిళా సాధికారిత, సామాజిక న్యాయానికి నిదర్శనం. గత పాలకులది పెత్తందారీ పరిపాలన, పెత్తందారీ మనస్తత్వం. వారు బాగుంటే చాలనుకున్నారు. ఆ పెత్తందార్లకు మద్దతు పలికే దుష్ట చతుష్టయం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వారికి మద్దతు పలికే దత్తపుత్రుడికి మంచి జరిగితే చాలనుకుంటారు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులకు తోడుగా నిలవాలన్న ఆలోచనను గత ప్రభుత్వం ఏ రోజూ చేయలేదని, గత పాలకులది పెత్తందారీ మనస్తత్వమని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. దుష్ట చతుష్టయానికి మంచి జరిగితే చాలనేది వారి విధానమన్నారు. గత సర్కారుది దోచుకో.. పంచుకో.. తిను (డీపీటీ) విధానమైతే ఇప్పుడు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్షంగా నగదు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వానికి, ఇప్పటికీ తేడా గమనించాలని కోరారు. ‘అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్.. కానీ ఈ పథకాలు గత ప్రభుత్వంలో ఎందుకు లేవు? గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మారారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులు స్వయం ఉపాధితో జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తిదారులకు ఏటా రూ.పది వేల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందించే జగనన్న తోడు పథకం ద్వారా కొత్తగా 3.95 లక్షల మంది లబ్ధిదారులకు రూ.395 కోట్ల రుణాలను సీఎం మంజూరు చేశారు. ఆర్నెల్ల కు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులకు మరో రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాలకు జమ చేశారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలిలా ఉన్నాయి. ఖాతాల్లోకి నగదు జమ చేసిన తరువాత లబ్ధిదారులను అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్ వ్యాపారం కాదు.. గొప్ప సేవ దేవుడి దయతో ఇప్పటివరకు 15,03,558 కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.2,011 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించి మంచి చేస్తున్నాం. ఈరోజు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.395 కోట్ల మేర వడ్డీ లేని బ్యాంకు రుణాలతో తోడ్పాటు కల్పిస్తున్నాం. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారి కాళ్లమీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నాం. వీరంతా తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరికొంత మందికి పని కల్పిస్తున్నారు. నామమాత్రపు లాభాలనే సంతోషంగా తీసుకుంటూ సమాజానికి సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి ఈ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు చేసేది వ్యాపారం అనేకంటే గొప్ప సేవ అనేందుకు ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. నడ్డి విరిచే వడ్డీలు.. బ్యాంకుల నుంచి రుణాలు రాక, వడ్డీ వ్యాపారులకు అధిక వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక చిరువ్యాపారులతో పాటు సంప్రదాయ చేతివృత్తిదారులు పడుతున్న బాధలు నా పాదయాత్రలో కళ్లారా చూశా. చాలా సందర్భాల్లో రూ.వెయ్యికి రూ.100 చొప్పున రోజువారీ వడ్డీలు కట్టాల్సిన దుస్థితి. ఉదయాన్నే వడ్డీకి తీసుకున్న డబ్బులతో కొనుగోలు చేసిన సరుకులను విక్రయించి సాయంత్రానికి వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి. రూ.100కు రూ.పది చొప్పున నడ్డి విరిచే ఈ వడ్డీల బారి నుంచి తప్పించి లక్షల కుటుంబాలకు అండగా ఉంటేనే వారి జీవితాలు బాగుపడతాయని పాదయాత్ర సందర్భంగా నేను చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఆ మాటకు కట్టుబడి జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచింది. దేశంలోనే అత్యధికంగా.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు 34 లక్షల మందికి ఇలా తోడ్పాటు ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటే ఒక్క మన ఏపీలోనే అందులో సగభాగం అంటే 15.03 లక్షల మందికిపైగా బ్యాంకుల సహకారంతో మంచి చేయగలిగాం. ఇందుకు సహకరించిన ప్రతి బ్యాంకుకు, తోడ్పాటునిచ్చిన ప్రతి అధికారికీ కృతజ్ఞతలు. రుణ మొత్తం ప్రతి విడతకు రూ.వెయ్యి పెంచేలా.. ఈ 15.03 లక్షల మందికిపైగా లబ్ధిదారుల్లో సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు దాదాపు 5.08 లక్షల మంది. సకాలంలో రుణాలు కడితే వడ్డీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తిరిగి చెల్లించడమే కాకుండా బ్యాంకులు మళ్లీ రుణాలు మంజూరు చేస్తాయి. సకాలంలో బ్యాంకులకు చెల్లించిన వారికి వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆర్నెల్ల్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుంది. రుణం తీరిన లబ్ధిదారులు మళ్లీ వడ్డీలేని రుణాలు పొందేందుకు అర్హులు. ఇలా రుణం పొందేటప్పుడు రుణం మొత్తాన్ని ప్రతి విడతకూ రూ.వెయ్యి చొప్పున పెంచేలా బ్యాంకులతో చర్చిస్తున్నాం. దీనివల్ల చిరు వ్యాపారులకు క్రెడిట్ రేటింగ్ పది శాతం పెరుగుతుంది. ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.48.48 కోట్లు ఇప్పటివరకు సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మంది లబ్ధిదారులకు మన ప్రభుత్వం పూర్తిగా వడ్డీ భారాన్ని మోస్తూ తిరిగి చెల్లించిన మొత్తం రూ.48.48 కోట్లు. ఇందులో భాగంగా గత ఆర్నెల్ల్లకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీని ఇప్పుడు బటన్ నొక్కి రీయింబర్స్ చేస్తున్నాం. నాడు.. రూపాయైనా విదల్చలేదు ఫుట్‌పాత్‌లు, తోపుడుబండ్లు, రోడ్ల పక్కన, మోటార్ సైకిల్, సైకిళ్ల మీద వీధి వీధీ తిరిగి వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్, కూరగాయలు, పళ్లు లాంటి వాటిని విక్రయిస్తూ లక్షల మంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరిని బాగు పర్చాలన్న ఆలోచన గత పాలకులకు రాలేదు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ఇబ్బంది పడుతున్నారనే సంగతి తెలిసి కూడా సాయం చేయలేదు. మనసు లేని పాలకులు... నిరుపేదలైన చిరువ్యాపారులే కాకుండా సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, లేస్ వర్క్స్ చేసేవారు, ఇతర సామగ్రి తయారు చేసేవారు, కుమ్మరి, కమ్మరి తదితర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తిదారులు.. వీరందరికీ వడ్డీ లేని రుణాలిచ్చే ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంగత ప్రభుత్వ హయాంలో జరగలేదు. గత ప్రభుత్వ పాలకులకు మనసు అనేది లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు. నాడు డీపీటీ.. నేడు డీబీటీ దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతిలో గత సర్కారు హయాంలో డీపీటీ స్కీం అమలు చేశారు. ఈ రోజు మన ప్రభుత్వంలో నేరుగా బటన్ నొక్కుతున్నాం. లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీతో లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తున్నాం. ఈ రకంగా దాదాపు రూ.1.65 లక్షల కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. ప్రతి కుటుంబానికి 3 –4 పథకాలు ఈ రోజు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందుతున్న 15.03 లక్షల మందిలో చాలామందికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఇళ్లపట్టాలు, ఇళ్లు.. ఇలా ప్రతి కుటుంబానికీ కనీసం 3 – 4 పథకాలు అందుతున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేదు. అన్న ఉన్నారనే ధైర్యం.. పాదయాత్రలో చిరు వ్యాపారులు తమ ఇబ్బందులను మీ దృష్టికి తెచ్చినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అధిక వడ్డీలతో వడ్డీ వ్యాపారస్తులు జలగల్లా పీడించిన రోజులు పోయి మా అన్న ఉన్నారనే ధైర్యం చిరు వ్యాపారుల్లో కనిపిస్తోంది. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా వారి ఇళ్లకు వెళ్లినప్పుడు అది స్పష్టంగా తెలుస్తోంది. చిరువ్యాపారుల కుటుంబాలను ఆదుకుంటూ ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. మా అన్న, మా తమ్ముడు అండగా ఉన్నారన్న సంతోషం వారిలో కనిపిస్తోంది. