ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మా బతుకులు మార్చిన సర్కారు
మాది అరకొర ఆదాయంతో జీవించే కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఒడిదొడుకుల జీవనం గడపాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆర్థిక పరిస్థితి ఎంతో మారిపోయింది. మేము విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలసలో ఉంటున్నాం. డ్వాక్రా గ్రూప్ సభ్యురాలినైన నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.40 వేలు వచ్చింది. నా కుమారుడు శ్యామ్ సందీప్‌కు స్కూల్‌లో ట్యాబ్ ఇచ్చారు. కుమార్తె జెస్సికాకు అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వచ్చింది.
నా భర్త చంటికి సెర్ప్ ద్వారా ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం రూ.3.30 లక్షలు వచ్చింది. వాహనమిత్ర ద్వారా ఏటా రూ.10 వేలు వంతున లబ్ధి కలిగింది. మా అత్త సరస్వతికి పెన్షన్ కానుక అందుతోంది. పద్మనాభం మండలం కురపల్లిలో 78 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం అందించిన ఆర్థి క సాయంతో దుస్తుల వ్యాపారం చేస్తున్నా. నెలకు రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు మేమంతా సంతోషంగా ఉన్నాం. ఇందుకు కారణమైన జగనన్న రుణం తీర్చుకుంటాం. – పందిరి లక్ష్మి, మజ్జివలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస)
ఒంటరి బతుక్కు అండగా నిలిచారు
నేను ఒంటరి మహిళను. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ పరిధిలోని కొత్తపేటలో నివాసం ఉంటున్నా. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నా బతుకు చిత్రం మారింది. జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సాయంతో ఇప్పుడు నేను సంతోషంగా జీవిస్తున్నా. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 ఆర్థి క సహాయం అందుతోంది.
రజకులకు ప్రభుత్వం అందిస్తున్న చేదోడు పథకం ద్వారా రూ.10 వేలు అందుతోంది. ఒంటరి మహిళ పింఛన్ రూ.3 వేలు ప్రతి నెలా వలంటీర్ ఇంటికి తీసుకువచ్చి ఇస్తోంది. దీంతోపాటు ఇంటి బయట బడ్డీ పెట్టుకుని ఇస్త్రీ పెట్టె కొనుక్కొని.. బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ కొంత సంపాదిస్తున్నా. మాలాంటి పేదోళ్లకు, భర్త లేని వారికి, ఒంటరి మహిళలకు జగనన్న అందిస్తున్న సాయం మరువలేనిది. ఆయన రుణం తీర్చుకోలేనిది. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పథకాలు ఏవీ అందలేదు. జగనన్న రుణం తీర్చుకోలేనిది. – ఉంగుటూరు లక్ష్మి, పోలవరం (వ్యాఘ్రేశ్వరరావు, విలేకరి, పోలవరం రూరల్)
ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాం
మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఈ ప్రభుతం వచ్చాక వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.10,950,డ్వాక్రా రుణం రూ.లక్ష, స్త్రీనిధి కింద రూ.50 వేలు వచ్చింది. దీంతో మా గ్రామంలో నేను, నా భర్త రామచంద్రరావు దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మాకు శివ, పవన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరికీ వివాహాలు కావడంతో వారు రోజువారీ పనులు చేసుకుంటూ వారి బతుకులు వారు బతుకుతున్నారు.
మా మనవళ్లకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. డ్వాక్రా రుణంతో దుకాణం పక్కనే చిన్న ఇల్లు కట్టుకొని కాపురం ఉంటున్నాం. ఈ ప్రభుత్వంలో వచ్చిన పథకాలతో ఆర్థి క ఇబ్బందులు తీరి ఆనందంగా జీవిస్తున్నాం. – సాలారపు సత్యవతి, పెద్దిపాలెం (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్)
Comments
Please login to add a commentAdd a comment