మదనపల్లె పట్టణం ఎస్‌బీఐ కాలనీకి చెందిన బోనాసి జాన్‌బాబు మండల పరిధిలోని ఓ చర్చిలో ఫాదర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన భార్య బోనాసి రేచల్ గృహిణి. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అత్త వెంకటమ్మ ఆలనాపాలనా కూడా వీరిదే. చర్చికి వచ్చే దాతలు ఇచ్చే అరకొర కానుకలతో కుటుంబ పోషణ భారంగా నడిచేది. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులెలా? అన్న భయం వెంటాడేది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబం దిశ తిరిగింది. సంక్షేమ పథకాలు ఆ ఇంటి ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాయి.
పాస్టర్ జాన్‌బాబు పెద్ద కుమారుడు బోనాసి విలియయ్‌బాబు మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చేశాడు. విద్యాదీవెన కింద రూ.3,28,000, వసతి దీవెన కింద రూ.20,800 అందాయి. దీంతో విజయ్‌బాబు చదువు సాఫీగా సాగింది. బీటెక్ పూర్తవడంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం 2023లో విదేశీ విద్యాదీవెన కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.51 లక్షలు మంజూరైంది. ప్రస్తుతం అస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న మోనాస్ యూనివర్సిటీలో ఎంఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు.
కుమార్తె బోనాసి ఏంజెల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకు రూ.75 వేలు లబ్ధి చేకూరింది. చిన్నబ్బాయి బోనాసి బిడియన్ 7వ తరగతి చదువుతున్నాడు. జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఇలా చదువుకు అవసరమైనవన్నీ ప్రభుత్వం ఉచితంగా అందించింది. పైసా ఖర్చు లేకుండానే తన బిడ్డల్ని చదివించుకుంటున్నట్లు జాన్‌బాబు తెలిపారు. పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనంతో సగర్వంగా బతుకుతున్నట్లు చెప్పారు. ఆయన అత్త వెంకటమ్మకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. –మదనపల్లె సిటీ
కుటుంబ ఆర్థిక పరిస్థితిలో గణనీయ మార్పు
గతంలో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే కష్టంగా ఉండేది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వీరి జీవన ప్రమాణాలు పెరిగాయి. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెనలతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇలాంటి విద్యార్థుల ఎదుగుదల, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్ని సమూలంగా మార్చివేస్తున్నాయి.
– ఎం.నాగేంద్ర, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, బీటీ కళాశాల, మదనపల్లె
కుటుంబసభ్యులతో జాన్‌బాబు
► జాన్‌బాబు కుటుంబానికి కలిగిన లబ్ధి విదేశీ విద్యాదీవెన రూ.51,00,000
►విద్యాదీవెన రూ.3,28,000
►వసతి దీవెన రూ.20,800
►అమ్మ ఒడిరూ.75,000
►సున్నా వడ్డీ రూ.1,167
►ఇంటి స్థలం రూ.6,00,000
►పాస్టర్ల గౌరవ వేతనం రూ.1,25,000
Comments
Please login to add a commentAdd a comment