
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: ఈ రోడ్డును చూశారా.. స్ట్రెయిట్‌గా భలే ఉంది కదా! చూస్తుంటే ఇదేదో పాత రోడ్డు అని కూడా అనిపిస్తోంది కదా.. నిజమే ఈ రోడ్డుకు రెండు వేల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 312లో ఈ రోడ్డును అప్పటి రోమన్ సామ్రాజ్య అధినేతలు నిర్మించారు.
ఇటలీ ఆగ్నేయ ప్రాంతం బ్రిండిసీ నుంచి 400 మైళ్ల దూరంలోని ప్రధాన నగరం రోమ్‌ను కలుపుతూ నిర్మించిన రోడ్డు ఇది. అప్పియన్ వేగా పిలిచే ఈ రోడ్డును రాజనీతిజ్ఞుడు అప్పియస్ క్లాడియస్ సీజస్ పేరుపై నిర్మించారు.
దక్షిణ ఇటలీని వశం చేసుకోవడం కోసం మిలిటరీని తరలించడానికి, అలాగే గ్రీస్, ఈజిప్టుకు నౌకాయానం కోసం అప్పటి రోమ్ పాలకులు దీనిని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని యూరప్ మొట్టమొదటి సూపర్ హైవేగా కూడా చెబుతారు.
చదవండి: జపాన్‌లో టీచర్స్ డే ఎలా జరుపుకుంటారో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment