కాశీనగర్ ఆస్పత్రిలో రామారావుకు పింఛన్ అందిస్తున్న వలంటీర్ కృష్ణ
నందిగాం: సామాజిక పింఛన్ల పంపిణీలో గ్రామ వలంటీర్లు కీలకభూమిక పోషిస్తున్నా రు. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న పింఛన్ లబ్ధిదారుల వద్దకే వెళ్లి డబ్బులు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నందిగాం మండ లం సైలాడ పంచాయతీ రౌతుపురం గ్రామానికి చెందిన నొక్కు రామారావు వలస కార్మి కుడుగా ఒడిశాలోని కాశీనగర్‌లో కూలీ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల అనారోగ్యానికి గురై కాశీనగరన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతను ఆర్థిక ఇబ్బందు లు పడుతున్నట్టు తెలుసుకున్న గ్రామ వలంటీర్ టి.కృష్ణ కాశీనగర్ ఆస్పత్రికి బుధవారం వెళ్లి ప్రభుత్వం సమకూర్చిన వృద్ధాప్య పింఛన్‌ను అందజేశాడు. దీంతో రామారావు వలంటీర్ కృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment