
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
వస్త్ర వ్యాపారంతో నిశ్చింత
మా స్వస్థలం ఒడిశాలోని బరంపురం. నా భర్త ప్రశాంత్‌కుమార్ పండిట్ పౌరోహిత్యం చేస్తారు. మా వివాహం తర్వాత బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి విశాఖపట్నం వచ్చాం. పాపయ్యరాజుపాలెంలోని ఎన్‌ఏడీలేఅవుట్లో పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఆదాయం అంతంత మాత్రమే. ఇద్దరు ఆడ పిల్లలకు మా దగ్గర ఉన్న దాంతోపాటు కొంత అప్పులు చేసి పెళ్లిళ్లు చేశాం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు ఇస్తామంటే రూ.25 వేలు కట్టాం. కానీ ఇల్లు రాలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు వైఎస్సార్ చేయూత ద్వారా విడతకు రూ.18,500 చొప్పున అందించింది. గత ప్రభుత్వ హయాంలో కట్టిన రూ.25 వేలు ఈ ప్రభుత్వం వెనక్కి ఇచ్చింది. అంతేకాకుండా జగనన్న చేదోడు పథకంలో రూ.10 వేలు వచ్చింది. మొత్తం నగదు కూడబెట్టుకుని ఇంట్లోనే వ్రస్తాల అమ్మకం ప్రారంభించాను. ప్రస్తుతం వ్యాపారం చాలా బాగుంది. దీంతోపాటు సబ్బవరం మండలం పైడివాడ వద్ద జగనన్న కాలనీలో స్థలం మంజూరైంది. త్వరలో ఇల్లు కట్టుకుంటాం. – ప్రసన్న పండిట్, విశాఖపట్నం (సమ్మంగి భాస్కర్, విలేకరి, పెందుర్తి)
సర్కారు ‘దీవెన’తో ఉద్యోగం
మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. నాన్న మధుసూదన మృతి చెందారు. అమ్మ నాగలక్ష్మి కుట్టు మిషన్‌పై దుస్తులు కుడుతూ నాతో పాటు తమ్ముడు సాత్విక్‌ను ఇంటరీ్మడియట్ చదివిస్తోంది. అమ్మ సంపాదన నెలకు అయిదారు వేలు మాత్రమే. చాలీచాలని సంపాదనతో రూ.3 వేలు ఇంటి అద్దె చెల్లిస్తూ ఇద్దరినీ చదివించడం అమ్మకు తలకు మించిన భారమైంది. మేమూ బెంగపెట్టుకునేవాళ్లం. అయితే కష్టాలకు ఎదురీది పైకి రావాలని పట్టుదల పెరిగింది. బాధలన్నీ పక్కన పెట్టి చదివాను. ఎంసెట్‌లో 10 వేలలోపు ర్యాంకు రావడంతో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చింది.
కళాశాల ఫీజు ఏటా రూ.70 వేలు. ఇంత పెద్ద కళాశాలలో చదవడం మాలాంటి పేదలకు కష్టమే. ఈ తరుణంలో సీఎం జగన్ తోడబుట్టిన అన్నలా ఆదుకున్నారు. కళాశాల ఫీజు మొత్తాన్ని జగనన్న విద్యాదీవెన పేరుతో అందించడంతో బీటెక్ ఫైనల్ ఇయర్‌కు చేరుకున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూ.2.8 లక్షలు విడుదల అయ్యింది. కళాశాలలో జరిగిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఆక్సెంచర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఏడాదికి రూ.4.5 లక్షలు జీతం ఇవ్వనున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే ఉద్యోగం సంపాదించుకోవడం కేవలం జగనన్న అందిస్తున్న ఆర్థిక చేయూత వల్లే సాధ్యమైంది. – మురారి జ్ఞానసిరి తేజిత, బీటెక్ (ఈసీఈ) (జి.రాజశేఖర్ నాయుడు, విలేకరి, కర్నూలు)
వైఎస్సార్ బీమాతో ఉపాధి దొరికింది
కుటుంబ పెద్ద మృతితో మా జీవనం దుర్లభంగా మారింది. ఈ స్థితిలో వైఎస్సార్ బీమా మా కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. నా పేరు వేముల సుమన్ బాబు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామం. నాన్న జగ్జీవన్ రావు గొర్రెల కాపరి. ఓ రోజు మా ఊళ్లో ఉన్న కుమ్మరికుంట చెరువులో ఓ గొర్రె పిల్ల పడిపోయింది. దానిని కాపాడేందుకు నాన్న అందులోకి దిగాడు.
దానిని బయటకు తీసే క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో మునిగి చనిపోయాడు. ఆయన ఆకస్మిక మరణం మా కుటుంబానికి తీరని వేదనను మిగిలి్చంది. మా అమ్మ, నాన్న నా చిన్నతనంలోనే విడిపోయారు. నా భార్య, నేను, నాన్న కలిసి ఉండేవాళ్లం. నేను వ్యవసాయ పనులు చేస్తూ జీవనం కొనసాగించేవాడిని. నాన్న ప్రమాదవశాత్తు మృతి చెందడంతో వైఎస్సార్ బీమా కోసం సచివాలయ సిబ్బంది నాతో దరఖాస్తు చేయించారు.
కేవలం 30 రోజుల వ్యవధిలోనే నా బ్యాంకు ఖాతాలో రూ.4.90 లక్షలు జమైంది. బీమా సొమ్ము ఇచ్చి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నా కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చింది. వ్యవసాయ కూలి పనులు మానేసి నాన్న పేరుతో ఆటో కొనుగోలు చేసుకొని నడుపుకుంటున్నా. చెల్లికి కొంత డబ్బులు సర్దుబాటు చేశాను. ఇప్పుడు ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నాం. – వేముల సుమన్ బాబు, కొమ్మూరు ధూపాటి ప్రకాష్, విలేకరి, నెహ్రూనగర్ (గుంటూరు)
Comments
Please login to add a commentAdd a comment