ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ధైర్యంగా సాగు చేస్తున్నా
వ్యవసాయమే మా జీవనాధారం. సొంత భూమి లేకున్నా పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం, తూర్పుపాలెం గ్రామంలో వేరే వారి వద్ద నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పదేళ్లుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. మాలాంటి కౌలు రైతులకు గత ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదు. అతివృష్టి, అనావృష్టి వంటివి సంభవించినప్పుడు పంట నష్టపోయినా భూ యజమానికి కౌలు చెల్లించాల్సి వచ్చేది.
ఇలా నేను చాలా నష్టపోయాను. దీనివల్ల చాలా అవస్థలు పడేవాడిని. చివరకు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి వచి్చంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మా బాధలు తీరాయి. కౌలు కార్డుతో రైతు భరోసా సాయం అందుకుంటున్నా. వివిధ దశల్లో రూ.50 వేలకు పైగా సహాయం పొందాను. ఏ దిగులూ లేకుండా ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నా.
రైతు భరోసా కేంద్రం ద్వారా అందించే సాంకేతిక సహాయం పొందుతూ ఉత్సాహంగా వ్యవసాయం చేస్తున్నా. నా భార్యకు వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వస్తోంది. ఈ సొమ్మును కూడా వ్యవసాయ పెట్టుబడికి వినియోగిస్తున్నాం. ఇంత సాయం చేసిన జగనన్నను ఎలా మరచిపోగలం? – గొట్టుముక్కుల ఏసురత్నం, తూర్పుపాలెం (బి.చిట్టిబాబు, విలేకరి, పోడూరు)
అప్పుల ఊబి నుంచి బయటపడ్డాం
మా ఆయన వీధుల్లో తిరిగి ఉల్లిపాయలు విక్రయిస్తుంటాడు. మంగళగిరి గండాలయపేట కొండపై గుడిసె వేసుకుని మేము జీవిస్తున్నాం. మా ఆయన అరకొర సంపాదనే మా కుటుంబానికి జీవనాధారం. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాం. వారు అత్తారిళ్లల్లో ఉంటున్నారు. ఇప్పుడు మేమిద్దరమే గుడిసెలో ఉంటున్నాం. కొన్నేళ్ల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి వెళ్లాం.
వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పడంతో ది్రగ్బాంతికి గురయ్యాం. కిడ్నీ సమస్య అంటే చికిత్స ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఏం చేయాలో పాలుపోక సతమతం అయ్యాం. ఆస్పత్రి ఖర్చులు, కుటుంబం గడిచేందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. అంతలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ చేయడంతో పాటు ప్రతి నెలా రూ.10 వేలు పెన్షన్ ఇస్తుండడంతో అప్పులు చేయాల్సిన అవసరం రాలేదు. ఆరి్థక ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నాం. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ పెన్షన్ కానుక మాలాంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. – గడ్డం లక్షి్మ, గండాలయపేట, మంగళగిరి (ఐ.వెంకటేశ్వరరెడ్డి, విలేకరి, మంగళగిరి)
వంకరపోయిన వేళ్లకు ఉచితంగా శస్త్రచికిత్స
గతేడాది ఆగస్టులో మా బంధువుతో కలసి మా అబ్బాయి కటారి చరణ్‌కుమార్ విశాఖ జిల్లా భీమిలి నుంచి తగరపువలసకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కుడి చేయి రోడ్డుకు బలంగా తాకడంతో మూడు వేళ్లు బాగా దెబ్బ తిన్నాయి. స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచాను. సరైన వైద్యం అందక వేళ్లు వంకరపోయాయి. తగరపువలస సమీపంలోని చిట్టివలస జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాబు వంగిన చేతి వేళ్లతో ఏమీ రాయలేకపోయేవాడు. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాయడం ఎలా అని భయపడ్డాం.
ప్రైవేటు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స చేయిద్దామంటే శస్త్రచికిత్సకు రూ.లక్ష అడిగారు. కార్పెంటర్ పనులు చేసుకునే నాకు ఇది చాలా పెద్ద మొత్తం. ఈ ప్రభుత్వ పుణ్యమా అని సంగివలస ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నవంబర్ 29న ఉచితంగా శస్త్రచికిత్స చేసి వేళ్ల వంకర సరిచేశారు. అవసరమైతే మరో శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు.
కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ స్కూలుకు వెళ్లగలుగుతున్నాడు. చక్కగా రాయగలుగుతున్నాడు. నాలుగేళ్ల క్రితం నా భార్య సత్యవతి ఇన్‌ఫెక్షన్ కారణంగా చనిపోయింది. అప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలకు నేనే ఆధారం. నా కుమారుడికి నాలుగేళ్లుగా అమ్మ ఒడి డబ్బులు కూడా వస్తున్నాయి. నా కుమార్తె నందిని చిట్టివలస హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. అన్నీ ప్రభుత్వమే ఇస్తున్నందున పిల్లల చదువుకు దిగుల్లేదు. – కటారి భాస్కరరావు, బంగ్లామెట్ట, తగరపువలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస)
Comments
Please login to add a commentAdd a comment