ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
బతుకు బండికి సర్కారే ఇంధనం
నేను దివ్యాంగుడిని. నాకు పదో తరగతి చదువుతున్న సమయంలో అంగ వైకల్యం ఏర్పడింది. విశాఖ కేజీహెచ్‌లో వైద్యం పొందడంతో ఆరోగ్యం బాగు పడింది. డిగ్రీ చదువుతున్న సమయంలో 2014లో మా బంధువుల అమ్మాయి పూర్ణమ్మతో వివాహం అయింది. మాకు పిల్లలు లేరు. కొన్నాళ్లు గడిచాక మళ్లీ రెండు కాళ్లకు అంగవైకల్యం ఏర్పడింది. దీంతో డిగ్రీ ద్వితీయ సంవత్సరంతో మానేశాను.
మాలాంటి వారికి గతంలో ఏ ప్రభుత్వం అందించని సహాయం ఈ ప్రభుత్వ పాలనలో లభిస్తోంది. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం ఎం.నిట్టాపుట్టు గ్రామం. మాకున్న ఎకరం బంజరు భూమిలో వ్యవసాయం చేయగా వచ్చే తిండి గింజలతో, నా భార్య కూలి సొమ్ముతో గతంలో కష్టంగా జీవనం సాగించేవాళ్లం. నాకు 84 శాతం అంగవైకల్యం ఉందని వైద్యుల ధ్రువీకరణతో ఈ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ మంజూరు చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్ ఇంటికి వచ్చి ఆ మొత్తాన్ని అందిస్తున్నాడు.
విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ ప్రభుత్వం రూ.లక్ష విలువ చేసే మూడు చక్రాల స్కూటీని మంజూరు చేసింది. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వస్తోంది. డ్వాక్రా సంఘంలో నా భార్య కొంత అప్పు తీసుకోగా సున్నా వడ్డీతో లబ్ధి చేకూరింది. మా నాన్నకు కూడా వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ప్రభుత్వ సాయంతో మా జీవితం సాఫీగా సాగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వమే మా జీవితాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. – పరదాని జగన్నాథం, ఎం.నిట్టాపుట్టు (చుక్కల వెంకటరమణ, విలేకరి, జి.మాడుగుల)
అనాథనైన నాకు పెద్ద దిక్కయ్యారు
మా ఆయన సీతారాం పదేళ్ల క్రితం కన్ను మూశారు. ఆయన చనిపోయిన కొద్ది రోజులకే మా నాన్న భీముడు, అమ్మ లచ్చమ్మ కూడా వరుసగా కాలం చేశారు. పిల్లలు లేని నేను అనాథగా మిగిలిపోయాను. బతుకు తెరువుకోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గులివిందలపేటలో చిన్నపాటి పనులు చేసుకునేదాన్ని. నిరుపేదరాలినైన నాకు మా గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ దయతో ఓ ఇంటిని సమకూర్చి అందులో ఉండమని చెప్పారు. ఇటీవల అనారోగ్యం కారణంగా పని చేయలేకపోతున్నాను.
ముఖ్యమంత్రి జగనన్న ఇస్తున్న పింఛన్ నాకు ఇప్పుడు అండగా నిలిచింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీ ఉదయాన్నే మా వలంటీర్ ఆ మొత్తాన్ని నా చేతిలో పెడుతున్నారు. రేషన్ బియ్యం ఉచితంగా అందుతున్నాయి. నాకు అవసరమైన మందులు ప్రతి నెలా 104 వాహనం ద్వారా ఉచితంగా సమకూరుతున్నాయి. ఈ ప్రభుత్వం దయతోనే నా అన్న వారు ఎవరూ లేకపోయినా చీకూ చింతా లేకుండా జీవనం సాగిపోతోంది. ముఖ్యమంత్రి జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. – చింతాడ లక్ష్మి, గులివిందలపేట (అల్లు నరసింహారావు విలేకరి, కొత్తూరు)
కష్టకాలంలో ‘ఆసరా’గా నిలిచారు
మాది నిరుపేద కుటుంబం. నా భర్త వడివేలు కూరగాయల దుకాణంలో కూలీగా పని చేసేవాడు. కరోనా సమయంలో వ్యాపారాలు బంద్ కావడంతో పూట గడవక ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. రూ.12 వేలతో తిరుపతి జిల్లా కోటలోని మా కాలనీలోనే కూరగాయల బండి పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాం. తాజా కూరగాయలు అమ్ముతూ వ్యాపారాన్ని విస్తరించాం. జగనన్న తోడు పథకంలో అదనంగా మరో రూ.10 వేలు వచ్చాయి.
ఆ డబ్బులను కూడా వ్యాపారానికి ఉపయోగించాం. దీంతో మా జీవితం గాడిలో పడింది. అప్పులు తీర్చుకుంటూ ఆరి్థకంగా నిలదొక్కుకున్నాం. వైఎస్సార్ ఆసరాలో నాలుగేళ్లు సాయం అందింది. హైసూ్కల్ చదువుతున్న మా అబ్బాయికి అమ్మఒడిలో ఏడాదికి రూ.15 వేలు వస్తోంది. జగనన్న లే అవుట్‌లో మాకు ఇంటి స్థలం కేటాయించారు. ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా బతుకుతున్నాం. మాలాంటి పేదవాళ్లకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. – పేట పావని, కోట (యాకసిరి మధు, విలేకరి, కోట)
Comments
Please login to add a commentAdd a comment