
రేషన్‌కార్డును లబ్ధిదారుడికి అందజేస్తున్న కార్యదర్శి స్వర్ణలత తదితరులు
మెరకముడిదాం: విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఇజ్జిరోతు సూర్యనారాయణ రేషన్‌కార్డు కోసం గ్రామ సచివాలయంలో శనివారం మధ్యాహ్నం 1 గంటకు దరఖాస్తు చేసుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి ఎం.స్వర్ణలత లబ్ధిదారుడికి సాయంత్రం 4 గంటలకల్లా రేషన్‌కార్డు అందజేయడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. దరఖాస్తు చేసిన 3 గంటల వ్యవధిలోనే కార్డు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర
వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్ వన్
Comments
Please login to add a commentAdd a comment