ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చాం
నా భర్త కూలి పని చేస్తుంటాడు. పని లేనప్పుడు చేపలు పట్టుకోవడానికి వెళ్తుంటాడు. మాకు ఇద్దరు అమ్మాయిలు. మాకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా అని ఎంతో సతమతం అయ్యాం. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు సంక్షేమ పథకాలు వరమయ్యాయి. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున మూడు విడతల్లో రూ.56,250 వచ్చింది. పెద్ద కుమార్తెకు గతంలోనే పెళ్లయింది. చిన్నమ్మాయికి ఈ మధ్యే పెళ్లి చేశాం. పెళ్లికి ముందు ఆ పాపకు అమ్మఒడి ద్వారా రెండేళ్లపాటు రూ.15 వేల చొప్పున లబ్ధి చేకూరింది.
పెళ్లిచేసే సమయంలో బంధువులు, వలంటీర్లు జగనన్న ప్రభుత్వంలో కళ్యాణమస్తు ద్వారా సాయం లభిస్తుందని చెప్పారు. దీంతో కల్యాణమస్తుకు దరఖêస్తు చేశాం. పెళ్లయిన మూడు నెలల్లోనే కల్యాణమస్తు ద్వారా రూ.లక్ష వచ్చింది. ఆ మొత్తంతో పెళ్లికి చేసిన అప్పు తీర్చేశాం. త్వరలో టిడ్కో ఇల్లు చేతికి రానుంది. ప్రస్తుతం హాయిగా జీవిస్తున్నాం. ఇంతలా ఆదుకున్న జగనన్న ప్రభుత్వం పదికాలాల పాటు చల్లగా ఉండాలి. – గెడ్డం రత్నం, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా (తోట రాంబాబు, విలేకరి, పాలకొల్లు సెంట్రల్)
మా బతుకులు బాగుపడ్డాయి
మాది చాలా పేద కుటుంబం. కూలి పని ద్వారా నా భర్త భాస్కరరావు తెచ్చే ఆదాయంతోనే కుటుంబ పోషణ సాగుతోంది. వచ్చిన అరకొర ఆదాయంతో బాపట్ల జిల్లా చినగంజాం జిల్లా సొపిరాలకు చెందిన మాకు.. ఉన్న ఒక్క కుమారుడిని బాగా చదివించగలమా.. అన్న భయం వెంటాడేది. అలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి రూ.15 వేలు చొప్పున నా ఖాతాలో నగదు జమ చేశారు.
ఆ మొత్తంతో పిల్లాడిని చక్కగా చదివించుకోగలిగాం. ఈ ఏడాదే బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన పథకం వర్తించింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాకు ఇప్పటి వరకు రూ.2 లక్షలు అందింది. జగనన్న కాలనీలో మాకు స్థలం మంజూరు చేశారు. ఇల్లు కూడా మంజూరైంది. త్వరలో నిర్మాణ పనులు చేపడతాం. మా పరిస్థితి ఇప్పుడు బాగా మెరుగు పడింది. మమ్మల్ని ఈ పరిస్థితికి చేర్చిన ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – పర్వతరెడ్డి శివపార్వతి, సొపిరాల (పల్లపోలు శ్రీనివాసరావు, విలేకరి, చినగంజాం)
ఇంటికల సాకారమైంది
రోజూ పనికి వెళ్తే తప్ప మాకు పూట గడిచేది కాదు. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గొట్లగట్టులో ఇల్లు కట్టుకోవాలనేది మా చిరకాల కోరిక. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో స్థలం మంజూరు చేయాలని ఎన్నోమార్లు విజ్ఞాపన పత్రాలు అందించాం. కానీ మంజూరు కాలేదు. స్థానిక నాయకులను ఎన్నిసార్లు ప్రాధేయపడినా మాపై జాలి చూపలేదు. ఈ సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం నియమించిన వలంటీర్ మా దగ్గరకు వచ్చి ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పారు.
సచివాలయంలో దరఖాస్తు చేశాము. నెల రోజులు గడవక ముందే నా పేరున స్థలం, ఇల్లు మంజూరైందని సమాచారం వచ్చింది. నా సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఇల్లు మంజూరు పత్రాన్ని స్వయంగా నాకు అందించారు. వెంటనే ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి మేము కొంత డబ్బు జమ చేసుకుని సొంతంగా ఇల్లు నిరి్మంచుకున్నాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాకు ఏటా రూ.18,750 వంతున అందుతోంది. నా కుమారుడికి చదువుకు అమ్మ ఒడి పథకం ఏటా రూ.15 వేలు ఇస్తున్నారు. ఇన్ని విధాలుగా మేలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ మరచిపోము. – సుంకేసుల కళావతి, గొట్లగట్టు (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల)
Comments
Please login to add a commentAdd a comment