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి చిరు వ్యాపారులకు తోడు సీఎంగా మీ ఆలోచనా విధానం, భావజాలం ఒక్కటే.. సమాజంలో ఏ వర్గం, ఏ వ్యక్తీ అభివృద్ధి, సంక్షేమానికి దూరం కాకూడదన్నదే మీ లక్ష్యం. అభివృద్ది, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలు, కాల్‌మనీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా జగనన్న తోడు చిరువ్యాపారులకు నిజమైన తోడుగా నిలిచింది. అవినీతికి ఆస్కారం లేకుండా రూ.1.65 లక్షల కోట్ల పైచిలుకు పేదలకు అందించారు. – ఆదిమూలపు సురేష్, మునిసిపల్ శాఖ మంత్రి మీరేంటన్నా.. తిరిగి డబ్బులిస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి డిగ్రీ చదువుతోంది. నా కుమార్తెను ఇంగ్లీషు మీడియంలో చదివించలేకపోయా. అప్పుడు మీరు సీఎంగా లేనందుకు బాధపడుతున్నా. అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లలో చేర్చాం. ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న నా కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చా. మీరేంటన్నా.. మాకు తిరిగి అమ్మఒడి పేరుతో డబ్బులిస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మహిళలకు గుర్తింపు, భరోసా లభించింది. దిశ యాప్ వల్ల ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రూ.లక్ష దాకా లబ్ధి పొందుతున్నా. టిడ్కో ఇల్లు కూడా వచ్చింది. నేను పండ్ల వ్యాపారం చేస్తున్నా. నా భర్త టైలర్. గతంలో పెట్టుబడి కోసం అప్పులు చేశాం. వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోయేది. జగనన్న తోడుతో రూ.10 వేలు లోను వచ్చింది. సకాలంలో తీర్చడంతో వడ్డీ భారం తగ్గింది. మీరే ఎప్పుడూ సీఎంగా ఉండాలి. – షేక్ షాజిదా, గుంటూరు జిల్లా మీలా ఎవరూ ఆలోచించలేదు.. ఇంటి దగ్గర కూరగాయల వ్యాపారం చేస్తా. వడ్డీ వ్యాపారుల దగ్గరికి రూ.10 వేల కోసం వెళితే రూ.1,000 మినహాయించుకుని రూ.9,000 ఇచ్చేవారు. రూ.10,000 కట్టకుంటే మళ్లీ వడ్డీలు వేసేవారు. జగనన్న తోడు పథకాన్ని వలంటీర్ ద్వారా తెలుసుకుని దరఖాస్తు చేయడంతో రుణం వచ్చింది, కూరగాయల కొట్టు పెట్టుకుని అమ్ముకుంటున్నా. రోజూ రూ.500– రూ.800 ఆదాయం వస్తోంది. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. నా కుమార్తెకు అమ్మఒడి, నాకు సున్నావడ్డీ వచ్చింది. మా మామయ్యకు రైతుభరోసా వచ్చింది. పంటల బీమా వచ్చింది. మీలా గతంలో ఎవరూ ఆలోచించలేదు. నా కుటుంబం రూ.82 వేల దాకా లబ్ధి పొందింది. – ఎం. మాధవి, పెద్దపాడు, కర్నూలు మళ్లీ మళ్లీ.. మీరే మాది చిన్న టిఫిన్ కొట్టు. కష్టపడినదంతా వడ్డీలకే సరిపోయేది. మాకు ఏమీ మిగిలేది కాదు. వలంటీర్ ద్వారా జగనన్న తోడు పథకం గురించి తెలుసుకుని రుణం తీసుకున్నా. రెండో విడత కూడా రుణం తీసుకుని వ్యాపారాన్ని పెంచుకున్నా. సున్నావడ్డీ, వైఎస్సార్ ఆసరా వచ్చింది. ఇంటి పట్టా కూడా ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ కూడా అందింది. మా ఆయన చనిపోవడంతో పెన్షన్ కూడా వస్తోంది. మళ్లీ మళ్లీ మీరే సీఎంగా రావాలి. – ఎం.లక్ష్మి రామతీర్ధం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా -
ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
చేదోడు సాక్షిగా
-
జగనన్న చేదోడు నగదు సాయం అందడంపై లబ్ధిదారులు హర్షం
-
‘చేతి’కి చేదోడు
సాక్షి, అమరావతి: స్వయం ఉపాధినే నమ్ముకున్న చేతివృత్తిదారులు సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా వివక్షకు గురవుతూ కష్ట జీవులైన వీరంతా పండుగ సమయాల్లో కూడా ఇతరులకు సహాయపడే పనుల్లోనే నిమగ్నమవుతున్నారని గుర్తు చేశారు. అయితే వారి శ్రమకు తగిన ఆదాయం లభించని పరిస్థితులు నెలకొన్నాయని, చేతివృత్తిదారులకు చేయూత అందించకుంటే మొత్తం వ్యవస్థలే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందన్నారు. బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అని చెప్పి చెడు చేసిన గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని కోరారు. మంచి మనసుతో పనిచేస్తున్న ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. జగనన్న చేదోడు పథకం కింద వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.285.35 కోట్ల ఆర్థ్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి మాట్లాడారు. ఈ పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. భారీ స్వయం ఉపాధి రంగం స్వయం ఉపాధి రంగంలో అతి ఎక్కువగా దాదాపు 2.85 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. చేతివృత్తిదారులకు మనమంతా తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. వీరికి మంచిచేసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు వారి అకౌంట్లలోకి బదిలీ చేస్తున్నాం. 98,439 మంది రజక సోదరులు, అక్కచెల్లెమ్మలకు రూ.98.44 కోట్లు ఇస్తున్నాం. 40,808 నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు రూ.40.81 కోట్లు సాయాన్ని నేరుగా అందజేస్తున్నాం. ఆ కష్టాలు స్వయంగా చూశా.. చేతివృత్తిదారుల శ్రమకు తగిన ఆదాయం దక్కని పరిస్థితులున్నాయి. నా పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని అధికారంలోకి రాగానే జగనన్న చేదోడు పథకాన్ని తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రెండున్నరేళ్లలో మొత్తం రూ.583.78 కోట్లు చేతివృత్తిదారులకు అందజేశాం. ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లిచ్చి కమీషన్లు కొట్టేశారు.. గత సర్కారు హయాంలో ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు లాంటివి ఏ కొద్దిమందికో ఇచ్చి అందులోనూ కమీషన్లు కొట్టేశారు. అవి కూడా నాసిరకం, ఉపయోగపడని సామాన్లే. ఎంతో మేలు చేసే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చిన పరిస్థితులను కూడా గత ప్రభుత్వంలో మనం చూశాం. బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అంటూ చెడు చేసిన గత ప్రభుత్వానికి, మంచి మనసుతో నిజమైన చేదోడు అందిస్తున్న మన ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉందో గమనించమని కోరుతున్నా. బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ బీసీలంటే పనిముట్లు కాదు.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్‌లు కాదు. వారు సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మి ఆచరిస్తున్నాం. వారి జీవితాల్లో మార్పులు రావాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిగతా వారితో పోటీపడి ఎదగాలి. అందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని ఈ రెండున్నరేళ్లుగా మనసా, వాచా తపించాం. మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం లాంటి పథకాలతో పాటు నవరత్నాలతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ప్రతి అడుగులో తోడుగా నిలబడ్డాం. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ వాహనమిత్ర.. ఇలా పలు పథకాలను తెచ్చాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, 30 లక్షలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వడం ఇలా ఏది తీసుకున్నా ఎన్నికల ముందు ఏలూరులో ఇచ్చిన మాట ప్రకారం వారిని వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తి.. వారికి ముద్దుబిడ్డ ► ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈరోజు రామోజీరావుకు.. అంటే ఈనాడుకు ముద్దుబిడ్డ. ► బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి ఇవాళ ఏబీఎన్, టీవీ 5కి ముద్దుబిడ్డ. ► బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా కేంద్రానికి లేఖలు రాసిన వ్యక్తి ఈ రోజు మన ఎర్రజెండాల వారికి ఆత్మీయ కామ్రేడ్. ► ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా బాబు బినామీల భూముల రియల్ ఎస్టేట్ కోసం కామ్రేడ్ సోదరులు జెండాలు పట్టుకునే పరిస్థితి. ► అమరావతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ప్రభుత్వం ఇంటి స్థ్ధలాలను కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ (సామాజిక సమతుల్యం) దెబ్బ తింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసిన చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న మహానుభావుల్లో మన కామ్రేడ్లు ఉన్నారంటే వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో గమనించాలని కోరుతున్నా. – సీఎం జగన్ రెండున్నరేళ్లలో ఏం చేశామో మచ్చుకు కొన్ని.. ► బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించిన మొట్టమొదటి రాష్ట్రం మనదే. కేబినెట్ కూర్పులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం మంత్రి పదవులిచ్చిన ప్రభుత్వం మనదే. ఐదుగురు డిప్యూటీ సీఎంలకు గానూ నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. ► శాసనసభ స్పీకర్ పదవి సైతం బీసీలకే ఇచ్చి గౌరవించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 32 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే అందులో 18 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. నలుగురిని రాజ్యసభకు పంపిస్తే అందులో సగం అంటే రెండు బీసీలకే ఇచ్చాం. ► స్థానిక సంస్థ్ధల ఎన్నికల్లో మొత్తం 650 మండలాలలో వైఎస్సార్ సీపీ 636 చోట్ల క్లీన్ స్వీప్ చేయగా 427 మండల అధ్యక్ష పదవులు అంటే 67 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చాం. 13 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 9 పదవులు అంటే 69 శాతం ఇచ్చాం. ► 13 నగర కార్పొరేషన్ ౖచైర్మన్ల ఎన్నికలకు వెళ్లి దేవుడి దయతో 13 మనమే గెలిచాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 12 పదవులు అంటే 92 శాతం ఇచ్చాం. ► 87 మున్సిపాల్టీలలో 84 చోట్ల వైఎస్సార్ సీపీ విజయం సాధించగా 61 ౖచైర్మన్ పదవులు అంటే 73% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 118 అంటే 60 శాతం చైర్మన్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. ► నామినేటెడ్ కింద 137 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకుగానూ 79 పదవులు అంటే 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ► 484 నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టుల్లో 281 పోస్టులు అంటే 58 శాతం ఈ వర్గాలకే ఇచ్చాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం మనదే. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో 83%ం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వగలిగాం. కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల నుంచి లబ్ధిదారులు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పంచుకున్నారు. వారు ఏమన్నారంటే.. బీసీలు ఇది తమ ప్రభుత్వమని భావిస్తున్నారు ఈ రోజు చేదోడు పథక రచనలోనే మీ మనసును ఆవిష్కరించారు. పేదరికంలో ఉన్నవారిని అందులోంచి బయటపడేసేందుకు మీరు పాదయాత్ర అనే తపస్సు చేశారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని మీకెన్ని కష్టాలు వచ్చినా వారిని ఆదుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని జీవించే రజకులు కానీ.. ఇతరులు కానీ ఏ పథకం వచ్చినా వారికి అదనంగా ప్రోత్సాహం ఇవ్వాలని రూ.10 వేలు రెండో ఏడాదీ ఇస్తున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పథకం అమలు చేస్తున్నారు. తన అవసరాన్ని ఎవరికీ చెప్పుకోకుండా కేవలం భగవంతుడికే చెప్పుకున్నా అది జగనన్నకు వినపడింది. ఆ కుటుంబాల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడి ఇది తమ ప్రభుత్వం అని భావిస్తున్నారు. బలహీన వర్గాల వారి కష్టాలను మీరు తీరుస్తున్నారు. మీకు సూర్యభగవానుడు మరింత శక్తిని ఇవ్వాలని, మీ ద్వారా రాష్ట్రంలో పేదలందరికీ మంచి జరగాలని, మీరు తలపెట్టిన యజ్ఞఫలం ప్రజలకు అందే సమయంలో మీకు ఆ భగవంతుడు మరింతగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏ ప్రభుత్వం చేయని సాయం మీరు చేశారు ఆరేళ్లుగా టైలరింగ్ సెంటర్ నడుపుకుంటున్నాను. నా దగ్గర ముగ్గురు పని చేస్తున్నారు. మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మాకు అందలేదు. మీరు చేస్తున్న సాయం మా వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుంది. కరోనా కష్టకాలంలో ఈ సాయం మాకు చాలా ఉపయోగకరం. ఈ డబ్బుతో నేను టైలరింగ్ మెటీరియల్ తెచ్చుకుంటాను. నాకు రూ.5 లక్షల విలువైన ఇంటి స్థలం వచ్చింది. మేం మా తల్లిదండ్రులకు సాయం చేసే పరిస్థితుల్లో లేకపోయినా మీరు మా ఇంటి పెద్దకొడుకులా వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చారు. వారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – తిరుమలశెట్టి వెంకట రమణమ్మ, టైలర్, కాకినాడ కరోనా టైంలో చాలా సాయం చేశారు నేను 15 ఏళ్లుగా టైలరింగ్ చేస్తున్నాను. మీరు పాదయాత్రలో మా కష్టాలు చూసి మాకు ఆర్థిక సాయం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన డబ్బుతో నా షాప్ అభివృద్ధి చేసుకున్నాను. ఇప్పుడు రెండో విడత వస్తున్న డబ్బును కూడా సద్వినియోగం చేసుకుంటాను. నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి. రాష్ట్రంలో అనేకమంది పేద పిల్లలకు మీరు మంచి చదువులు చెప్పిస్తున్నారు. కరోనా టైంలో మీరు చాలా సాయం చేశారు. మీరు ప్రతి పథకాన్ని ఆపకుండా నెరవేరుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. – ఎన్.సరళ, టైలర్, చిన్నాపురం, మచిలీపట్నం నాయీ బ్రాహ్మణులకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు గతంలో సాయం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు గతంలో మా నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాల్లో కూడా మాకు స్థానం కల్పించారు. మాకు ఉచిత కరెంట్ ఇచ్చారు. సెలూన్ షాప్లున్న నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మేం ఎవరూ కూడా బిల్ కట్టడం లేదు. గతంలో కరెంట్ బిల్లు గురించి చాలా ఆందోళన చెందేవాళ్లం. ఇప్పుడా ఇబ్బంది లేదు. గతంలో మేం చాలాసార్లు అందరినీ కలిశాం. ఎవరూ సాయం చేయలేదు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. – స్వామి చంద్రుడు, నాయీబ్రాహ్మణ సంఘ నాయకుడు, కర్నూలు దరఖాస్తు చేసుకోగానే సాయం నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటున్నాను. ఈ పథకం గురించి వలంటీర్ చెప్పారు. నేను దరఖాస్తు చేసుకోగానే సాయం అందింది. మీరు రెండో విడతగా చేస్తున్న సాయం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మా అమ్మకు ఇంటి స్థలం వచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందింది. నాకు డ్వాక్రా రుణమాఫీ కూడా జరిగింది. థాంక్యూ అన్నా. – సంతోషికుమారి, టైలర్, విజయనగరం -
Jagananna Chedodu : బ్యాంక్ ఖాతాల్లో ‘జగనన్న చేదోడు’ నగదు జమ (ఫొటోలు)
-
ఒక విషయం చెప్తా వినండి అన్న.. ఈ అక్క న్మాతలకి జగనన్న ఫిదా
-
నాకు దేవుడు ఇచ్చిన అన్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద రూ. 285.35 కోట్ల నగదు విడుదల చేశారు. 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మందికి సాయం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడు చెందిన టైలరింగ్ వృత్తి చేసుకుంటున్న తిరుమలశెట్టి వెంకటరమణమ్మ మాట్లాడుతూ.. తాను గత ఆరేళ్లుగా టైలరింగ్ సెంటర్‌ను నడుపుతున్నానని, తన వద్ద ముగ్గురు పనిచేస్తున్నారని తెలిపారు. తమ వృత్తికి ఎంతో అవసరమైన ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు తమకు ఏ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందలేదని చెప్పారు. గత ఏడాది జగనన్న చేదోడు పథకం కింద రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిందని, ప్రతీ ఏడాది రూ.10 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.50 వేలు అందిస్తూ తమ వ్యాపార, కుటుంబ అభివృద్ధికి సాయం చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి విడుతలో వచ్చిన నగదు కరోనా కష్టకాలంలో ఉపయోగపడిందని తెలిపారు. రెండో విడుతలో కూడా రూ.10 వేలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ డబ్బుతో టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ తన వద్ద పనిచేసేవారికి ఉపాధి కల్పించాడనికి అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసువచ్చిన అన్ని పథకాలు తమకు అందుతున్నాయని చెప్పారు. డైరెక్ట్‌గా తమ ఇళ్ల వద్దకు అన్ని పథకాలు అందడానికి ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థకుగాను సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు(సీఎం జగన్) ప్రవేశపెట్టిన పథకాలు కాకుండా మరో విషయం తనను కదిలించిందని.. నిన్న, నేడు, రేపు ఎప్పుడు తమ సేవకునిలా ఉంటానని సీఎం అన్న విషయాన్ని గుర్తుచేశారు. అంతకన్న ఎక్కువ సీఎం జగన్ తమకు దేవుడు ఇచ్చిన అన్న అని వెంకటరమణమ్మ తెలిపారు. కర్పూలు జిల్లా నుంచి నాయీబ్రాహ్మణ సేవా సంఘం టౌన్ ప్రెసిడెండ్ స్వామి చంద్రుడు మాట్లాడుతూ.. గత ఏడాది జగనన్న చేదోడు కింద రూ.10 వేల సాయం అందింది. ఈ రోజు రెండో ఏడాదికిగాను రూ. 10 వేల సాయం అందినట్లు చెప్పారు. నాయీబ్రాహ్మణలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రముఖ దేవాలయాల్లో స్థానం, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు.. స్వామి చంద్రుడు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎల్లో మీడియా ఏడుపుపై సీఎం జగన్ కౌంటర్
-
చంద్రబాబుకు ఎల్లో మీడియాకు మాత్రమే సమ్మె కావాలి:సీఎం జగన్