reimbursement
-
ఈనెల 27న కరెంటు ఛార్జీల పెంపుపై నిరసనలు: వైఎస్ జగన్
-
కూటమి పాపం .. నిరుపేద విద్యార్థులకు శాపం
-
తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల సమ్మె! ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్
-
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్
-
చరిత్ర ఎరుగని సాహసం..
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ సాహసించని రీతిలో అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఇంటి స్థలం, ఇల్లు రూపంలో ప్రతి నిరుపేద అక్కచెల్లెమ్మకు రూ.20 లక్షల వరకు విలువైన ఆస్తిని ఇవ్వగలిగే గొప్ప అవకాశాన్ని దేవుడు తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 4,07,323 మంది లబ్ధిదారులకు బ్యాంకు రుణాలపై వడ్డీని రీయింబర్స్ చేస్తూ రూ.46.90 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులైన 12,77,373 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే రుణాలిప్పించాం. వాటికి సంబంధించి తొలి దఫాలో 4,07,323 మందికి పావలా వడ్డీ కింద ఇవాళ సుమారు రూ.47 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ఈ కార్యక్రమం చేపడతాం. గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు విడుదల చేసినప్పుడు 5,43,140 మందికి దాదాపు రూ.54 కోట్లు విడుదల చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేస్తూ పావలా వడ్డీకే రూ.35 వేలు రుణం అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణం పురోగతిని వేగవంతం చేస్తున్నాం. బ్యాంకుల దగ్గర నుంచి పొందిన రుణాలను 9 నుంచి 11 శాతం వరకు వడ్డీతో తిరిగి చెల్లించే కార్యక్రమం అక్కచెల్లెమ్మలు సక్రమంగా చేయాలి. అది వారి బాధ్యత. అలా అక్కచెల్లెమ్మలు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వారికి అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ క్రమంలో అక్కచెల్లెమ్మలకు నికరంగా రూ.35 వేలపై పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. విలువైన స్థిరాస్తి.. రాష్ట్రంలో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎక్కడా, ఎప్పుడూ చూడని విధంగా చేపడుతున్నాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.2.70 లక్షలు ఖర్చవుతుంది. మరో రూ.లక్ష మౌలిక సదుపాయాల కోసం అదనంగా ఖర్చవుతుంది. ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల కోసం దాదాపు రూ.3.70 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.80 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మరో రూ.35 వేలు పావలా వడ్డీకి రుణాలను అందుబాటులోకి తెచ్చాం. దాదాపు రూ.15 వేలు ఖరీదు చేసే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నాం. సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్ లాంటి వివిధ రకాల నాణ్యమైన వస్తువులను మార్కెట్ ధర కన్నా తక్కువకు సబ్సిడీపై అందించడం ద్వారా రూ.40 వేల దాకా ప్రయోజనం చేకూరుస్తున్నాం. మనం ఇచ్చిన ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని జిల్లాల్లో రూ.15 లక్షల పైచిలుకు ఉంది. ఈ విలువ మీద ఇళ్లు, మౌలిక సదుపాయాల విలువలను కలిపితే ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆస్తిని తోబుట్టువుగా సమకూరుస్తున్నాం. ► కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ షర్మిలారెడ్డి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, ప్రత్యేక కార్యదర్శి బి.ఎండీ.దీవాన్ మైదిన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ లక్ష్మీ షా, సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోటిమంది.. జయహో జగనన్నా పిల్లాపాపలతో కలిపి సుమారు కోటిమంది అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా కల్పిస్తున్న గొప్ప యజ్ఞం జగనన్న ఇళ్ల నిర్మాణం. ఒక గ్రామం ఏర్పడాలంటే సుమారు 50 నుంచి 100 సంవత్సరాలు పడుతుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రెండున్నర ఏళ్లలో 17 వేల జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లను నిర్మించడం ఇదే ప్రథమం. ఇది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సీఎం జగన్‌కు మినహా మరెవరికీ ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తై నిరుపేద మహిళలు పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తున్నారు. కోటిమంది జయహో జగనన్నా అని నినదిస్తున్నారు. పేదలకు పక్కా గూడు కల్పించే ఈ మహా యజ్ఞం ఎంత మంది మారీచులు అడ్డుపడినా ఆగదు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖా మంత్రి ఓ ఆడబిడ్డకు ఇంకేం కావాలి? ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇంటి కోసం తిరిగి తిరిగి అలిసిపోయా. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం మంజూరైంది. వెంటనే పట్టా ఇచ్చారు. విశాఖలో అడుగు భూమి లేని నాకు ఈ రోజు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్ధలాన్ని, ఇంటిని కూడా అందించారు. ఇదంతా నమ్మలేకపోతున్నా. మాకిచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. బ్యాంకు ద్వారా పొందిన రుణానికి వడ్డీ కూడా మీరే కడుతున్నారు. కాలనీలో రోడ్లు, కరెంట్, నీళ్లు అన్నీ ఇచ్చారు. ఒక ఆడపిల్లకు అన్నగా మీరు (సీఎం జగన్) చేయాల్సిందంతా చేశారు. ఇంతకంటే ఏం కావాలి? మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. నేను పొదుపు సంఘం ద్వారా లబ్ధి పొందా. కరోనా సమయంలో ఎంతో ఆందుకున్నారు. మళ్లీ మీరే మాకు సీఎంగా రావాలి. – హైమావతి, లబ్ధిదారు, విశాఖపట్నం ద్వారకను తలపించేలా కాలనీలు మేం తమిళనాడు నుంచి ఇక్కడ స్థిరపడ్డాం. గుంటూరు జిల్లా పేరేచర్ల జగనన్న కాలనీలో నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.10 లక్షలు ఉంటుంది. దానికి తోడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేశారు. ఎన్ని జన్మలెత్తినా మీ (సీఎం జగన్) రుణం తీర్చుకోలేం. కాలనీలో కరెంటు, రోడ్లు, వాటర్ అన్ని సౌకర్యాలున్నాయి. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇచ్చారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నా. మా కాలనీలో లైటింగ్, ఆర్చ్ గేట్ కట్టారు. లైటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అప్పట్లో శ్రీకృష్ణుడు ద్వారక కట్టిస్తే అన్ని కులాలు కలిసి బతికేవారట. ఇప్పుడు జగనన్న కాలనీలు కూడా ద్వారక లాంటివే. తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు జీవితమిచ్చారు. మీలాంటి సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదు. మా పిల్లలను స్కూల్‌కు పంపితే అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానని గర్వంగా చెబుతున్నా. మా ఇంట్లో రేషన్ బియ్యం తింటాం. రేషన్ బండి ఇంటి ముందుకే వస్తోంది. ఏ ప్రయాస లేకుండా సరుకులు తీసుకుంటున్నాం. మిమ్మల్ని మళ్లీ గెలిపించుకుంటాం జగనన్నా. – పగడాల స్వర్ణ సింధూర, లబ్ధిదారు, గుంటూరు మీ సంకల్పం గట్టిది పదేళ్లు అద్దె ఇంట్లో ఉన్నాం. కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు తెచ్చిన సచివాలయాల వ్యవస్థతో రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటి స్థలం ఇచ్చారు. సొంతిల్లు కట్టుకునేందుకు రూ.35 వేలు బ్యాంకు రుణం అందించారు. ఆ వడ్డీ భారం మాపై పడకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్. నా ఇంటి స్థలం ఇప్పుడు రూ. 5 లక్షలు ఉంది. భవిష్యత్‌లో రూ.10 లక్షలు కూడా కావచ్చు. ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు కూడా మంజూరైంది. ఏ పథకం కావాలన్నా సులభంగా అందుతోంది. మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. మా అత్తయ్య చేయూత డబ్బులతో చీరల వ్యాపారం చేస్తోంది. మామకు వృద్ధాప్య పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారు. గతంలో పింఛన్ కోసం ఎంతో ప్రయాసలు పడ్డాం. పేద మహిళ లక్షాధికారి కావాలన్న మీ (సీఎం జగన్) సంకల్పం గొప్పది. మీ ద్వారా నా కుటుంబం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లబ్ధి పొందింది. – వహిదా ఖానం, లబ్ధిదారు, కడప -
దేశ చరిత్రలో ఎవరూ చేయని సాహసం ఇది..
-
పేద అక్కచెల్లెమ్మలకు అండగా సీఎం వైఎస్ జగన్
-
అక్కచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమం జరుగుతుంది. గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల పైబడి ఇచ్చాం. రూ.35వేల రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోంది. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సిమెంటు, స్టీల్, మెటల్ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు మంచి జరిగేలా చూస్తున్నాం. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 -20 లక్షల వరకూ ఒక ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇప్పిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని రీయింబర్స్మెంట్ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. ఇదీ చదవండి: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు -
CM Jagan: పేద అక్కచెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆరి్థక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం రీయింబర్స్మెంట్ చేయనున్నారు. పేదలకు పావలా వడ్డీ.. ఆపై భారం భరిస్తున్న ప్రభుత్వం సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. -
నేడు జగనన్న విద్యా దీవెన సాయం
సాక్షి, అమరావతి/సాక్షి చిత్తూరు: జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేయనున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. ఇదే సందర్భంలో నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారం¿ోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సాయం చేస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుపెట్టింది. -
ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్లు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్‌కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. -
పోలవరానికి రూ.826.18 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు చేసిన ఖర్చులో మరో రూ.826.18 కోట్లను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇంకా రూ.1,755.80 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1,671.23 కోట్లను కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేసింది. విభజన చట్టం ప్రకారం వంద శాతం వ్యయంతో కేంద్రమే నిర్మించా ల్సిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో 2016, సెప్టెంబరు 7 అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా నాటి సీఎం చంద్రబాబు చేశారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటికి మిగిలిన నీటిపారుదల విభాగం వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని కేంద్రం పెట్టిన షరతుకు నాటి టీడీపీ సర్కార్ అంగీకరించింది. ప్రాజెక్టు పనులకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తే.. ఆ తర్వాత వాటిని రీయింబర్స్ చేస్తామని కూడా కేంద్రం మెలిక పెట్టింది. రీయింబర్స్ చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యంచేస్తున్నా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ఖజానా నుంచే నిధులు కేటాయిస్తూ పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ ప్రణాళికాయుతంగా పూర్తిచేస్తున్నారు. ప్రాజెక్టు సత్వర పూర్తికి రూ.15 వేల కోట్లను ముందస్తుగా విడుదల చేయాలని.. బకాయిపడిన రూ.2,581.88 కోట్లను రీయింబర్స్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ప్రతి సందర్భంలోనూ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించి రూ.826.18 కోట్లు విడుదల చేసింది. ఏడాదికి సగటున రూ.1,587.71 కోట్లు.. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.20,775.90 కోట్లు ఖర్చుచేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు.. అంటే 2014, ఏప్రిల్ 1కి కంటే ముందు రూ.4,730.71 కోట్లను వెచ్చించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014, ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టు పనులకు రూ.16,045.19 కోట్లు వ్యయం చేసింది. అందులో 2014 నుంచి ఇప్పటిదాకా రూ.14,289.39 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. అంటే తొమ్మిదేళ్లలో ఏడాదికి సగటున రూ.1,587.71 కోట్లు విడుదల చేస్తోంది. వెంటాడుతున్న చంద్రబాబు పాపం.. ♦ కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం నిధులిస్తామని కేంద్రం పెట్టిన షరతుకు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించడం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. ♦ 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.86 కోట్లుగా కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదించింది. దీన్ని రూ.47,725.74 కోట్లకు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) కుదించింది. 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లుగా తేల్చింది. ఇందులో 2014, ఏప్రిల్ 1 వరకూ ఖర్చుచేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగిలిన రూ.15,667.90 కోట్లను మాత్రమే విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. ♦ 2013–14 ధరల ప్రకారం నిధులిస్తే చాలని నాటి సీఎం చంద్రబాబు అంగీకరించడంతో.. ఆ ప్రకారమే నిధులిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ పేర్కొంది. ఇప్పటికే రూ.14,289.39 కోట్లను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇంకా రూ.1,378.51 కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఇది పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా మారుతోంది. ♦ 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన వ్యయమే రూ.33,168.23 కోట్లని.. రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తిచేయగలమని ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లతో సమావేశమైన ప్రతి సందర్భంలోనూ సీఎం జగన్ విజ్ఞప్తి చేస్తూ వస్తుండటంతో.. కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2017–18 ధరల ప్రకారం కేంద్రం నిధులు ఇవ్వాలంటే.. సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను కేంద్ర మంత్రిమండలి ఆమోదించాల్సి ఉంది. -
వివాద్ సే విశ్వాస్ను ఆకర్షణీయంగా మార్చాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్లైన్లో ఉండాలని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ప్రకటించారు. -
విమాన టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే రీయింబర్స్మెంట్
న్యూఢిల్లీ: ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తుండటంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే, దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని ప్యాసింజర్లకు ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రూట్ల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ఖర్చుల్లో 30–75 శాతం వరకు (పన్నులు సహా) రీయింబర్స్ చేయాలి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. ప్యాసింజర్లు నిర్దిష్ట తరగతిలో ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టికెట్‌ను విమానయాన సంస్థలు వివిధ కారణాలతో దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్న ఉదంతాలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. -
ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఎగుమతుల పెంపు లక్ష్యంగా రాబోయే 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యుత్ సుంకం మాఫీ, సులభతర రుణ లభ్యత వంటి సహాయక చర్యలను ప్రకటించాలని ఎగుమతిదారులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన (ఆర్ఓడీటీఈపీ) పథకం రీయింబర్స్మెంట్ కోసం మాత్రమే కాకుండా, ఎగుమతుల పెంపు లక్ష్యంగా ఇతర కార్యక్రమాల కోసం కూడా తగిన నిధులను వాణిజ్య మంత్రిత్వశాఖకు ఆర్థికశాఖ అందజేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. ఆర్ఓడీటీఈపీ కింద వివిధ కేంద్ర– రాష్ట్ర సుంకాలు, ఇన్పుట్ ఉత్పత్తులపై వసూలు చేసిన పన్నులు, లెవీలను తిరిగి ఆయా ఎగుమతిదారులకు చెల్లించడం జరుగుతుంది. ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి కస్టమ్స్ సుంకాలలో కొన్ని మార్పులు, తగిన వడ్డీరేటులో రుణ లభ్యత అవసరమని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. భారత్ గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు. 2022–23లో 450 బిలియన్ డాలర్ల లక్ష్యం. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ లక్ష్య సాధనపై సందేహాలు నెలకొన్నాయి. ఎకానమీలో కీలకపాత్ర... దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఎగుమతులు కీలకమైన చోదకమని, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించాలని ముంబైకి చెందిన ఎగుమతిదారు, ది బాంబే టెక్స్టైల్ రీసెర్చ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ కె సరాఫ్ పేర్కొన్నారు. ‘‘తమ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేస్తున్న యూనిట్లకు విద్యుత్ సుంకాన్ని మినహాయించే విధానాన్ని బడ్జెట్ అందించాలి. ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేసే తయారీదారు ఎగుమతిదారులకు 2 శాతానికి సమానమైన పరిహారాన్ని మంజూరు చేయాలి. ఎగుమతిదారులు ఆర్థిక ఇబ్బందుల భర్తీకి ఇది దోహదపడుతుంది. ఈ పరిహారాన్ని ప్రోత్సాహకంగా పరిగణించకూడదు’’ అని సరాఫ్ సూచించారు. ఎగుమతుల రంగం అధిక నాణ్యతతో కూడిన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. సాంకేతికత, నాణ్యత స్పృహ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ రంగం ప్రోత్సహిస్తోందని కూడా ఆయన అన్నారు. ‘భారత్ వస్తు, సేవల ఎగుమతులు 2021–22 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 21.5 శాతంగా ఉన్నాయి. ఆసియాలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నమోదవుతున్న 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఎగుమతుల సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బ్యాంకింగ్, షిప్పింగ్, బీమా, టూరిజం వంటి అనేక రంగాల నుంచి సేవల పరమైన ఎగుమతులకు ప్రోత్సాహకాలు అవసరం’’ అని కూడా ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు. కాగా, లూథియానాకు చెందిన హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్సి రాల్హాన్ మాట్లాడుతూ, ఆధునిక మౌలిక సదుపాయాలతో సెక్టార్–నిర్దిష్ట క్లస్టర్లు లేదా పార్కులను ఏర్పాటు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తగినన్ని నిధులను అందించాలని కోరారు. ఇది తయారీదారుల పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని అన్నారు. ఆఫ్రికా వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారీ ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎగ్జిబిషన్లు, ఫెయిర్లను నిర్వహించడానికి కూడా నిధులు మంజూరు చేయాలనీ ఆయన కోరారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పిస్తారని భావిస్తున్న సంగతి తెలిసిందే. -
‘డబుల్’ లబ్ధిదారులకు రూ.50 వేల అద్దె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హులై.. రిజిస్టర్ చేసుకున్న కుటుంబాలకు ఇంటి వెలుగు కార్యక్రమం కింద రూ.50 వేల అద్దె చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ‘హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష ఇళ్లు, గ్రామీణంలో మరో లక్షా అరవై వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రిజిష్టర్ చేసుకున్న కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో రెంట్ రీయింబర్స్మెంట్ కింద రూ.50 వేలు ఒకే విడతలో గ్రాంటుగా ఇస్తాం. రిజిష్టర్ చేసుకున్న కుటుంబాలకు ఏడాదిలోనే ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని హామీ ఇస్తున్నాం’అని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో 15 రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ విడుదల చేస్తామన్నారు. ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం విధానాన్ని నెల రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. 28న రాహుల్, బాబు సంయుక్త ప్రచారం... ఇక ఈ నెల 28న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో సం యుక్త ప్రచారం చేస్తారని ఉత్తమ్ వెల్లడించారు. 28 న ఖమ్మం, తాండూర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా రోడ్‌షోల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. 29న సైతం మరిన్ని బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఫాంహౌజ్‌కు.. కేటీఆర్ అమెరికాకు.. ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ 12 నుంచి కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమవుతారని, కేటీఆర్ తెలంగాణకు గుడ్‌బై చెప్పి అమెరికాకు వెళ్లిపోతారని ఉత్తమ్ పేర్కొన్నారు. ఓడిపోతే ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించినందుకు కేసీఆర్‌కు తాను అభినందనలు తెలియజేస్తున్నానని కౌంటర్ వేశారు. దగాకోరు, మోసకారి అయిన కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమేనని పునరుద్ఘాటించారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ తీరు పట్ల విసిగెత్తి ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి పొందడానికి ఇదే సరైన సమయమని, అలాంటి వారందరికీ తాము ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఒకట్రెండు రోజు ల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఉత్తమ్ వెల్లడిం చారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం, ప్రజల కు మధ్యే జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
హెల్త్‌స్కీం రీయింబర్స్మెంట్ పద్ధతి పొడిగింపు
హైదరాబాద్ : ఉద్యోగుల హెల్త్ స్కీం రీయింబర్స్మెంట్ పద్ధతిని తెలంగాణ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఈ ఏడాది జూన్ 30 వరకు ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ ఉంటుంది. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం మరోసారి మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ని పొడిగించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
50 వేల కళ్లజోడు.. అసెంబ్లీని కుదిపేసింది
తిరువనంతపురం : స్పీకర్ కళ్లజోడు వ్యవహారం కేరళ అసెంబ్లీని కుదిపేస్తోంది. ఖరీదుతో కూడిన కళ్లద్దాలు స్పీకర్ ధరించటం.. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్ఛు చేయటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేరళ అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ సుమారు 50వేల ఖరీదుతో ఈ మధ్యే కళ్లజోడు కొనుకున్నారు. దీనిపై ప్రతిపక్ష సభ్యుడొకరు ఆర్టీఐ ద్వారా సమాచారం రాబట్టారు. అందులో గ్లాసులకు 45,000 వేల రూపాయలు, ఫ్రేమ్‌కు 4,500 రూ. ఖర్చు చేసినట్లు ఉంది. ఈ మొత్తం సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి ఆయనకు రీ-ఎంబర్స్ అయినట్లు తేలింది. దీంతో ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఇంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కూడా 28,000 రూ. కళ్లజోడు కొనుక్కోవటం.. ఆ సొమ్ము కూడా రీఎంబర్స్ కావటం విమర్శలకు తావునివ్వగా... ఇప్పుడు స్పీకర్ వ్యవహారం కూడా వెలుగులోకి రావటంతో విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. స్పీకర్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. స్పీకర్ వివరణ... గత కొన్ని రోజులుగా నా కళ్లు సరిగ్గా కనిపించటం లేదు. నా పనులు చేసుకోవటం కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. అధికారిక కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సిన బాధ్యత నా పై ఉంది. అందుకే వైద్యుడి సలహా మేరకు మంచి కళ్లజోడు తీసుకున్నా. తప్పేముంది అని శ్రీరామకృష్ణన్ వివరణ ఇచ్చారు. కాగా, కేరళ శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యుల చికిత్స పేరిట బిల్లులతో మెడికల్ రీఎంబర్స్మెంట్ సొమ్మును లక్షల్లో వసూలు చేస్తున్నారు. వీరిలో అధికార పక్ష నేతలే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిపై ఇటీవలె స్థానిక మీడియా ఛానెళ్లలో ప్రత్యేక కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ తతంగం వెనుక మొత్తం బీజేపీ హస్తం ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపిస్తున్నారు. -
ఆస్పత్రికి పోతే అప్పుల పాలే
- బిల్లులు లక్షల్లో.. ప్రభుత్వాల రీయింబర్స్మెంట్ వేలల్లో - లబోదిబోమంటున్న ఉద్యోగులు.. పెన్షనర్లదీ అదే దుస్థితి - ఒప్పందం ఉల్లంఘించి లక్షల్లో బిల్లులు - వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు - ఆస్పత్రుల నియంత్రణలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం - ఏటా సగటున 50 వేలమందిపై రూ.300 కోట్ల భారం - నగదు రహిత వైద్యం అమలు చేయకపోవడంతో నష్టపోతున్న వైనం సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరుతున్న ఉద్యోగులు, పెన్షనర్లను.. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ ఆస్పత్రులు కలసి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద రీయింబర్స్మెంట్ వస్తుంది కదా అనే ధైర్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు చివరకు ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న బిల్లులు చూసి లబోదిబోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) రేట్ల ప్రకారం వైద్య చికిత్సలు చేయాల్సిన ఆస్పత్రులు.. ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి అధిక బిల్లులతో రోగులను పిండుకుంటున్నాయి. మరోవైపు లక్షల్లో బిల్లులు వేస్తున్న ఆస్పత్రులను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. పూర్తిగా నగదు రహిత వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తేవడమే దీనికి పరిష్కారమని అధికారులు సూచిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏటా సగటున యాభైవేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య బిల్లుల కారణంగా అప్పులపాలవుతున్నారు. ఏదైనా జబ్బుతో కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారంటే ఆ అప్పునుంచి ఏళ్ల తరబడి కోలుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ఏటా పరిశీలనకు 50 వేల దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు 8.5 లక్షల మంది ఉండగా, తెలంగాణలో 5 లక్షల వర కు ఉన్నారు. వీరికి సంబంధించిన మెడికల్ బిల్లులు ఏటా సగటున 50 వేల వరకు వైద్య విద్యా సంచాలకుల పరిశీలనకు వస్తున్నాయి. ఈ 50 వేల దరఖాస్తులకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇస్తున్న బిల్లుల అంచనా రూ.700 కోట్లకు పైనే. కానీ ఉద్యోగులకు రాష్ర్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీ (సీజీహెచ్ఎస్) రేట్ల కింద రీయింబర్స్మెంట్ చేస్తున్నది మాత్రం రూ.400 కోట్లు మాత్రమే. అంటే సగటున 50 వేలమంది ఉద్యోగులు, పెన్షనర్లపై ఏటా రూ.300 కోట్ల మేర భారం పడుతోందన్నమాట. ఆస్పత్రులకు ముందు సొమ్ము చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. అమలుకు నోచని నగదు రహిత వైద్యం ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమల్లోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గత రెండేళ్లుగా చెబుతున్నా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెల నెలా ప్రీమియం డబ్బు వసూలు చేస్తున్నా ప్రయోజనం శూన్యం. ప్రీమియం కొంత అధికంగా తీసుకునైనా తమకు నగదు రహిత వైద్యం అందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. తూతూ మంత్రంగా కార్పొరేట్ ఆస్పత్రులతో భేటీలు జరుపుతున్నాయే తప్ప ఫలితం ఉండటం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆస్పత్రుల్లో చేరితే డబ్బులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏ ఆరు మాసాల్లోపో సీజీహెచ్ఎస్ రేట్ల ప్రకారం బిల్లులు మంజూరు చేస్తుండటంతో అప్పులపాలవుతున్నారు. పొంతనలేని రేట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉన్న రేట్ల ప్రకారమే కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం అందించాల్సి ఉండగా.. అవి వేస్తున్న బిల్లులు మాత్రం మూడు, నాలుగు రెట్లు ఉంటుండడం గమనార్హం. కొన్ని జబ్బులకు సంబంధించిన రేట్లను పరిశీలిస్తే... - కంటికి సంబంధించిన ఏ జబ్బుకైనా సీజీహెచ్ఎస్ కింద గరిష్టంగా రూ.18 వేల రీయింబర్స్‌మెంట్‌కే అవకాశం ఉంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు జబ్బును బట్టి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లు వేస్తున్నాయి. - లాంగ్బోన్ సర్జరీకి ప్యాకేజీ రేటు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండగా.. ఆస్పత్రులు రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. - మోకాలి చిప్ప మార్పిడికి ఒక్కో దానికి రూ.1.56 లక్షలు ఉంటే కార్పొరేట్ బిల్లు రూ.2 లక్షలకు పైగానే వస్తోంది. - గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సకు ప్రభుత్వం గరిష్టంగా రూ.2 లక్షలే ఇస్తుంది. కానీ ఆస్పత్రుల బిల్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అవుతోంది. - గుండెకు స్టెంట్లు (2) వేస్తే ప్రభుత్వం గరిష్టంగా రూ.2 లక్షలు ఇస్తుండగా రూ.4 లక్షలు పైనే వేస్తున్నారు. - తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేస్తే వచ్చే బిల్లు రూ.20 వేలకు మించి లేదు. కానీ ఆస్పత్రులు రూ.70 వేలు బిల్లు వేస్తున్నాయి. - హెర్నియా సర్జరీకి (మందులు, సేవలు కలిపి) రూ.50 వేలు మించి లేదు. కానీ రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈహెచ్ఎస్ వస్తేనే న్యాయం జరుగుతుంది కార్పొరేట్ ఆస్పత్రులు ఎక్కువ రేట్లు వేస్తున్న విషయం వాస్తవమే. కానీ వాటిని నియంత్రించలేకపోతున్నాం. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అధికంగా బిల్లులు చెల్లిస్తున్నదీ వాస్తవమే. దీనికి పరిష్కారం నగదు రహిత వైద్యం మినహా మరొకటి లేదు. త్వరలో దీన్ని అమల్లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాం. - డాక్టర్ ఎన్.సుబ్బారావు, వైద్యవిద్యా సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందుకురావడం లేదు.. పెన్షనర్లు లక్ష రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేస్తే కొన్నిసార్లు రూ.10 వేలు కూడా రాని పరిస్థితి. వారి ఆవేదన వర్ణనాతీతం. మాకు ఉచిత వైద్యమొద్దు. డబ్బు తీసుకుని కార్పొరేట్ వైద్యం అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులు మూడు ప్యాకేజీల ఆప్షన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వమే ముందుకు రావడం లేదు. - పి.వెంకటరెడ్డి, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం ఆదేశాలతోనే సరి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నాలుగు నెలల క్రితం ఆదేశాలిచ్చారు. ఉద్యోగులే ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ ఇప్పటివరకు ట్రస్ట్ ఏర్పాటుకు జీవో లేదు, మేనేజింగ్ కమిటీ లేదు. హైదరాబాద్‌లోని 15 కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు చెన్నై, బెంగళూరుల్లో ఉన్న కొన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్ఎస్ వర్తింప చేయాలని సీఎం చెప్పారు.. కానీ ఏదీ అమలుకు నోచుకోలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు నెలనెలా డబ్బులు చెల్లిస్తున్నా నగదు రహిత వైద్యం అందడం లేదు. - కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ -
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే: కేసీఆర్
సదరు విద్యా సంస్థల గుర్తింపు రద్దు అసలుదేదో, నకిలీదేదో తేల్చాలని ఆదేశం వాటిలోని విద్యార్థులకు నష్టం జరగనివ్వొద్దు విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం అన్ని విద్యా సంస్థల్లోనూ ప్రమాణాలతో కూడిన విద్య వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు పేద విద్యార్థుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం తక్షణం రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు రూ. 3,061 కోట్ల చెల్లింపునకు ఆర్థిక శాఖకు ఆదేశం రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే బోగస్ విద్యా సంస్థలు ప్రభుత్వ సొమ్మును కాజేసే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ బోగస్ విద్యా సంస్థల వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కును కోల్పోతున్నారని పలు విచారణల్లో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఏది బోగస్ సంస్థో, ఏది అసలు సంస్థో తేల్చాలని నిర్దేశించారు. ‘‘అక్రమాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వాటి గుర్తింపును కూడా రద్దు చేస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సదరు బోగస్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని, వారిని ఇతర విద్యా సంస్థల్లో చేరుస్తామని పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రంలో పలు విద్యా సంస్థల్లోని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇప్పటిదాకా విద్యార్థులకు బకాయి పడిన రూ.3,061 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆయన ఆదేశించారు. ఆదర్శం... అక్రమార్కులపాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు తదితర విద్యా సంబంధిత అంశాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఇతర కులాల్లోని పేదలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. డాక్టర్లు, ఇంజనీర్లు తదితర ఉన్నత స్థాయి అవకాశాలను వారు అందిపుచ్చుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. ‘‘హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఇస్తున్న సన్న బియ్యం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా వర్తింపజేయాలని ఇప్పటికే నిర్ణయించాం. పేదలకు మంచి భోజనం, బట్టలు, పుస్తకాలు అందించడానికి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, మెస్ చార్జీల చెల్లింపుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ప్రభుత్వం పెట్టే ఈ ఖర్చు అక్రమార్కులపాలు కావడం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు’’ అని సీఎం అభిప్రాయపడ్డారు. సీఐడీ, విజిలెన్స్, ఏసీబీ, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా అనేక అక్రమాలు బయటపడ్డాయని ఆయనన్నారు. ‘‘ఇప్పటికే రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదు. బోగస్ విద్యా సంస్థలూ ఉన్నాయి. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలూ పూర్తి స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేలా చూసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుంది’’ అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి విద్యా సంస్థలన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ‘‘విద్యా సంస్థల్లో అధ్యాపకులున్నారా? ఫర్నిచర్ ఉందా? ఇతర సౌకర్యాలున్నాయా? లేబొరేటరీలున్నాయా? ఆయా విద్యా సంస్థల్లోని అడ్మిషన్లు నిజమైనవేనా, బోగసా? ఇలాంటి అన్ని విషయాలపైనా సమగ్ర విచారణ చేయండి. ప్రభుత్వ గుర్తింపుకు నిర్దేశించిన అర్హతలు, ప్రమాణాలు పాటిస్తున్నారా, లేదా కూడా గమనించండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్, జంటనగరాల పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఫీజులు కాటేస్తున్నాయ్!
రీయింబర్స్మెంట్ అందక విద్యార్థుల తిప్పలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కాలేజీలు సాక్షి, హైదరాబాద్: సురేష్ ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఎంటెక్ చేరేందుకు పీజీఈసెట్ రాసి పాసయ్యాడు. కానీ ఎంటెక్‌లో చేరలేని దుస్థితి. ఎందుకంటే బీటెక్ పూర్తిచేసిన సర్టిఫికెట్లను సదరు కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదు. 2014-15కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడమే దీనికి కారణం. 'ప్రభుత్వం 2014-15 నుంచి ఫీజులను కాలేజీలకు చెల్లించకుండా.. విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తామంటోంది. ఇప్పటికీ రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదు. మీరు సర్టిఫికెట్లు తీసుకెళ్లిపోతే మా పరిస్థితి ఏమిటి..?'అన్నది కాలేజీ నిర్వాహకుల వాదన. ఇక గత్యంతరం లేక సురేష్ తన తల్లి నగలు అమ్మి రూ.60వేలు చెల్లించి, సర్టిఫికెట్లు తీసుకున్నాడు. ఒక్క సురేష్ మాత్రమే కాదు.. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే కాదు.. రాష్ట్రంలో ‘ఫీజు’ పథకం కింద ఈ ఏడాది వివిధ కోర్సుల్లో ఫైనలియర్ పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థుల పరిస్థితి ఇది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక, పైస్థాయి కోర్సుల్లో చేరలేక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దీనిపై కాలేజీ యాజమాన్యాలనూ పూర్తిగా తప్పుపట్టలేని పరిస్థితి. సంవత్సరకాలంగా ప్రభుత్వం నయాపైసా విడుదల చేయకున్నా, అప్పులు తెచ్చి నడిపిస్తున్నామని యాజమాన్యాల వర్గాలు చెబుతున్నాయి. ఆరు నెలలుగా అనేక కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాల్లేవని, వారు కాలేజీల్లో సహాయ నిరాకరణకు దిగినా.. ఎలాగోలా నెట్టుకొస్తున్నామని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 17 నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ ప్రథమ సంవత్సర పరీక్షలను నిర్వహించబోమని కాలేజీలు తెగేసి చెప్పాయి. డబ్బులు కడితేనే జవాబు పత్రాలు ఇస్తామని జేఎన్టీయూ చెబుతుండగా.. ఫీజులే రాలేదు, అవి వచ్చాకే పరీక్షలు నిర్వహిస్తామని యాజమాన్యాలు అంటున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ జేఎన్టీయూ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌కు లేఖను అందజేశాయి. తప్పని ఇబ్బందులు.. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులతో పాటు కాలేజీల యాజమాన్యాలు, బోధన, బోధనేతర సిబ్బంది ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ బీటెక్ పూర్తిచేసిన వారు ఆందోళనలో కూరుకుపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో.. ఈ పథకం కింద బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మరోవైపు అధికారులు ఎంటెక్‌లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించారు. ఈనెల 14తో దీనికి గడువు కూడా ముగుస్తోంది. ఎంటెక్ ప్రవేశపరీక్ష అయిన పీజీఈసెట్‌లో 38,882 మంది అర్హత సాధించగా... అందులో కేవలం 16 వేల మందే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. వీరంతా ఫీజు రీయింబర్స్మెంట్ లేనివారు లేదా కాలేజీల్లో డబ్బు కట్టి సర్టిఫికెట్లు తె చ్చుకున్నవారే. మిగతా దాదాపు 23వేల మంది విద్యార్థుల పరిస్థితి గందరగోళమే. ఇటు ఫీజులు చెల్లించలేక, అటు సర్టిఫికెట్లు లేక వెరిఫికేషన్‌కు హాజరుకాలేక వారంతా ఆవేదనలో మునిగిపోయారు. అసలు ఎంటెక్ కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపు రాకుండానే, ఏయే కాలేజీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయన్న స్పష్టత లేకుండానే... ప్రవేశాల క్యాంపు అధికారులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టడం గమనార్హం. మొన్నటి వరకు దరఖాస్తులే.. 2014-15 విద్యా సంవత్సరం గత ఏప్రిల్ నెలాఖరుతోనే ముగిసింది. కానీ దానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ కోసం గత నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులే ఇప్పటిదాకా స్వీకరిస్తే.. ఆ ఫీజులు వచ్చేదెప్పుడన్న ప్రశ్న తలెత్తుతోంది. 2014-15కు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల కింద 7,47,168 మంది విద్యార్థులకు దాదాపు రూ.2,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఫైనలియర్ పూర్తయిన విద్యార్థులే 3లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. వారికోసం ఎంత ఇవ్వాలన్న లెక్కలు లేవు. కానీ రూ.300కోట్ల వరకు ఇస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. అవి ఏ మూలకు సరిపోవన్నది కాలేజీల వాదన. అసలు ఈ నిధులనైనా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఫైనలియర్ విద్యార్థులందరి ఫీజులను ఎప్పుడు చెల్లిస్తారన్న స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తయ్యాయి. పీజీ, వృత్తి విద్యా ప్రవేశాలు పూర్తికావచ్చాయి. కొంతమంది డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తె చ్చుకుంటే... మరికొంత మంది సర్టిఫికెట్లు తెచ్చులేక పైకోర్సుల్లో చేరలేకపోతున్నారు. అన్ని కోర్సుల్లోనూ.. - పేద కుటుంబానికి చెందిన రమ్య ఖమ్మంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో 2014-15లో బీఎస్సీ పూర్తి చేసింది. ఇప్పుడు బీఈడీలో చేరాలనుకుంది. కానీ కాలేజీ యాజమాన్యం డిగ్రీ ఫైనలియర్ ఫీజు రూ.10వేలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటోంది. ఈనెల 20వ తేదీ నుంచి బీఈడీలో ప్రవేశాలు ప్రారంభం కాబోతుండడంతో ఆందోళనలో మునిగిపోయింది. ►నల్లగొండ జిల్లాలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసిన శ్రీధర్ ఎంటెక్‌లో చేరాలనుకున్నాడు. కానీ 'ఫీజు' అందక యాజమాన్యం బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయాడు. ► సిద్దిపేటలోని ఓ డిగ్రీ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ పూర్తిచేసిన రాజేశ్‌కు ఫైనలియర్ ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో... పీజీ కౌన్సెలింగ్‌కు హాజరుకాలేక విద్యా సంవత్సరం నష్టపోయాడు. -
10 వేల ర్యాంకు వరకు రీయింబర్స్మెంట్ సవరణ
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం * ఎస్సీ, ఎస్టీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు * 5వేల ర్యాంకు వరకే పరిమితం చేస్తూ జూన్ 30న జారీ చేసిన మెమో రద్దు * పాత విధానాన్నే కొనసాగించాలని సీఎంను కోరిన మంత్రులు, ఎమ్మెల్యేలు * పథకాన్ని కుదిస్తే విపక్షాలు వ్యతిరేక ప్రచారం చేస్తాయని వెల్లడి * అంగీకరించిన సీఎం .. సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల్లో 10 వేల ర్యాంకు వరకు వచ్చిన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనుంది. ఎస్సీ, ఎస్టీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా సవరణ ఉత్తర్వులు (మెమో నంబర్: 568-3/ఎస్సీడీ. ఎడ్యుకేషన్/2014-6)ను జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను 5 వేల ర్యాంకు వచ్చిన విద్యార్థుల వరకే పరిమితం చేస్తూ జూన్ 30న ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారు. దీనిపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఫీజుల పథకాన్ని కుదించడంపై వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఈ అంశాన్ని కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. నిర్ణయాన్ని మార్చాలని కోరారు. గతంలో మాదిరి 10 వేల ర్యాంకు వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించినా రూ.200 కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందని, అందువల్ల పాతవిధానాన్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 5 వేల ర్యాంకు వరకే పరిమితం చేస్తే బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఫలాలు అందడం లేదని ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశాలున్నాయని కేసీఆర్‌కు వివరించినట్టు తెలిసింది. దీంతో 10 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేలా సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానిక తెలంగాణ విద్యార్థులకే రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 371(డి) ప్రకారం తెలంగాణకు చెందిన స్థానిక విద్యార్థులకే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం క్వాలిఫై అయిన కోర్సుకు ముందు విద్యార్థులు గత ఏడేళ్ల విద్యాభ్యాసానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని, అప్పుడే స్కాలర్‌షిప్‌లకు అర్హులవుతారని పేర్కొంది. స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విద్యార్థుల అలాట్మెంట్ లెటర్లపై ఎంసెట్ కన్వీనర్ ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపింది. సీట్ల కేటాయింపు సందర్భంగా ఈ నిబంధనను పాటించాలని ఎంసెట్ కన్వీనర్‌ను ఆదేశించింది. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు ఇలా... - ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ర్యాంకుతో సంబం ధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. - కార్పొరేట్ కాలేజీ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వం స్పాన్సర్ చేసిన విద్యార్థులతోపాటు ప్రభుత్వ, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులందరూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హులు. - ఎస్సీ, ఎస్టీలు, 10 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు కాకుండా మిగతా విద్యార్థులకు.. ఆయా కాలేజీల్లో వసూలు చేసే ఫీజుతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.35 వేల ఫీజు లేదా కాలేజీ ఫీజు (ఏది తక్కువ అయితే అది) రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. - ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ సెకండియర్ అడ్మిషన్లు పొందే వారిలో వెయ్యిమంది విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ చేస్తారు. -
‘ఈఎస్ఐ’ వ్యవహారంపై వివరణ ఇవ్వండి
* సాక్షి కథనంపై స్పందించిన హెచ్ఆర్సీ * సుమోటోగా కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు పడుతున్న నరకయాతనపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఈఎస్ఐ రోగుల నరకయాతన’పై మానవహక్కుల కమిషన్ స్పందిం చింది. ఈ మేరకు మానవహక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్ పెదపేరిరెడ్డి సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. రీయింబర్స్మెంట్, మందుల సరఫరాదారుల అక్రమాలపై ఆగస్టు 19లోగా వివరణ ఇవ్వాలని ఈఎస్ఐ డెరైక్టర్, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీచేశారు. కాగా, ఈ వ్యవహారంపై ఈఎస్ఐ డెరైక్టర్ కె.మల్లేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈఎస్ఐ రోగులకు వైద్యబిల్లులు చెల్లించే విధానం మారినందు వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని, జూలై 1 నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గతంలో రోగుల వైద్య బిల్లులు ఈఎస్ఐ కార్పొరేషన్ చెల్లించేదని, 2015 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర పరిధిలో ఉండే ఈఎస్ఐ కార్పొరేషన్, రాష్ట్ర పరిధిలో ఉండే డెరైక్టరేట్లకు బదిలీ అయిందని చెప్పారు. ఈ నిధులను సాధారణ ఖాతాల్లోకి మార్చి, చెల్లింపులు జరిపేందుకు కొద్దిగా సమయం పట్టిందని పేర్కొన్నారు. అయితే 2015 ఏప్రిల్ 1 నుంచి సమస్య ఉందని డెరైక్టర్ చెబుతుండగా.. గతేడాది జూలై, ఆగస్టు బిల్లులు కూడా ఇప్పటి వరకు చెల్లింపులు జరగకపోవడం గమనార్హం. -
స్థానిక విద్యార్థులకే రీయింబర్స్మెంట్
రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా మెమో జారీ నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ! ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక విద్యార్థులకు మాత్రమే దీనిని వర్తింపజేసేలా ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన విద్యార్థులకే 2014-15 విద్యా సంవత్సరానికి రీయింబర్స్మెంట్ వర్తించేలా ఆదేశాలిచ్చింది. స్కాలర్‌షిప్‌లకు విద్యారులు ఈ-పాస్ వెబ్సైట్ http://epass .cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని సంక్షేమశాఖలు, సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ను ఆదేశించింది. ఈ మేర కు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మెమో జారీ చేశారు. వీలైతే బుధవారం నుంచే దరఖాస్తు చేసుకునేందుకు వీలుకల్పంచనున్నారు. అంతగా కాకపోతే ఒకటి, రెండురోజుల వ్యవధిలోనే ఈ-పాస్ ద్వారా రిజిస్ట్రేషన్లను చేపట్టనున్నారు. 2014-15 సంవత్సరానికి పోస్ట్మెట్రిక్స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 371-డీకి అనుగుణంగా స్థానికత నిబంధనను అనుసరించి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన స్థానిక విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సీ అభివృద్ధిశాఖ, గిరిజనసంక్షేమశాఖ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, వికలాంగుల సంక్షేమ, సీనియర్ సిటిజన్స్శాఖల కమిషనర్/డెరైక్టర్లు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయంలో బీసీ సంక్షేమశాఖ డెరైక్టర్, డీడీలు, డీబీసీడబ్ల్యూలు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధా విడిగా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేయనున్నారు. ఈ వర్గాలకు చెందినవారు 2013-14లో 14.30 లక్షల మంది విద్యార్థులుండగా, 2014-15లో కొంచెం అటూఇటూగా 13 లక్షల వరకు ఈ విద్యార్థుల సంఖ్య ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న డిగ్రీ లేదా పీజీ కంటే గత ఏడేళ్లలో ఎక్కడ విద్యను అభ్యసించారో ఆయా సర్టిఫికెట్లు, వివరాలను వారి దరఖాస్తులతోపాటు పొందుపరచాల్సి ఉంటుంది. -
ఫీజులు వచ్చాయోచ్
* జిల్లాకు రూ. 11.93 కోట్లు * రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు * వారం రోజులలో విద్యార్థుల ఖాతాలలోకి * 30 శాతం మాత్రమే విడుదల * మిగతావి రెండో దశలో! ఇందూరు : పేద విద్యార్థుల చదువులకు లైన్ క్లియరైంది. తెలంగాణ విద్యార్థులకే ఫాస్ట్ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పి ఇన్నాళ్లు స ందిగ్ధంలో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది. దీంతో ఇన్ని రోజులుగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 15 రోజుల క్రితమే రాష్ర్టవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా నిధు లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు నిధులను కేటాయిస్తూ శనివారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కలిపి మొత్తంగా జిల్లాకు రూ.11.93 కోట్లను మంజూరు చేశారు. అయితే, జిల్లాకు రూ. 30.50 కోట్లు అవసరం ఉం డగా మొదటి దశగా 30 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగతావి ఒకటి లేదా రెండు దశలలో వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 1400 మంది ఎస్సీ విద్యార్థులకు రూ. 3 కోట్లు అవసరం ఉండగా, రూ.1. 28 కోట్లు విడుదలయ్యాయి. 7,500 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.3.50 కోట్లు అవసరం కాగా, రూ.1.65 కోట్లు, బీసీ, ఈబీసీలలో 51వేల మంది విద్యార్థులకు రూ.24 కోట్లు అవసరం ఉండగా రూ. 9 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను జిల్లా సంక్షేమాధికారులు మొదటగా స్వీకరించి, తరువాత బిల్లులను ట్రెజరీకి అందజేస్తారు. వారు బిల్లులను పాస్ చేసి బ్యాంకులలో వేస్తారు. బ్యాంకు నుంచి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల ఖాతాలలో జమ అవుతాయి. ఇందతా జరగడానికి వారం, పది రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.