Rajivnagar
-
తాళాలు పగులగొట్టి.. ఇళ్లు ఆక్రమించి
సాక్షి, మంచిర్యాల: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో విసిగిపోయిన లబ్ధిదారులు తాళాలు పగులగొట్టి ఇళ్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లలో ఈ నెల 20న మొదట మూడు కుటుంబాలు ఒక్కొక్క ఇంటిని ఆక్రమించాయి. బుధవారం దాదాపు 40 కుటుంబాల వరకు ఇళ్లు ఆక్రమించగా.. కొందరు అక్కడే ఉండి వంటలు చేసుకున్నారు. రాత్రి కూడా అక్కడే ఉంటామని లబ్ధిదారులు స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, వానాకాలంలో నిలువ నీడ లేని నిరుపేదలమైన తాము ఇక్కడే తలదాచుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సంఘటనపై స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. -
ఈతకు వెళ్లి విద్యార్థుల గల్లంతు
సిరిసిల్ల: సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లారు.. ఒకరి వెంట ఒకరు ఐదుగురు అందులో దూకారు.. లోతు ఎక్కువగా ఉండటంలో దూకిన విద్యార్థులంతా గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి శివారులోని మానేరు వాగులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఈ విద్యార్థులంతా జిల్లా కేంద్రంలోని కుసుమ రాజయ్య జెడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటకు ఇంటికి వెళ్లిన పిల్లల్లో 8 మంది భోజనం చేసి మానేరు వాగు వద్దకు ఈతకు వెళ్లారు. ముందుగా రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్(14), కొంగ రాకేశ్ (15) శ్రీరామ్ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్(14), దిడ్డి అఖిల్(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వాగులో గాలించగా.. గణేశ్ మృతదేహం లభ్యమైంది. వెంకటసాయి, అజయ్, రాకేశ్, శ్రీరామ్ క్రాంతిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈత కోసం వెళ్లిన ఐదుగురు స్నేహితులు నీటిలో గల్లంతవడం సిరిసిల్ల పట్టణంలో విషాదాన్ని నింపింది. సోమవారం రాత్రి వరకు నలుగురి పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చిమ్మచీకటి.. ఇంకోవైపు మత్తడి దూకుతున్న వరద.. ఇలాంటి పరిస్థితిలోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృగాళ్లు
మగాళ్లు మృగాళ్లలా మారారు. మద్యం మత్తులో మానవత్వం మరిచి పైశాచికంగా వ్యవహరించారు. జిల్లాలో బుధవారం జరిగిన సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారుు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో... జీవితాంతం తోడూనీడగా ఉంటానని బాస చేసిన భర్తే వంద రూపాయల కోసం భార్యతో ఘర్షణ పడి ఆమెను హతమార్చాడు. సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌లో మద్యం తాగడానికి డబ్బులివ్వడం లేదని భార్యాబిడ్డలను చితకబాదాడో ప్రబుద్ధుడు. తిమ్మాపూర్ మండలం రేణికుంటలోఓ మానవమృగం మహిళా చెవులు కొరికి, వికృత చేష్టలకు పాల్పడి సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. వీరందరికీ స్థానికులు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు. హుస్నాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : మద్యం మహమ్మారి వారి కాపురంలో చిచ్చు పెట్టింది. రూ.100 కోసం ఆలినే కడతేర్చాడు. తండ్రి చేసిన పనికి తల్లి పరలోకాలకు వెళ్లగా తండ్రి జైలుపాలు కావడంతో వారి కుమారుడు బిక్కుబిక్కుమంటూ తాతమ్మ దగ్గర విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అక్కన్నపేటలో శ్రీనివాస్ చేతిలో హతమైన భార్య రేణుకను చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ మల్లమ్మ పెంచి పెద్దచేసింది. రేణుకకు ఆమె గ్రామస్తుల వద్ద విరాళాలు సేకరించి ఆమెకు మేన బావ అయిన శ్రీనివాస్‌తో పెళ్లి చేశారు. వీరికి కుమారుడు నాగచైతన్య(6) ఉన్నాడు. శ్రీనివాస్ జులాయిగా తిరుగుతూ నిత్యం తాగి వచ్చి రేణుకను వేధించడం సాధారణమైపోయింది. చివరకు మంగళవారం రాత్రి అతడి చేతిలోనే కడతేరగా సర్పంచ్ శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామస్తులే మళ్లీ విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తు చేసేందుకు వచ్చిన సీఐ సదన్‌కుమార్, ఎస్సై మహేందర్‌రెడ్డి సైతం రూ.2 వేలు అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సిరిసిల్ల రూరల్ : మద్యం మహమ్మారి మరో కుటుంబంలోనూ చిచ్చు పెట్టింది. తాగేందుకు డబ్బులివ్వలేదని సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన నగేశ్ భార్యాబిడ్డలను చితకబాదగా గ్రామస్తులు అతడిని కట్టేసి దేహశుద్ధి చేశారు.