bt road
-
ఇదేనా రోడ్డు? దీనిపై కారు నడిపి చూపించండి.. కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్!
ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్ల పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రాజెక్ట్ కోట్లలో ఉంటుంది గానీ నాణ్యత పరంగా మాత్రం తేలిపోతుంది. ఈ తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కనీసం ఆరు నెలలు కూడా కాకుండానే వేసిన రోడ్డు నాశనం అయ్యింది.ఆ రోడ్డు నాణ్యతను చెక్ చేసిన ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జఖానియన్ ప్రాంతంలోని జంగీపూర్-బహరియాబాద్-యూసుఫ్పూర్లను కలుపుతూ 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణం విషయంలో రోడ్డు నాణ్యత కాంట్రాక్టర్ గాలికి వదిలిశాడు. భారతీయ సమాజ్ పార్టీకి చెందిన సుహెల్దేవ్ శాసనసభ్యుడు బెదిరామ్ ఆ రోడ్డుకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎమ్మెల్యే ఆ రోడ్డు పరిశీలినకు వెళ్లి.. దాని నాణ్యతను చూసి షాకయ్యాడు. సాధారణంగా తారు రోడ్డు అంటే టన్నుల బరువున్న వాహనాలు ప్రయాణించిన తట్టుకుని నిలబడాలి. అయితే ఆ రోడ్డు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కాలు పెట్టినా కదిలిపోతోంది. దీంతో ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై స్పందిస్తూ.. "నేను రోడ్డు నాణ్యత పరిశీలనకు వెళ్లిన సమయలో అక్కడ పిడబ్ల్యుడి (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) అధికారి ఎవరూ లేరు. నేను కాంట్రాక్టర్‌తో ఈ సమస్యను లేవనెత్తాను. పిడబ్ల్యుడి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను, రహదారిని ప్రమాణాల ప్రకారం నిర్మించలేదని వాళ్లతో చెప్పాను. ఈ రోడ్డు మరి దారుణంగా ఉంది, దీని నిర్మించి కనీసం ఆరు నెలలు కూడా మించలేదని ఫైర్ అయ్యారు. అయితే ఆ రాష్ట్రంలో నాసిరకం రోడ్లు వెలుగులోకి రావడం ఇదేం మొదటిసారి కాదు. @ACOUPPolice Corruption in road construction Jakhiniya Ghazipur UP pic.twitter.com/d9bT5rP4BX — Sanjay Singh (@SANJAYK98610543) March 30, 2023 -
ఫ్లెక్సీల ఏర్పాటు కోసం టీడీపీ నాయకుల నిర్వాకం
చీపురుపల్లి: తారు రోడ్లు బాగోలేవంటూ టీడీపీ నాయకులు లేనిపోని ఆర్భాటం చేస్తారు. వారు చేసిన హడావుడికి తగ్గట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అదే తెలుగుదేశం నాయకులు సమావేశాల పేరిట ఏర్పాటు చేసే ఫ్లెక్సీల కోసం ఎంతో పటిష్టంగా ఉన్న బీటీ రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చీపురుపల్లి పట్టణంలో ఆదివారం ఇదే సంఘటన జరిగింది. గరివిడి మండలంలోని కుమరాం పంచాయతీ సర్పంచ్ ముల్లు రమాదేవి టీడీపీలో చేరుతున్న సందర్భంగా పట్టణంలోని తారురోడ్లు తవ్వేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చక్కగా ఉన్న రోడ్లను తవ్వేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చీపురుపల్లిలోని మూడు రోడ్ల జంక్షన్, గెడ్డమిల్లు, ఆంజనేయపురం, అగ్రహారం, గరివిడి, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటి కోసం నాలుగైదు నెలల కిందట కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బీటీ రోడ్లను గోతులుగా మార్చేశారు. టీడీపీ మద్దతుతో గెలిచి.... గరివిడి మండలంలోని కుమరాం పంచాయతీ సర్పంచ్ ముల్లు రమాదేవి గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలుపొందారు. ఆ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు పోటీ చేయకుండా ముల్లు రమాదేవికి పార్టీ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. దీంతో ఆమె గెలుపొందారు. ఇదంతా జరిగి చాలా కాలం గడిచిపోయింది. అయితే రమాదేవి ప్రస్తుతం టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ మద్దతుతో గెలిచి మళ్లీ అదే పార్టీలో చేరడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
నాణ్యత ‘ఈశ్వరుని’కి ఎరుక!
అధ్వానంగా కనిపిస్తున్న ఈరోడ్డు పెద్దపాడు నుంచి లక్ష్మీపురంకెళ్లే దారి. 4.10 కి.మీ. దూరం గల ఈ రోడ్డుకు రూ. 2.67 కోట్లు ఖర్చు చేశారు. పట్టుమని మూడేళ్లు కూడా పూర్తికాక ముందే కంకర, రాళ్లు తేలి శిథిలమైంది. హైదరాబాద్‌కు చెందిన ఈశ్వర్‌రెడ్డి అండ్ కంపెనీ కాంట్రాక్టర్ ఈ పనులు చేపట్టారు. పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీ రాజ్ అధికారులు ఆ సమయంలో ఎక్కడున్నారో తెలియదు కానీ సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం నాణ్యతకు నీళ్లొదిలారు. తద్వారా కోట్ల రూపాయలు మింగేశారనే విమర్శలున్నాయి. కర్నూలు, కల్లూరు (రూరల్): ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం కల్లూరు మండలం పరిధిలోని లక్ష్మీపురం – పెద్దపాడుకు 2015లో రూ. 2.67 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేసింది. 4.10 కిలో మీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు పనులను ఈశ్వర్‌రెడ్డి అండ్ కంపెనీ దక్కించుకుంది. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తూతూ మంత్రంగా పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఫలితంగా మూడేళ్లకే తారు పెచ్చులూడి కంకర, రాళ్లు తేలాయి. ప్రస్తుతం ఈ రోడ్డులో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు అదుపుతప్పి కిందపడుతున్నాయి. ఇంత అధ్వానంగా బీటీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌కు పంచాయతీరాజ్ అధికారులు నిధులు ఏ విధంగా విడుదల చేశారో నిఘా వర్గాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పత్తాలేని నిర్వహణ: బీటీ రోడ్డు నిర్వహణను సదరు కాంట్రాక్టర్ గాలికొదిలేశారు. రోడ్డు దెబ్బతినకుండా చూసుకోవాలని, డ్యామేజ్ అయితే మరమ్మతులు చేయాలని 2015–16లో రూ.1.52 లక్షలు, 2016–17లో రూ.1.88 లక్షలు, 2017–18 రూ.2.28 లక్షలు, 2018–19 సంవత్సరంలో రూ.2.65 లక్షలు, 2019–20 సంవత్సరంలో రూ.3.3 లక్షల చొప్పున ఐదేళ్లలో రూ.11.39 లక్షలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మూడో సంవత్సరం నుంచే బీటీ రోడ్డు అడ్రస్ లేకుండా పోయింది. నిర్వహణ కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినట్లు దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై కూడా నిఘా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రోడ్డు శిథిలమైంది పెద్దపాడు మీదుగా లక్ష్మీపురం వెళ్లే బీటీ రోడ్డు కిలో మీటర్ మేర పూర్తిగా శిథిలమై కంకర తేలడంతో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పుతున్నాయి. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. బీటీ రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలి.అమృతరాజు, పెద్దపాడు గ్రామం -
మృత్యు పిలుపు.. ఆ మూలమలుపు!
సాక్షి,మోత్కూరు:మండలంలోని పాటిమట్ల గ్రామం శివారులో ఉన్న మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మోత్కూరు నుంచి పాటిమట్ల చెరువుకట్ట వరకు రూ.10 కోట్లతో డబుల్ బీటీ రోడ్డును నిర్మించారు. పాటిమట్ల బృందావన్ కల్వర్టుపై నిర్మించిన రక్షణ గోడలు సరైన ఎత్తులో లేకపోవడం, ప్రమాదాల హెచ్చరికల బోర్డులు లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్వర్టు వద్దే మూలమలుపు ఉండటంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పి పల్టీ కొడుతున్నాయి. ఇటీవల డీసీఎం అదుపుతప్పి కాల్వలోకి పల్టీకొట్టింది. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. రెండు నెలల్లో పది ప్రమాదాలు.. రెండునెలల క్రితం పూర్తయిన డబుల్ బీటీ రోడ్డుపై ఇప్పటికి పది ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ అర్అండ్బీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రోడ్డుపై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు, ప్రజలు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం కాల్వర్టు నిర్మించకపోకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 4న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్యాతండకు చెందిన ఇస్లావత్ సతీష్ అనే కారుడ్రైవర్ మూలమలుపు వద్ద కారు పల్టీకొట్టి అక్కడిక్కకడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా రెండునెలల కాలంలో వాహనాలు అదుపుతప్పి సుమారు 50 మందికి పై చిలుకు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరగకుండా రక్షణగోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. కల్వర్టు పక్కన కాల్వలో పల్టీకొట్టిన కారు. డీఈ వివరణ... ఈ విషయమై డీఈ షహనాజీని వివరణ కోరగా.. రహదారిపై మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని తెలిపారు. ఎన్నికల అనంతరం పనులను పూర్తిచేస్తామన్నారు. రెండు నెలల్లో పది ప్రమాదాలు మూలమలుపు కల్వర్టు వద్ద, సమీపంలో సుమారు పది ప్రమాదాలు జరిగాయి. కార్లు, బైక్‌లు, ఆటోలు, డీసీఎంలు అదుపుతప్పి పలువురు గాయపడ్డారు. మా గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీనర్సింహారెడ్డి రెండు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. – బండ సంజీవరెడ్డి, పాటిమట్ల కల్వర్టు గోడ ఎత్తు పెంచాలి మూలమలుపు వద్ద బృందావన్ కాల్వపై నిర్మించిన కల్వర్టు గోడలకు ఇరువైపులా ఎత్తు పెంచాలి. సుమారు వందమీటర్ల దూరం ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలి. దీంతో ప్రమదాలను నివారించవచ్చు. –కుర్మెటి యాదయ్య , పాటిమట్ల -
రూ.7కోట్లతో బీటీ రోడ్డు
► భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ‘గంగుల’ కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం ఎలగందుల–ఐలవానిపల్లి(ఖాజీపూర్) వరకు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూ.7కోట్ల నిధులతో బీటి రోడ్డును నిర్మిస్తున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. మండలంలోని ఖాజీపూర్‌లో రూ.4 కోట్ల బీటిరోడ్డు పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఖాజీపూర్‌లోని ఇసుకక్వారీతో పంటలు పాడవుతున్నాయని మంత్రి హరీష్‌రావుకు విన్నవించగా.. టీఎస్ఎండీసీ కింద రోడ్డు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రయాణదూరం తగ్గుతుందన్నారు. ఖాజీపూర్–సిరిసిల్ల, ఖాజీపూర్–ఎలగందుల–కరీంనగర్‌లకు సులువైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని చెప్పారు. ఖాజీపూర్‌కు రవాణా సౌకర్యంలేని పరిస్థితుల నుంచి కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక వసతులు కల్పించుకునే పరిస్థితికి వచ్చామన్నారు. అభివృద్ధి పనులకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఇళ్లు, భూములు కోల్పోయిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గంలోని రోడ్లన్నంటినీ సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, సర్పంచ్ రామగిరి అలువేనిమంగ శేఖర్‌రావు, ఏఎంసీ వైస్‌చైర్మన్ జె.రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తుల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపల్లెకు బీటీరోడ్డు
పంచాయతీ, అంగన్వాడీలకు నూతనభవనాలు పంచాయతీరాజ్ సీఈ సత్యనారాయణరెడ్డి షాద్‌నగర్ రూరల్: రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతిపల్లెకు బీటీరోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8695 గ్రామపంచాయతీలు ఉన్నాయని, అందులో 460పంచాయతీలకు బీటీరోడ్లు లేవని చెప్పారు. అన్ని పంచాయతీలకు బీటీ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గురువారం పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 460 గ్రామపంచాయతీలకు బీటీ రోడ్డు లేదని, అందులో పాలమూరు జిల్లాలోనే 185 ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1000 నూతనపంచాయతీ భవనాలు, 1063 నూతన అంగన్వాడీ భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మహబూబ్నగర్జిల్లాకు 144 నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరు అయ్యాయని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 264 భవనాలను త్వరలోనే పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. అంగన్వాడీ, పంచాయతీ, మహిళాసమాఖ్య భవన నిర్మాణాలను పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోనే చేపట్టనున్నామని తెలిపారు. 1163 అంగన్‌భవనాలను అక్టోబర్31 నాటికి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాకు 74 అంగన్వాడీ భవనాలు జిల్లాకు 74 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. రూ. 8లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడతగా 1064 అంగన్‌వాడీభవనాల్లో 550 అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు రూ. 3లక్షల చొప్పున ఐసీడీఎస్, రూ.5లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కేటాయిస్తామని తెలిపారు. నూతన భవనాల నిర్మాణాలలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ జిల్లాఎస్‌ఇ రఘు, ఎగ్జిక్యూటివ్‌ఇంజనీర్ అశోక్, షాద్‌నగర్ డిప్యూటి ఇఇ సంజీవచారి, ఎఇలు శ్రీనివాసులు, యాదగిరి, ఎం.శ్రీనివాస్, భూపాల్, కిశోర్‌బాబు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
పాత బైపాస్కు పునర్వైభవం
నాగార్జునసాగర్ : సాగర్‌లోని పైలాన్ ముత్యాలమ్మ గుడి నుంచి శివంహోటల్ వరకు గల రోడ్డుకు పునర్ వైభవం రానుంది. ఈ రోడ్డును పునరుద్ధరించి బైపాస్‌గా మారిస్తే హిల్‌కాలనీ రహదారులపై రద్దీ తగ్గుతుందని సాక్షి ప్రచురించిన కథనాలకు అధికారులు స్పందించారు. ముత్యాలమ్మగుడి దగ్గరినుండి శివం హోటల్ వరకు 5.8 కిలో మీటర్లు బీటీ వేసేందుకు రూ.2.77 కోట్లతో టెండర్లు పిలిచి ఆపనులను ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆగస్టు 5వ తేదీ లోగా పూర్తయ్యేలా పనులను చురుగ్గా నిర్వహిస్తున్నారు. -
రూ.1,765 కోట్లలతో బీటీ రోడ్ల పునరుద్ధరణ
పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సాక్షి, హైద రాబాద్: రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని రోడ్లతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా బీటీ(తారు) రోడ్ల పున రుద్ధరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తొలిదశలో రూ.1.765 కోట్లతో 12,006 కిలోమీటర్ల బీటీరోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. బుధవారం పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్‌చీఫ్, ఇతర ఉన్నతాధికారులతో బీటీ రోడ్ల పునరుద్ధరణ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని, అయితే నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే జరిమానా విధించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) ప్రమాణాల మేరకు రహదారులను నిర్మించడంతో పాటు, ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదేనని కేటీఆర్ చెప్పారు. పునరుద్ధరణ పనులకు సంబంధించి నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని, నాణ్యత లోపిస్తే అధికారులపైనా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్ కాంట్రాక్ట్‌ల విధానానికి స్వస్తి పలికేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,160 కిలోమీటర్ల మట్టిరోడ్లను బీటీస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రూ.2,035 కోట్లు, సుమారు 20 వేల కిలోమీటర్ల మట్టి రోడ్ల పటిష్టానికి కూడా రూ.600 కోట్లు కేటాయించామన్నారు.