బుధవారం రాజీవ్‌నగర్‌లోని డబుల్ బెడ్ రూం ఇళ్ల ముందు లబ్ధిదారులు
సాక్షి, మంచిర్యాల: డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో విసిగిపోయిన లబ్ధిదారులు తాళాలు పగులగొట్టి ఇళ్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఈ నెల 20న మొదట మూడు కుటుంబాలు ఒక్కొక్క ఇంటిని ఆక్రమించాయి. బుధవారం దాదాపు 40 కుటుంబాల వరకు ఇళ్లు ఆక్రమించగా..
కొందరు అక్కడే ఉండి వంటలు చేసుకున్నారు. రాత్రి కూడా అక్కడే ఉంటామని లబ్ధిదారులు స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, వానాకాలంలో నిలువ నీడ లేని నిరుపేదలమైన తాము ఇక్కడే తలదాచుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సంఘటనపై స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment