Thunder lightning created chaos on the road, video goes viral - Sakshi
Sakshi News home page

ఆకాశాన్ని చీల్చి, రోడ్డును తాకి, అగ్నిగోళంలా మారి.. వణికిస్తున్న పిడుగు వీడియో!

Published Mon, Jul 17 2023 11:44 AM | Last Updated on Mon, Jul 17 2023 11:57 AM

thunder lightning created chaos on the road - Sakshi

సోషల్‌ మీడియాలో మరో వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారు ప్రకృతి విపత్తు ఇంత భయంకరంగా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో ఉన్న కంటెంట్‌ ‍ప్రకారం ఒక రోడ్డుపై కారు వెళుతూ ఉంటుంది. ఇంతలో ఆకాశాన్ని చీల్చుకుంటూ, ఒక పిడుగు భూమిని తాకుతుంది. ఆ తరువాత అక్కడ ఏ‍ర్పడిన దృశ్యం భీతావహంగా ఉంది. 

ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీవర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ పలు ప్రాంతాలను జలమయం చేస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు పలు అవస్థలకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పిడుగుల ప్రమాదం కూడా పొంచివుంటోంది. పిడుగులు పడి పలువురు మృతిచెందుతున్న సంఘటనలు కూడా విరివిగా చోటుచేసుకుంటున్నాయి. 

తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నవీడియోలో రోడ్డుపై కారు వెళుతుండగా,పిడుగు పడటం కనిపిస్తుంది. కారుపై అదారుసార్లు పిడుగు పడినట్లు కనిపిస్తుంది. ఈ పిడుగు ఎంతో శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. దీనిని చూసినవారు భయానికి లోనవుతున్నారు. ఈ పిడుగుపడిన కొద్దిసేపటికి కారు నుంచి నల్లని పొగ రావడాన్ని మనం గమనించవచ్చు. 

ఈ భయంకరమైన పిడుగుపాటు వీడియోను సోషల్‌మీడియా సైట్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ భయానక వీడియో @explosionvidz పేరున గల ట్విట్టర్‌ హ్యాండిల్‌లో షేర్‌ అయ్యింది. దీనికి క్యాప్షన్‌గా స్లో మో ఫుటేజ్‌ ఆఫ్‌ ఏ లైటింగ్‌ స్ట్రైక్‌ అని రాశారు. ఈ వైరల్‌ వీడియోకు ఇప్పటివరకూ 39.7 వేల వ్యూస్‌ వచ్చాయి. కాగా ఈ పిడుగుపాటు కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
 

ఇది కూడా చదవండి:  సిరులు కురిపించే బొద్దింకల పెంపకం..హాట్‌హాట్‌గా అమ్మడవుతున్న కాక్రోచ్‌ స్నాక్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement