ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
పైసా ఖర్చు లేకుండా లక్షల విలువైన చికిత్స
గుంటూరు కలెక్టరేట్ ఆవరణలో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ విక్రయిస్తే గానీ కుటుంబ పోషణ జరగదు. దాదాపు 33 ఏళ్లుగా ఇదే నా దినచర్య. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టీ బండిపై వచ్చే ఆదాయంతోనే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాను. చిన్నమ్మాయి డీ ఫార్మా పూర్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఉన్నట్టుండి నాకు నరాల సమస్య వచి్చంది. నిలబడలేని పరిస్థితి ఏర్పడింది.
దిక్కుతోచని స్థితిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాం. రోజుకు 5 ఇంజక్షన్లు చొప్పున 5 రోజులపాటు కోర్సు వాడాలని వైద్యులు చెప్పారు. ఇంజక్షన్ల కోసమే రూ.4 లక్షలకు పైగా వెచి్చంచాలని, వైద్యానికి అదనంగా ఖర్చవుతుందని చెప్పారు. అసలే అంతంత మాత్రపు బతుకులు కావడంతో వైద్యానికి అంతమొత్తం చెల్లించుకోలేక దిగులు చెందాం.
ఆ సమయంలో సచివాలయ అధికారుల ద్వారా ఆరోగ్య శ్రీ కార్డును తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రను కలవడంతో తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీపై 25 ఇంజక్షన్లకు రూ.1.40 లక్షలు మంజూరు చేశారు. 5 రోజులు 25 ఇంజక్షన్లు చేయడంతో నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆరోగ్యశ్రీ ఉండడం వల్లే ఖరీదైన చికిత్స ఉచితంగా చేశారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ చిన్నగా నడవడం ప్రారంభించాను. తర్వాత తిరిగి టీ వ్యాపారం చేసుకుంటున్నాను. – మహ్మద్ బాజీత్ ఖాన్, మహబూబ్ నగర్, ఏటీ అగ్రహారం, గుంటూరు (ఎస్‌కే సుభాని, విలేకరి, లక్ష్మీపురం గుంటూరు)
ఒంటరిగా ఉన్న నన్ను ప్రభుత్వమే ఆదుకుంది
నా భర్త అనారోగ్యంతో చాలా కాలం క్రితమే మృతి చెందాడు. నాకు ఒకే కూతురు. ఆమె కూడా చనిపోయింది. అల్లుడు, వారి పిల్లలు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో నేను ఒంటరిగా నివసిస్తున్నాను. కూలి పనులకు వెళ్లి సంపాదించుకునేందుకు వయసు, ఆరోగ్యం సహకరించడం లేదు.
ఈ సమయంలో నా అదృష్టం కొద్దీ వైఎస్ జగన్ ప్రభుత్వం రావడంతో దరఖాస్తు చేసిన వెంటనే వృద్ధాప్య పింఛన్ మంజూరైంది. ఆరి్థకంగా ఇతరత్రా ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కేవలం పింఛను సొమ్మే నాకు ఆధారంగా మారింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లారేసరికి రూ.2,750 నా చేతిలో పెడుతున్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉండడంతో ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు. అనారోగ్య సమస్యలు వస్తే ఉచితంగానే మందులు ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి పింఛన్ రూ.3 వేలు ఇస్తారంట. నాలాంటి ఒంటరి మహిళలకు పింఛను సొమ్ము ఎంతో భరోసాగా నిలుస్తోంది. ప్రస్తుతం నేను పూరి గుడిసెలో ఉంటున్నాను. మా ఊరు పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్నందున, నిర్వాసితులందరికీ వేరే చోట ఇళ్లు కట్టిస్తున్నారు. – బిత్తరి సత్యవతి, చింతూరు (మొహమ్మద్ షౌఖత్ అలీ, విలేకరి, చింతూరు)
సర్కారు సాయంతో హాయిగా వ్యవసాయం
మాది వ్యవసాయాధారిత కుటుంబం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం యండవల్లి గ్రామంలోని మా పొలంలో వరి, పామాయిల్ పంటలు పండిస్తుంటాను. ప్రతిసారీ పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. పంటలు సరిగ్గా పండనప్పుడు, పరిస్థితులు అనుకూలించనప్పుడు అప్పు తీర్చలేక మాటలు పడాల్సి వచ్చేది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక రైతులకు ఆరి్థక భరోసా కల్పించడం ఊరటనిస్తోంది.
గత నాలుగేళ్లుగా ఏడాదికి రూ.13.500 చొప్పున మొత్తం రూ.54 వేలు రైతు భరోసా కింద నా ఖాతాలో జమయ్యాయి. ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం ఒక ఎత్తు అయితే, వాటిని అమలు చేయడం మరో ఎత్తు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక ఒక్క రూపాయి లంచం, రాజకీయ నేతల సిఫార్సులు లేకుండానే లబ్ధి దారునికే నేరుగా ఫలాలు అందుతున్నాయి. అర్హత ప్రాతిపదికగా నాకు లబ్ధి చేకూరింది. ఇలా ఏ ప్రభుత్వం ఆదుకోలేదు.
ఇప్పుడు ప్రతి రైతు ధైర్యంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నాడు. రైతు భరోసా కేంద్రాల వల్ల అన్నీ గ్రామంలోనే అందుతున్నాయి. అధికారులు మా చెంతకే వచ్చి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పంట వేసిన నాటి నుంచి పంటలు అమ్ముకునే వరకు అండగా ఉంటున్నారు. ఉద్యానవన పంటల్లో భాగంగా జాజికాయ, జాపత్రి, పామాయిల్‌లో అంతర పంటలు వేయడంతో ఉద్యానవన శాఖ పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. పలు రాయితీలు కలి్పస్తున్నారు. – గుండ్ర అంబయ్య, యండపల్లి (ఎం.వి.వి.రమణ, విలేకరి, కొత్తపల్లి)
Comments
Please login to add a commentAdd a comment