పేదల కోసం పెత్తందారులపై పోరాటాలెన్నో చేశాం: సీఎం జగన్‌ | AP CM YS Jagan Speech At Ongole Public Meeting | Sakshi
Sakshi News home page

పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

Published Fri, Feb 23 2024 12:17 PM | Last Updated on Fri, Feb 23 2024 1:31 PM

AP CM YS Jagan Speech At Ongole Public Meeting - Sakshi

58 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు ఎన్నో తెచ్చామని సీఎం జగన్‌.. 

ప్రకాశం, సాక్షి: చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారాయన.  

.. ‘‘మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం.  చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారాయన. 

.. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్‌ ఒంగోలు సభలో గుర్తు చేశారు. అలాగే ఇంటింటికీ తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని.. 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారాయన.

  • వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నాం
  • ఆరోగ్యశ్రీ రిధిని రూ.25 లక్షలకు పెంచాం
  • ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,300కు పెంచాం
  • ఆస్పత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
  • రోగులు కోలుకునే వరకు ఆసరాగా ఉంటున్నాం
  • గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement