
తాడేపల్లి: ‘ఎదుట ఎర్రజెండా... వెనుక పచ్చజెండా’ అన్న చందంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎర్రజెండా, పచ్చజెండాలు కలిసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. ఈరోజు(మంగళవారం) ‘జగనన్న చేదోడు’ రెండో ఏడాది నగదు విడుదల కార్యక్రమంలో మాట్లాడిన ఆయన .. ‘పేద ఇళ్లను అడ్డుకున్న చంద్రబాబు.. కామ్రేడ్లకు మిత్రుడు. చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు మాత్రమే సమ్మె కావాలి. ఉద్యోగులు సమ్మె విరమించారనగానే కామ్రేడ్లను ముందుకు తోశారు. ఎర్రజెండా వెనుక పచ్చజెండా ఉంది. సీఎంను తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తారు. ఉద్యోగులను ఎర్రజెండాలు-పచ్చజెండాలు కలిసే రెచ్చగొట్టారు.
ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలని కోరుకుంటారన్న వ్యక్తి చంద్రబాబు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు.. రామోజీరావుకు ముద్దు బిడ్డగా ఉన్నారు. ఈనాడు, రామోజీరావుకు వాస్తవాలు కనిపించవా’ అని ప్రశ్నించారు.
‘చంద్రబాబు దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మె కావాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5కి సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతుంటే ఎల్లో మీడియాకు పండుగ. సంధి జరిగింది.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదని వారికి మంట. అందుకే ఉద్యోగులు సమ్మె విరమించగానే కామ్రేడ్లను ముందుకు తోశారు ’ అని సీఎం జగన్ మండిపడ్డారు.
చదవండి: లక్షా 84 వేల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment