52 నెలల పాలనలో ఆ మాట నిలబెట్టుకున్నాం: సీఎం జగన్‌ | CM YS Jagan Speech Highlights At Jagananna Chedodu Public Meeting In Kurnool Yemmiganur - Sakshi
Sakshi News home page

జగనన్న చేదోడు.. 52 నెలల పాలనలో ఆ మాట నిలబెట్టుకున్నాం: సీఎం జగన్‌

Published Thu, Oct 19 2023 12:01 PM | Last Updated on Thu, Oct 19 2023 2:05 PM

Jagananna Chedodu YS Jagan Speech At Kurnool Yemmiganur - Sakshi

సాక్షి, కర్నూల్‌: వెనుకబడిన కులాలను, వెనుకబడిన వర్గాలను.. వెన్నెముక మాదిరిగా దృఢంగా మారుస్తామూ అని ఏదైతే మాట ఇచ్చామో పాదయాత్ర సందర్భంగా.. ఈ రోజు నేను మీ బిడ్డగా మీ అన్నగా.. మీ తమ్ముడిగా.. సగర్వంగా తలెత్తుకుని చెబుతా ఉన్నాను. ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతీ  ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాను. వారి జీవిత ప్రయాణంలో తోడుగా ఉండగలిగామని సగర్వంగా, మీ బిడ్డగా చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాను.. 

జగనన్న చేదోడు నిధుల జమ కార్యక్రమం కోసం గురువారం కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన సభకు సీఎం జగన్‌ హాజరై ప్రసంగించారు.  ‘‘వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నాం.. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నాం. ఈరోజు సొంత షాపులు ఉన్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. జగనన్న చేదోడు అనే కార్యక్రమం బటన్ నొక్కి నేరుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపడం జరుగుతుంది. వరుసగా నాలుగో ఏడాది అమలు చేస్తూ 3.25 లక్షల మందికి రూ.325 కోట్లు నేరుగా పంపించడం జరుగుతుంది. 

ఒక్క చేదోడు పథకం ద్వారా మాత్రమే రూ.1250 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో చేదోడు పథకం ద్వారా మాత్రమే లక్షల మందికి రూ.40 వేల దాకా వాళ్ల కుటుంబాలకు ఇవ్వగలిగాం. గతానికి ఇప్పటికి పోలికలు చూడమని చెబుతున్నా.  52 నెలల కాలంలో ప్రతి అడుగూ ఇదే విధంగా పడింది. అక్షరాలా రూ.2.38 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. 

ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. మీ బిడ్డ హయాంలో, మనందరి ప్రభుత్వంలో మంచి చేయగలిగాం అంటే గతానికి ఇప్పటికి పోలిక చూడమని చెబుతున్నా. చేతి వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఇటువంటి వారు బతకలేని పరిస్థితిలోకి వస్తే ఈ వ్యవస్థ కుప్పకూలిపోదా?.  ఇటువంటి వారి గురించి ఎవరైనా ఆలోచన చేశారా?. చేదోడు, వాహన మిత్ర, ఇలా స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా ఉంటున్నాం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడకుండా వారందరికీ సహాయం అందించే కార్యక్రమం జరుగుతోంది.

ప్రతి అడుగులోనూ నానానా అంటూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద వర్గాలు అంటూ ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి పేద ఇంట్లో నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటున్నాం.  అక్కచెల్లెమ్మల పిల్లలకు సొంత మేనమామగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, తోడుగా నిలబడుతూ ఈ నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మల కోసం వైయస్సార్ ఆసరా ద్వారా చేయి పట్టుకొని నడిపిస్తూ తోడుగా ఉన్నాం. 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అందించిన సాయం రూ.19,178 కోట్లు.  ఈ జనవరిలో మరో రూ.6,500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా కింద ఇవ్వనున్నాం. సున్నా వడ్డీ కింద ఆ ఒక్క పథకానికే ఇచ్చినది రూ.4,969 కోట్లు.  45-60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీకి చెందిన అక్కచెల్లెమ్మలు 26,39,703 మందిని ప్రోత్సహిస్తూ అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్ యూనిలీవర్ లాంటి సంస్థలను తీసుకురావడమే కాకుండా బ్యాంకులతో అనుసంధానం చేసి తోడుగా ఉన్నాం. చేయూత ద్వారా బటన్ నొక్కి మీ బిడ్డ పంపించిన సొమ్ము రూ.14129 కోట్లు. 

వచ్చే జనవరిలో వైయస్సార్ చేయూత కింద మరో రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నాం. కాపు నేస్తం కింద 3,57,844 మందికి తోడుగా నిలబడ్డాం. రూ.2,028 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం ద్వారా పేద అక్కచెల్లెమ్మలకు 4.40 లక్షల మందికి 1257 కోట్లు ఇవ్వగలిగాం. మత్స్యకార భరోసా ద్వారా 2,43,394 మందికి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ 538 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 82 వేల చేనేత కుటుంబాలకు ఇప్పటికే ఇచ్చిన సాయం రూ.982 కోట్లు. వాహన మిత్ర ద్వారా 2,75,931 మందికి 1302 కోట్లు బటన్ నొక్కి జమ చేశాం. జగనన్న తోడు ద్వారా 15,87,492 మంది చిరు వ్యాపారులకు రూ.2956 కోట్లు ఇవ్వగలిగాం. 

ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ ఇంతకు ముందు జరిగాయా? ఇవ్వగలిగారా? అని ఆలోచన చేయాలి. ఇలా నిజంగానే ఒక ప్రభుత్వం వస్తుంది, ఎక్కడా లంచాలు లేవు, అర్హత ఉంటే చాలు నా ఖాతాలోకి డబ్బు వస్తుందని ఎవరైనా అనుకున్నారా?. ఇవన్నీ 52 నెలల పరిపాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement