ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
పాపను బతికిస్తున్న పింఛన్
థలసేమియా వ్యాధితో బాధ పడుతున్న నా కుమార్తె రక్షితకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి నెలా రూ.10 వేలు పింఛన్ అందిస్తున్నారు. నా కుమార్తె రక్షిత ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఐదు నెలల వయస్సులో పాప అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళితే ఎనిమిదో నెల వయసులో థలసేమియాగా వైద్యులు నిర్ధారించారు. నా భర్త రవికుమార్ వ్యవసాయ కూలీ.
ఇంతకు ముందు ఆటో ఉండేది. పాప వైద్యం కోసం అమ్మేశాం. ప్రస్తుతం పాప వయస్సు 11 ఏళ్లు. నెలకు రెండుసార్లు బీ పాజిటివ్ రక్తం ఎక్కించాలి. మందులు, రక్తమార్పిడికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. సీఎంగా జగనన్న అధికారంలోకి రాగానే పాపకు నెలకు రూ.10 వేలు పింఛన్ అందించారు. పాప బతికి ఉండడానికి కారణం సీఎం జగనన్నే. ఆయన రుణం తీర్చుకోలేం. నాకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ అయింది. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. పాపకు బోన్‌మ్యారో శస్త్ర చికిత్స చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీఎం జగన్‌నే నమ్ముకున్నాం. – కాంతామణి, వాలమర్రు (కె.శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్)
ఈ మేలును మరచిపోం
మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామం. నా భర్త కడాలి వెంకట రమణ 20 ఏళ్ల కిందటే మృతి చెందారు. నాకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఐదుగురికి వాహాలయ్యాయి. కుమారులు ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆడపిల్లలు ఇక్కడే ఉంటున్నారు. నా భర్త మరణానంతరం వైఎస్సార్ ప్రభుత్వంలో నాకు పింఛన్ మంజూరైంది. ప్రతి నెలా రూ.3 వేలు వస్తోంది.
నా కుమార్తెలు ముగ్గురికీ అమ్మ ఒడి కింద ఏటా రూ.15,000 చొప్పున అందుతోంది. వీటితోపాటు వీరికి ఆసరా, చేయూత పథకాలు వర్తిస్తున్నాయి. ఈ ప్రభుత్వం నిర్ణయాల వల్ల మాలాంటి పేదలు హాయిగా జీవిస్తున్నారు. పిల్లల చదువులకు దిగుల్లేకుండా పోయింది. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి ప్రభుత్వమే అండగా నిలిచింది. ఆసరా, చేయూత పథకాల ద్వారా వచ్చిన సొమ్ముతో ఎంతో మంది సొంత కాళ్లపై నిలబడటం ఊరూరా కనిపిస్తోంది. ఇంత మేలు చేసిన సీఎం జగన్‌ను ఎవరు మరచిపోతారు? – కడాలి రాములమ్మ, ప్రత్తిపాడు (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్)
అప్పులబారి నుంచి బయటపడ్డాం
మాది డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామం. నిరుపేద రజకుల కుటుంబం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు మాకు అందడంతో జీవనం హాయిగా సాగుతోంది. నాకు, నా కూతురికి ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలు వైఎస్సార్ ఆసరా అందింది. చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75,000 అందాయి. జగనన్న చేదోడు కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందించారు.
నా భర్తకు ప్రతి నెలా రూ.3 వేలు పింఛన్, మా అమ్మాయికి వికలాంగ పింఛన్ రూ.3 వేలు అందుతోంది. మా వలంటీర్ మాతో అన్నీ పూర్తి చేయించి ఈ సంక్షేమ పథకాలు అందేలా చేశారు. పథకాలతో వచ్చిన ఆర్థిక సాయంతో పాడి పశువులు పెంచుకుంటూ లబ్ధి పొందుతున్నాం. అప్పులు తీర్చుకున్నాం. సీఎం జగన్ చేసిన మేలు మరచిపోలేం. – నందంపూడి సత్యవతి, గొల్లవిల్లి(నల్లా విజయ్‌కుమార్, విలేకరి, ఉప్పలగుప్తం
Comments
Please login to add a commentAdd a comment