ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
కుటుంబానికి కొండంత ‘ఆసరా’
‘వై ఎస్సార్ ఆసరా కింద రుణ మాఫీ చేయడం మా కుటుంబానికి కొండంత ఆసరాగా నిలిచింది. ఈ డబ్బులతో ఫ్యాన్సీ స్టోర్ నడుపుతూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మాది వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె. నేను మైథిలి మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద మూడు విడతలుగా రుణ మాఫీ చేశారు.
మా సంఘంలో మొత్తం 10 మంది సభ్యులున్నారు. బ్యాంకు ద్వారా మొత్తం రూ.8 లక్షలు రుణంగా పొందాం. అందులో నాకు రూ.80 వేలు వచ్చింది. ఆసరా కింద మా గ్రూపునకు రూ.2,31,171 మాఫీ అయింది. అందులో నాకు రూ.30,822 వచ్చింది. ఈ డబ్బులతో ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభించి నా కాళ్ల మీద నేను బతుకుతున్నాను. కూతురికి పెళ్లి చేశాను. కుమారుడిని డిగ్రీ వరకు చదివించాను. అతను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. మాకు కొంత పొలం ఉంది. నాలుగేళ్లుగా రైతు భరోసా డబ్బులు కూడా వస్తున్నాయి. నా భర్త వ్యవసాయ పనులు చూసుకుంటాడు. ఫ్యాన్సీ స్టోర్ నిర్వహణలో కూడా సహాయ పడుతుంటాడు. భవిష్యత్తు గురించి ఏ దిగులూ లేదు. – పోరెడ్డి మాధవి, నెమళ్లదిన్నె (ఎస్.విశ్వప్రసాద్, విలేకరి, కడప రూరల్)
ఆయుష్షు పెంచిన దేవుడు
రోజూ పనులకు వెళ్తే గాని ఇల్లు గడవని పరిస్థితి మాది. బేల్దారి మేస్త్రీగా చేసే నాకు ఒకసారి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్లాను. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. డయాలసిస్ చేయాలన్నారు. పై ప్రాణాలు పైనే పోయాయి. ప్రభుత్వం డయాలసిస్ పెన్షన్ మంజూరు చేయడంతో క్రమం తప్పకుండా చేయించుకుంటున్నా. మాది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం కంచరగుంట. పేద కుటుంబం. బేల్దారి మే్రస్తిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇప్పటి వరకు నాకు రూ.1.50 లక్షలు పెన్షన్ రూపంలో అందింది.
108 ద్వారా నెలకు 12 సార్లు 30 కి.మీల దూరంలోని మాచర్ల డయాలసిస్ సెంటర్‌కు వెళ్లి వస్తున్నా. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం వల్ల నా జీవన కాలం పెరిగింది. నా ఆయుష్షు పెంచిన దేవుడు జగన్‌మోహన్‌రెడ్డి. నాకు పునర్జన్మ ప్రసాదించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి చదువు పూర్తి కావడంతో పెళ్లి చేశాము. అబ్బాయి చదువుకుంటున్నాడు. ఇద్దరికీ విద్యా దీవెన పథకం ద్వారా సాయం అందింది. మాలాంటి పేదల జీవితాల్లో ఈ ప్రభుత్వం వెలుగులు నింపింది. – బండి శ్రీహరి, కంచరగుంట (ఎం.వెంకటనారాయణ, విలేకరి, దుర్గి)
ఇంటిల్లిపాదికీ లబ్ధి
మాది పేద కుటుంబం. గతంలో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కష్టాలు తీరాయి. మా ఇంట్లో ఉన్న నలుగురికీ ఏదో రూపంలో లబ్ధి చేకూరింది. మేము విశాఖపట్నం నగరంలోని తాటిచెట్లపాలెం సంతోషిమాత కాలనీలో నివాసం ఉ«ంటున్నాము. నేను మొదట్లో బుట్టలో పండ్లు అమ్ముకుని జీవనం సాగించేదాన్ని. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వచ్చిన సొమ్ముతో నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 వస్తోంది.
ఈ డబ్బుతో విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ మెయిన్‌రోడ్డులో తోపుడు బండి ఏర్పాటు చేసుకొని పండ్ల వ్యాపారం చేసుకుంటున్నా. దీని ద్వారా ఒకరిపై ఆధారపడకుండా, ఎవరి వద్దా అప్పు చేయకుండా సొంత కాళ్లపై నిలబడి కుటుంబాన్ని నడిపిస్తున్నా. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా క్రమం తప్పకుండా ఈ చేయూత పథకం మమ్మల్ని మాదుకుంది. నా భర్త ఆటో నడుపుతున్నారు. వాహనమిత్ర ద్వారా ఏటా రూ.పది వేలు ఈ ప్రభుత్వం అందిస్తోంది. దీనివల్ల ఆటో నిర్వహణకు అవసరమైన ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. మా చిన్న పాప సాయి లావణ్య ఇంటర్మిడియట్ వరకు చదువుకుంది.
వలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది.మా పెద్ద పాప ధనలక్ష్మి మానసిక స్థితి బాగోదు. ఆమె దివ్యాంగురాలు కూడా. ఆమెకు దివ్యాంగ పింఛన్ వస్తోంది. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి నెలా రూ.3 వేల పింఛను ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఇలా మా ఇంట్లో ప్రతి ఒక్కరం జగనన్న ద్వారా లబ్ధి పొందాము. – బాదా జయమ్మ, విశాఖపట్నం (పి.విజయ్‌కుమార్, విలేకరి, తాటిచెట్లపాలెం, విశాఖపట్నం)
Comments
Please login to add a commentAdd a comment