భారతదేశంలో రోడ్డు, రవాణా వ్యవస్థ రోజు రోజుకి విస్తరిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల అభివృద్ధికి కావలసిన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి దేశంలోని రాష్ట్రాలు కూడా సహకరిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశాల జాబితాలో భారత్.. చైనాను అధిగమించిందని 'ది వరల్డ్ ర్యాంకింగ్' నివేదిక ద్వారా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాతీయ రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2019 నుంచి 2023 వరకు రాష్ట్రంలో 2300 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. 2014 నుంచి 2018 వరకు జరిగిన జాతీయ రహదారుల నిర్మాణంతో (1713 కిమీ) పోలిస్తే 2019-23 వరకు జరిగిన రోడ్డు నిర్మాణం 587 కిమీ ఎక్కువగా ఉంది.
ఆర్‌అండ్‌బీ ద్వారా నిర్మాణాల్లోనూ..
కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రహదారుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సమర్థతను నిరూపించుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా గతేడాది కూడా కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో నిధులను సాధించింది. 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు రాబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల ప్రాజెక్టులను పరిశీలిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు మంజూరు చేయడం విశేషం.
ఇదీ చదవండి: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్
2014-18తో పోలిస్తే.. జాతీయ రహదారుల నిర్మాణం చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా - మండల కేంద్రాలను అనుసంధానించే రహదారులను వేగంగా అభివృద్ధి చేసే దిశగా సీఎం జగన్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment