ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్ల పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రాజెక్ట్ కోట్లలో ఉంటుంది గానీ నాణ్యత పరంగా మాత్రం తేలిపోతుంది. ఈ తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కనీసం ఆరు నెలలు కూడా కాకుండానే వేసిన రోడ్డు నాశనం అయ్యింది.ఆ రోడ్డు నాణ్యతను చెక్ చేసిన ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల జఖానియన్ ప్రాంతంలోని జంగీపూర్-బహరియాబాద్-యూసుఫ్‌పూర్‌లను కలుపుతూ 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణం విషయంలో రోడ్డు నాణ్యత కాంట్రాక్టర్ గాలికి వదిలిశాడు. భారతీయ సమాజ్ పార్టీకి చెందిన సుహెల్‌దేవ్ శాసనసభ్యుడు బెదిరామ్ ఆ రోడ్డుకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎమ్మెల్యే ఆ రోడ్డు పరిశీలినకు వెళ్లి.. దాని నాణ్యతను చూసి షాకయ్యాడు. సాధారణంగా తారు రోడ్డు అంటే టన్నుల బరువున్న వాహనాలు ప్రయాణించిన తట్టుకుని నిలబడాలి.
అయితే ఆ రోడ్డు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కాలు పెట్టినా కదిలిపోతోంది. దీంతో ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై స్పందిస్తూ.. "నేను రోడ్డు నాణ్యత పరిశీలనకు వెళ్లిన సమయలో అక్కడ పిడబ్ల్యుడి (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) అధికారి ఎవరూ లేరు. నేను కాంట్రాక్టర్‌తో ఈ సమస్యను లేవనెత్తాను. పిడబ్ల్యుడి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను, రహదారిని ప్రమాణాల ప్రకారం నిర్మించలేదని వాళ్లతో చెప్పాను. ఈ రోడ్డు మరి దారుణంగా ఉంది, దీని నిర్మించి కనీసం ఆరు నెలలు కూడా మించలేదని ఫైర్ అయ్యారు. అయితే ఆ రాష్ట్రంలో నాసిరకం రోడ్లు వెలుగులోకి రావడం ఇదేం మొదటిసారి కాదు.
@ACOUPPolice
— Sanjay Singh (@SANJAYK98610543) March 30, 2023
Corruption in road construction
Jakhiniya Ghazipur UP pic.twitter.com/d9bT5rP4BX
Comments
Please login to add a commentAdd a comment