ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఆపద వేళ ఆదుకున్న సర్కారు
నా పిల్లలు చిన్నగున్నప్పుడే మా ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి కుటుంబ పోషణ బాధ్యత నాపై పడింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉంటున్నాం. ఏదో ఒక పనికి వెళితేగాని పూట గడిచేది కాదు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. గత ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగానూ ఆదుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నా పరిస్థితి బాగుపడింది. ఏ దిక్కూ లేని మా కుటుంబానికి సంక్షేమ పథకాలు అండగా నిలిచాయి.
వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.28 వేలు వచ్చిది. పెన్షన్ కానుక ప్రతి నెలా వస్తోంది. ఆ డబ్బులతో కిరాణా, కూరగాయల వ్యాపారం ప్రారంభించాను. దాంతోపాటు కుట్టు మెషిన్ కొనుగోలు చేసి ఖాళీ సమయాల్లో బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జగనన్న చేదోడు ద్వారా లబ్ధి పొందాను. అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. దాంతో పిల్లల చదువుల భారం తప్పింది. మా కష్టాలన్నీ తీరాయి. దానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – జుత్తిక వెంకటలక్ష్మి, చేబ్రోలు (సూర్యనారాయణమూర్తి, విలేకరి, గొల్లప్రోలు)
భర్త చనిపోతే అండగా నిలిచారు
నేను ఓ ఇంట్లో పని చేసుకుంటున్నా. కూలి పనులు చేసుకుంటూ నన్ను, పిల్లల్ని పోషించిన మా ఆయన సీతా రామ్‌కుమార్ రెండేళ్ల క్రితం ఆకస్మికంగా చనిపోయారు. అప్పుడు ఈ ప్రభుత్వమే ఆదుకుని మా కుటుంబాన్ని నిలబెట్టింది. విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధిలోని సంతపేటలో నివసిస్తున్న మాకు నా భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం కింద రూ.లక్ష అందించింది. దరఖాస్తు చేసిన వెంటనే వితంతు పింఛన్ మంజూరైంది. నా పెద్ద కుమారుడు కేశవ సాయి శ్రీ ఆంజనేయ సంతపేటలోని అంబేడ్కర్ జీవీఎంసీ హైసూ్కల్‌లో 6వ తరగతి, రెండో అబ్బాయి దిల్వర్ధన్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో 3 తరగతి చదువుతున్నారు.
ఏటా రూ.15 వేల వంతున అమ్మఒడి వస్తోంది. కావలసిన పుస్తకాలు, యూనిఫాం వంటివన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండడంతో పిల్లల చదువు భారం తప్పింది. ప్రతి నెలా ఉచితంగా 15 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇల్లు లేని నాకు ఆనందపురం మండలం జగన్నాథపురంలో రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉంది. మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని ఆశిస్తున్నా. – బోర గౌరి, సంతపేట (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస)
చేనేత వృత్తికి పునరుజ్జీవం
మా తాతల కాలం నుంచి చేనేత వృత్తినే జీవనాధారంగా చేసుకుని కాలం గడుపుతున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొనుసుల కొత్తూరులో బట్టలు నేసుకుని వాటిని అమ్ముకుని జీవించేవాళ్లం. కానీ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ వృత్తిలో కొనసాగడం కష్టమైంది. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వ్రస్తాల తయారీకి అవసరమైన ముడి సరుకు ధరలపై ట్యాక్స్ ఎత్తివేయడంతో కొంత వరకు మాకు సాయ పడింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. బతుకు తెరువుకోసం వలస పోవాలని అనుకున్నాం.
అదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక మా పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా రూ.24 వేలు వంతున నేతన్న నేస్తం పథకం కింద అందించారు. దాంతో మా వృత్తికి కొంత భరోసా లభించింది. ముడి సరుకు తెచ్చుకునేందుకు అప్పు చేయాల్సిన బాధ తప్పింది. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా మొత్తం రూ.1.20 లక్షలు వచ్చిది. మా నాన్నకు వృద్దాప్య పింఛన్, అమ్మకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 వచ్చిది. మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి విద్యుత్ సబ్సిడీ వస్తోంది. ఇంత కంటే మాకింకేం కావాలి? మా సంక్షేమానికి కృషి చేసిన జగనన్న రుణం తీర్చుకుంటాం.
– యర్ర సూర్యనారాయణ, కొనుసులకొత్తూరు (లింగూడు వెంకటరమణ, విలేకరి, టెక్కలి)
Comments
Please login to add a commentAdd a comment