ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
యాచన మాని గౌరవంగా బతుకుతున్నా..
మాది పేద కుటుంబం. విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ దళితవాడలో నేను, మా ఆయన కూలి పనులు చేసుకుని జీవించేవాళ్లం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లు చిన్న వయసులో ఉన్నçప్పుడే మా ఆయన చనిపోయారు. ఆయన వారసత్వంగా వచ్చిన అరకొర ఆస్తితో వాళ్లను పెంచి, పెద్దచేసి పెళ్లుళ్లు చేశాను. వాళ్లకు భారం కాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు తెరువుకోసం యాచన ప్రారంభించా.
అప్పట్లో పింఛన్ వచ్చినా.. ఏ మూలకూ సరిపోయేదికాదు. దానికోసం కూడా ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. పడిగాపులు పడాల్సిన దుస్థితి. నాలుగేళ్ల కిందటి వరకు సిగ్గు విడిచి చుట్టుపక్కల గుడులు, గోపురాల ముంగిట యాచించేదాన్ని. వచ్చిన చిల్లరతో బతికేదాన్ని. జగన్‌బాబు వచ్చాక పింఛన్ పెంచారు. ఇంటికే వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. ఇప్పుడు రూ.3 వేలకు పెంచారు. పొదుపు సంఘాల్లో ఉన్న మా కూతుళ్లు ఇద్దరూ వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల ద్వారా అందుతున్న సొమ్ముతో కూరగాయలు అమ్ముకొని బతుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి సాయంతో మనవరాళ్లు స్కూళ్లలో ఇంగ్లిష్ చదువులు చదువుతున్నారు. జగన్‌బాబు ఇచ్చిన పింఛన్‌తో యాచన మానుకొని గౌరవంగా బతుకుతున్నాను. – బత్తిన అప్పమ్మ, వాడాడ (గొట్టాపు త్రినాథరావు, విలేకరి, విజయనగరం అర్బన్)
నిలదొక్కుకుంటున్నాం..
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. నేను, మా ఆయన ఏడేళ్ల క్రితం వరకు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. మాకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. మా స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం అరకబద్రకు వచ్చిన తర్వాత బతుకు భారంగా మారింది. ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాం.
నేను స్వయం శక్తి సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో మూడేళ్ల క్రితం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేలు రుణం తీసుకున్నా. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా లభించిన రూ.36 వేలతో నేను, నా భర్త కలిసి హోటల్ ప్రారంభించాం. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్తకు, నాకు తీవ్ర గాయాలు కావడంతో హోటల్ మూతబడింది. ఏడాది నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో మరోమారు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేలు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 వంతున రెండు విడతలుగా అందిన సొమ్ముతో రెండు ఆవులను కొనుగోలు చేశాం. ఇప్పుడు వాటి పాలను రోజు వారీ అమ్ముతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. మా జీవితానికి ఢోకా లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకే మా లాంటి పేదలంతా హాయిగా జీవనం సాగిస్తున్నారు. – పొట్నూరు గీత, అరకబద్ర (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్)
కొడుకులా ఆదుకున్నారు
పిల్లలు లేని మాకు వృద్ధాప్యంలో ఈ ప్రభుత్వమే అండగా నిలిచింది. మాది శ్రీకాకుళం. వయసు మీద పడడంతో ఏపనీ చేయలేని స్థితిలో నా భార్య లక్ష్మితో కలిసి ఆరేళ్ల క్రితం విశాఖ వచ్చాము. ఇక్కడ ఆరిలోవ ఆపరేషన్కాలనీలో మా సమీప బంధువు కల్యాణి ఇంట్లో ఉంటున్నాం. ఆమె మమ్మల్ని ఆదరాభిమానంతో చూసుకుంటోంది. ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఈ నెల నుంచి పింఛను డబ్బులు పెరిగాయని వలంటీరు లీలాకృష్ణ మా ఇంటికి వచ్చి రూ.3 వేలు అందించారు. మాకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.
మా ఇద్దరికీ కంటి చూపు మందగించడంతో ఇబ్బంది పడేవాళ్లం. గత నెల 21న ఆరిలోవలో జగనన్న కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. ఆ శిబిరానికి వెళ్లి్న మాకు పరీక్షలు చేసిన డాక్టరు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అదే నెల 23న మా ఇద్దరికీ కంటి ఆపరేషన్ ఉచితంగా చేశారు. దీంతో పాటు నా భార్య లక్ష్మికి చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వచ్చింది. మూడేళ్ల క్రితం ఆమెకు పొట్టలో భరించరాని నొప్పి రావడంతో కేజీహెచ్‌లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేశారు. అనేక విధాలుగా సహాయం అందిస్తూ పిల్లలులేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు. – రోణంకి చిరంజీవులు, విశాఖ (మీసాల కామేశ్వరరావు, విలేకరి, ఆరిలోవ)
Comments
Please login to add a commentAdd a comment