పోలాండ్ దేశం తమ ప్రాంతాల్లోని రహదారులకు, స్కూళ్లకు ఒక భారతీయ రాజు పేరు పెట్టి మరీ గౌరవించింది. అంతలా విదేశీయలుచే గౌరవింపబడుతున్న ఆ రాజు ఎవరూ? అతడేం చేశాడంటే..
రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ ఆర్మీ తమ దేశంలోని 600 మంది మహిళలను పిలలను ఒక ఓడలో వేరే దేశానికి వెళ్లిపోమని చెప్పి పంపించేశారు. ఏ దేశం రక్షణ కల్పిస్తే అక్కడ ఆశ్రయం పొందమని చెప్పి మరీ వారందర్నీ షిప్‌లో పంపించేశారు. అయితే వాళ్లకు ఏ దేశం ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. చివరకు వాళ్ల ఓడ మంబై పోర్టుకు చేరుకుంది. అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ సైతం వీరికి ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ విషయం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన మహారాజ్ దిగ్విజయ్ సింగ్ రంజిత్ సింగ్ జడేజా తెలిసింది.
వెంటనే ఆయన తన రాజ్యంలో పోలిష్ శరణార్థులకు, పిల్లలకు ఆశ్రయం ఇచ్చాడు. వారందరీ కోసం తన ప్యాలెస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఒక ప్యాలెస్‌ని నిర్మించి ఇచ్చాడు. వారందర్నీ తన స్వంత కుటుంబంలా చూసుకున్నాడు. వారి పిల్లలకు స్కూళ్లు, ఆహారశైలికి సంబంధించిన గోవా వంటవాళ్లను ఏర్పాటు చేశాడు. అలా వాళ్లు దాదాపు తొమ్మిదేళ్లపాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనే ఆశ్రయం పొందారు.
ఆ తర్వాత వారంతా దేశానికి వెళ్లిపోయారు. ఏ దేశం ఆశ్రయం ఇవ్వకపోయిన ఆ భారతీయ రాజు ఎంతో సహృద్భావంతో తమకు ఆశ్రయం ఇచ్చాడని కొనియాడుతూ..ఆ రాజుని పోలాండ్ అత్యున్నత మెడల్‌తో సత్కరించింది. అంతేగాదు ఆ భారతీయ రాజు మానవత్వంతో చేసిన నిస్వార్థ సేవకు గుర్తుగా తమ దేశంలోని రహదారులకు, స్కూళ్లకు ఆయన పేరు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment