గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
-
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
జిల్లాలో మంజూరైన గృహ నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఏఏవై ద్వారా కేటాయించిన గృహనిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన ఇటుకలు సరఫరా చేయాలన్నారు. ఎన్‌టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. వచ్చే నెల 15వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. గృహ నిర్మాణాలకు సంబంధించి తహసీల్దార్ల సమన్వయంతో భూములు గుర్తించాలన్నారు. వైఎస్‌ఆర్‌నగరలో కేటాయించిన 6000ల గృహాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాకు ఆధార్ అనుసంధానం చేసి వివరాలు అందజేయాలని తెలిపారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థలాలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, ఈఈ సాయిబాబా పాల్గొన్నారు.